ముంబై: టీమిండియా క్రికెటర్లకు, సిబ్బందికి క్రికెట్ పరిపాలక కమిటీ(సీఓఏ) బంపర్ బొనాంజా ప్రకటించింది. విదేశీ పర్యటనలకు వెళ్లే ఆటగాళ్లతో పాటు సపోర్టింగ్ స్టాఫ్‌కు ఇచ్చే దినసరి భత్యాన్ని(డైలీ అలవెన్స్) రెట్టింపు చేసినట్టు ఓ జాతీయ మీడియా తన కథనంలో పేర్కొంది. ఇప్పటివరకు విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు ఒక్కొక్కరికీ డైలీ అలవెన్స్ 125 డాలర్లు(రూ. 8,899.65) ఉండేది.. కానీ ప్రస్తుతం పెంపుతో 250 డాలర్లు(రూ. 17,799.30) కానుందని సమాచారం. అంతేకాకుండా ట్రావెలింగ్ అలవెన్స్‌లను కూడా భారీగా పెంచినట్లు సమాచారం. ఆటగాళ్ల, సిబ్బంది వసతులు, ఇతరాత్ర సౌకర్యాలను బీసీసీఐ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తుంది.
ఇక ఇప్పటికే సారథి విరాట్ కోహ్లి, ప్రధాన కోచ్ రవిశాస్త్రి డిమాండ్ మేరకు ఆటగాళ్ల, సిబ్బంది జీతాలను సీఓఏ భారీగా పెంచిన విషయం తెలిసిందే. వీరి డిమాండ్ మేరకు టాప్ క్లాస్ ప్లేయర్స్‌కు ఏ+ అనే కేటగిరీ ఏర్పాటు చేసి వారి వార్షిక జీతాన్ని రూ 7 కోట్లకు పెంచారు. ఇక ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్‌లో భాగంగా ఇప్పటికే వెస్టిండీస్‌లో పర్యటించిన టీమిండియా.. వచ్చే ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్‌లో పర్యటించనుంది.
Comments
Please login to add a commentAdd a comment