ఆ రోజు ఐపీఎల్ ఫైనల్ జరగకపోతే..
ముంబై: తాజా ఐపీఎల్-10 సీజన్‌లో ఒక్క ఫైనల్ మ్యాచ్‌కు మాత్రమే రిజర్వ్‌డే ఖరారుచేశారు. మే 21న హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఏదేని కారణాల వల్ల ఆ రోజు మ్యాచ్ నిర్వహణ సాధ్యం అవకపోతే అభిమానులు నిరుత్సాహ పడనక్కర్లేదు. ఆ మరుసటి రోజు అంటే మే 22వ తేదీన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తారు.
అయితే అంతకుముందు జరగనున్న లీగ్‌లోని మూడు ప్లే ఆఫ్ మ్యాచ్ మ్యాచ్‌లకు మాత్రం రిజర్వ్ డే ఉండదని బీసీసీఐ వెల్లడించింది. తొలి క్వాలిఫయర్ మే 16న ముంబైలో, ఎలిమినేటర్ మ్యాచ్ మే 17న బెంగళూరులో నిర్వహించనున్నారు. రెండో క్వాలిఫయర్ మ్యాచ్ కూడా బెంగళూరులోనే మే 19న నిర్వహిస్తారు. మే 21న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్డేడియం వేదిక కానున్న విషయం తెలిసిందే.