ఐపీఎల్-2023 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ అడుగుపెట్టింది. అహ్మదాబాద్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన క్వాలిఫియర్-2లో 62 పరుగుల తేడాతో విజయం సాధించిన గుజరాత్.. వరుసగా రెండో సారి ఫైనల్‌కు చేరుకుంది. తద్వారా గుజరాత్ టైటాన్స్ ఓ అరుదైన ఘనతను తమ పేరిట లిఖించుకుంది.
ఐపీఎల్‌లో తమ తొలి రెండు సీజన్‌లలో వరుసగా ఫైనల్‌కు చేరిన మొదటి జట్టుగా గుజరాత్ చరిత్ర సృష్టించింది. గతేడాది క్వాలిఫియర్-1లో రాజస్తాన్‌ను ఓడించి ఫైనల్‌కు చేరిన గుజరాత్.. ఈ సారి మాత్రం క్వాలిఫియర్-2 ఆడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. శుబ్‌మన్ గిల్(129) సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 233 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
అనంతరం లక్ష్య ఛేదనలో 171 పరుగులకే ముంబై ఆలౌటైంది. ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్(61), తిలక్ వర్మ(43) అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ.. తమ జట్టును గెలిపించుకోలేకపోయారు. ఇక గుజరాత్ బౌలర్లలో మొహిత్ శర్మ 5 వికెట్లు పడగొట్టగా.. షమీ, రషీద్ ఖాన్ తలా రెండు వికెట్లు సాధించాడు
ఇదే తొలిసారి..
అదేవిధంగా ఈ ఏడాది సీజన్‌లో తొలి మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా గుజరాత్-చెన్నై మధ్య జరిగిన సంగతి తెలిసిందే. అయితే యాదృచ్చకంగా ఆఖరి మ్యాచ్(ఫైనల్) కూడా ఈ రెండు జట్లే మధ్యే జరగునుంది. వేదిక కూడా ఒక్కటే కావడం గమానర్హం. ఇలా జరగడం 16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇదే మొదటి సారి.
ఇక మే28న అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తాడోపేడో తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ఐదో సారి టైటిల్‌ను ముద్దడాలని సీఎస్‌కే భావిస్తుంటే.. గుజరాత్ కూడా వరుసగా రెండో సారి ట్రోఫీని సొంతం చేసుకోవాలని యోచిస్తోంది.
చదవండి: WTC final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు టీమిండియాకు ఊహించని షాక్!
Comments
Please login to add a commentAdd a comment