‘అతడు ఎప్పటికీ ప్రమాదకర బౌలరే’ | Virender Sehwag Greets Dale Steyn On His Birthday | Sakshi
Sakshi News home page

‘అతడు ఎప్పటికీ ప్రమాదకర బౌలరే’

Published Sat, Jun 30 2018 2:29 PM | Last Updated on Sat, Jun 30 2018 3:38 PM

Virender Sehwag Greets Dale Steyn On His Birthday - Sakshi

సోషల్‌ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉండే సెలబ్రిటీలలో టీమిండియా మాజీ క్రికెటర్‌, విధ్వంసకర ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్‌ ఒకరు. తన దైన శైలిలో భిన్నంగా స్పందిస్తూ అందరినీ ఆశ్యర్యానికి గురి చేసే ఈ డాషింగ్‌ ఓపెనర్‌.. దక్షిణాఫ్రికా బౌలర్‌ డేల్‌ స్టెయిన్‌ పుట్టిన రోజు సందర్భంగా చేసిన ట్వీట్‌ అందరినీ ఆకట్టుకోంటుంది. ‘ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర బౌలర్‌ డేల్‌ స్టెయిన్‌, అతడు బౌలింగ్‌ చేస్తుంటే  మైదానంలో పచ్చిక కూడా పచ్చగా వెలిగిపోద్ది.  జన్మదిన శుభాకాంక్షలు స్టెయిన్‌’ అంటూ ట్వీట్‌ చేశారు. 

సెహ్వాగ్‌ లాంటి భీకర బ్యాట్స్‌మన్‌ స్టెయిన్‌ను అంతలా పొగడ్తలతో ముంచెత్తడంతో అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ కూడా స్టెయిన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘జన్మదిన శుభాకాంక్షలు స్టెయిన్‌, నువ్వు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ సచిన్‌ ట్వీట్‌ చేశారు. స్టెయిన్‌ కూడా ఈ క్రికెటర్ల ట్వీట్‌కు రీట్వీట్‌ చేశారు. ‘నాకు మీ నుంచి విషస్‌ రావడం చాలా సంతోషంగా ఉంది’  అంటూ స్టెయిన్‌ బదులిచ్చారు.  స్టెయిన్‌కు సహచర క్రికెటర్లతో పాటు ఐసీసీ కూడా బర్త్‌ డే విషస్‌ చెప్పింది.  


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement