
శ్రీమఠంలో మాజీ క్రికెటర్లు
ఆరాధనోత్సవాల సందర్భంగా శ్రీరాఘవేంద్రస్వామి దర్శనార్థం భారత మాజీ క్రికెట్ క్రీడాకారులు వెంకటేష్ ప్రసాద్, విజయ్‌భరద్వాజ్ శనివారం మంత్రాలయం వచ్చారు.
శ్రీమఠం అసిస్టెంట్ మేనేజర్.. క్రీడాకారులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు రాఘవేంద్రుల జ్ఞాపిక, శేషవస్త్రాలు, ఫల, పూల మంత్రాక్షింతలతో ఆశీర్వదించారు.