PC: IPL Twitter
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని చరిత్ర సృష్టించనున్నాడు. గుజరాత్‌తో నేడు (మే 28) జరుగబోయే ఫైనల్ మ్యాచ్ ఆడటం ద్వారా ఐపీఎల్‌లో 250 మ్యాచ్‌ల మైలురాయిని చేరుకోనున్నాడు. ఐపీఎల్ హిస్టరీ ఇప్పటివరకు ఏ ఆటగాడు కూడా 250 మ్యాచ్‌లు ఆడలేదు. ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా ధోని రికార్డుల్లోకెక్కనున్నాడు.
ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో ధోని తర్వాత ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ (243), ఆర్సీబీ వికెట్‌కీపర్ దినేశ్ కార్తీక్ (242), ఆర్సీబీ విరాట్ కోహ్లి (237), సీఎస్‌కే రవీంద్ర జడేజా (225), పంజాబ్ సారధి శిఖర్ ధవన్ (217), సీఎస్‌కే మాజీ ప్లేయర్లు సురేశ్ రైనా (205), రాబిన్ ఉతప్ప (205), అంబటి రాయుడు (203), రాజస్థాన్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ (197) వరుసగా 2 నుంచి 10 స్థానాల్లో ఉన్నారు.
అత్యధిక మ్యాచ్‌లు ఆడిన టాప్-10 ప్లేయర్స్ జాబితాలో ఏకంగా ఐదుగురు సీఎస్‌కేకు చెందిన వారే ఉండటం విశేషం. కాగా, ఇవాల్టి మ్యాచ్‌తో ఐపీఎల్ కెరీర్‌లో 250 మ్యాచ్‌ల మైలురాయిని చేరుకోనున్న ధోని.. ఫైనల్లో గుజరాత్‌ను ఓడించి టైటిల్ సాధిస్తే మరో రెండు రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకోనున్నాడు. ఇందులో మొదటిది.. రోహిత్ శర్మతో సమానంగా ఐదు ఐపీఎల్ టైటిళ్లు సాధించడం.
రోహిత్ సారధ్యంలో ముంబై 2013, 2015, 2017, 2019, 2020 సీజన్ల టైటిళ్లు సాధించగా.. ధోని నేతృత్వంలో చెన్నై 2010, 2011, 2018, 2021 సీజన్ల టైటిళ్లు గెలుపొందింది. ధోని.. ఐపీఎల్ 2023 టైటిల్ గెలిస్తే రోహిత్‌తో సమానంగా నిలుస్తాడు. మరో రికార్డు ఏంటంటే.. నేటి ఫైనల్లో సీఎస్‌కే.. గుజరాత్‌ను ఓడించి టైటిల్ సాధిస్తే, అతి పెద్ద వయసులో (41) ఐపీఎల్ టైటిల్ సాధించిన కెప్టెన్‌గా ధోని రికార్డుల్లోకెక్కనున్నాడు.
చదవండి: ‘ఫైనల్’ ధమాకా.. సీఎస్‌కే వర్సెస్ గుజరాత్ టైటాన్స్
Comments
Please login to add a commentAdd a comment