టీమిండియా మాజీ ఓపెనర్, నజఫ్‌ఘడ్ నవాబ్, ముల్తాన్ కా సుల్తాన్ వీరేంద్ర సెహ్వాగ్ క్రికెట్‌కు వీడ్కోలు పలికి దాదాపు పదేళ్లైనా, నేటికి అతను నెలకొల్పిన కొన్ని రికార్డులు చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఇందులో అతను టెస్ట్‌ల్లో సాధించిన డబుల్ ట్రిపుల్ హండ్రెడ్‌ల రికార్డు ఒకటి. భారత క్రికెట్ చరిత్రలో ఈ రికార్డును ఇప్పటివరకు ఎవరూ సాధించలేకపోయారు. ఓవరాల్‌గా చూసినా ఈ రికార్డును డాన్ బ్రాడ్‌మన్, బ్రియాన్ లారా, క్రిస్ గేల్ మాత్రమే సాధించగలిగారు.
Date mein kya rakha hai?
— Virender Sehwag (@virendersehwag) March 29, 2022
March 29th, a very significant date in my cricketing life. Got to the first triple hundred against Pakistan in Multan on this date and got out on 319 against South Africa on this very date.
Coincidentally, without plan have a car which is numbered 2903. pic.twitter.com/tJ1rf3GPbw
అయితే ఇక్కడ విశేషమేమిటంటే.. సెహ్వాగ్ సాధించిన రెండు ట్రిపుల్ హండ్రెడ్‌లు ఒకే తేదీన సాధించడం. 2004 మార్చి 29న పాకిస్థాన్‌పై ముల్తాన్ టెస్ట్‌లో తొలి ట్రిపుల్‌ను (309) బాదిన వీరూ.. సరిగ్గా నాలుగేళ్ల తర్వాత ఇదే తారీఖున (2008 మార్చి 29) చెన్నైలో దక్షిణాఫ్రికాపై రెండో ట్రిపుల్‌ను (319) సాధించాడు. దీంతో సెహ్వాగ్ క్రికెట్ కెరీర్‌లో ఈ తేదీ చాలా ప్రత్యేకంగా, సెంటిమెంటల్‌గా, లక్కీగా నిలిచింది. యాధృచ్చికంగా సెహ్వాగ్ కారు నంబర్ (2903) కూడా ఇదే తేదీతో ముడిపడి ఉండటం మరో విశేషం.
తాజాగా (మార్చి 29, 2022) సెహ్వాగ్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ ట్వీట్ చేశాడు. తేదీలో ఏముంది..? మార్చి 29.. నా క్రికెట్ కెరీర్‌లో చాలా ప్రత్యేకమైన రోజు. ముల్తాన్ టెస్ట్‌లో (పాక్‌పై) ఇదే రోజున తొలి ట్రిపుల్ సెంచరీ కొట్టాను. నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఇదే తారీఖున దక్షిణాఫ్రికాపై ఈ ఫీట్ సాధించాను. యాదృచ్చికంగా నా కార్ నెంబర్ (2903) కూడా ఇదే కావడం నిజంగా నమ్మలేకపోతున్నానంటూ వీరూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరలవుతుంది.
చదవండి: IPL 2022: అతడు వన్డే ప్లేయర్ మాత్రమే! అద్భుతాలు చేయనక్కర్లేదు.. కానీ..
Comments
Please login to add a commentAdd a comment