న్యూఢిల్లీ: ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) కు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ (జీసీ) పెద్ద ఝలక్ ఇచ్చింది. జూన్ 1న జరగనున్న ఐపీఎల్ ఫైనల్‌ను వాంఖడే నుంచి బెంగళూరు చిన్నస్వామి స్టేడియానికి తరలించింది. క్వాలిఫయర్స్ మ్యాచ్‌ల్లో ఒకదాన్ని ఈడెన్ గార్డెన్స్‌లో, ఎలిమినేటర్ మ్యాచ్‌ను బ్రబౌర్న్‌లో నిర్వహించనున్నారు. శనివారం జరిగిన ఐపీఎల్ జీసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే వేదిక మార్పుకు సంబంధించి స్పష్టమైన కారణాన్ని బీసీసీఐ వెల్లడించకపోవడంతో ఎంసీఏ ఆగ్రహంతో ఊగిపోతోంది. దీనిపై వివరణ ఇవ్వాలని ఐపీఎల్ చైర్మన్ బిస్వాల్‌కు లేఖ రాసింది.
వేదిక మార్పుపై గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి హాజరైన వ్యక్తులు కూడా నోరు మెదపడం లేదు. అయితే వాంఖడే ఆతిథ్య బాక్స్‌లో సౌకర్యాలు బాగాలేవని, మ్యాచ్‌ను తిలకించేందుకు వచ్చే ఉన్నతస్థాయి వ్యక్తుల ముందు ఇది చిన్నచూపుగా ఉంటుందని బోర్డు చెబుతోంది. బీసీసీఐ సభ్యులకు వీవీఐపీ కారు పార్కింగ్ పాస్‌లను ఇవ్వడంలో ఎంసీఏ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వాదిస్తోంది. పొలార్డ్ (ముంబై), స్టార్క్ (బెంగళూరు)ల గొడవపై కూడా జీసీలో చర్చించారు. సభ్యులందరూ దీన్ని తీవ్రంగా ఖండించారు. మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు.
ఐపీఎల్ ఫైనల్ బెంగళూరులో
Published Sun, May 11 2014 1:38 AM | Last Updated on Sat, Sep 2 2017 7:11 AM
Advertisement