Supporting staff
-
టీమిండియాతో పాటు ఆస్ట్రేలియాలో ఉన్న ఈ యువతి ఎవరు..?
టీ20 ప్రపంచకప్ ఆడేందుకు ఆస్ట్రేలియాకు బయల్దేరిన భారత బృందంలో ఓ వ్యక్తి అందరి దృష్టిని ఆకర్శించింది. భారత బృందం ఆస్ట్రేలియాకు వెళ్లే ముందు ముంబైలో దిగిన గ్రూప్ ఫోటో ఆ వ్యక్తి తారసపడింది. ఇంతకీ ఎవరా వ్యక్తి అని ఆరా తీయగా.. ఆమె పేరు రాజ్ లక్ష్మీ అరోరా అని తెలిసింది. పేరు తెలుసుకోవడంతో ఆగని నెటిజన్లు.. ఎవరామె, భారత బృందంతో ఆమెకు సంబంధం ఏంటీ, టీమిండియాతో ఆమె ఎందుకు ప్రయాణిస్తుందని ఆరా తీశారు. రకరకాల అన్వేషణల తర్వాత నెటిజన్లకు ఆమె గురించిన పూర్తి వివరాలు తెలిశాయి. రాజ్ లక్ష్మి అరోరా అనే ఆ యువతి భారత సపోర్టింగ్ స్టాఫ్‌లో కీలక సభ్యురాలని, ఆమె గత కొన్నేళ్లుగా బీసీసీఐకి కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తుందని, టీమిండియా విదేశాల్లో పర్యటించినప్పుడు ఆమె ఖచ్చితంగా జట్టుతో పాటు ఉంటుందని తెలిసింది. View this post on Instagram A post shared by Rajal Arora 🫶 (@rajal_arora) అరోరా.. 2015లో బీసీసీఐ సోషల్‌మీడియా మేనేజర్‌గా విధుల్లో చేరిందని, ప్రస్తుతం ఆమె బీసీసీఐకి సంబంధించిన సోషల్‌మీడియా హ్యాండిల్స్‌కు ముఖ్య పర్యవేక్షకురాలిగా వ్యవహరిస్తుందని తెలిసింది. ఈ ఉద్యోగంతో పాటు అరోరా మరో ముఖ్యమైన బాధ్యతను కూడా చేపడుతున్నట్లు తెలిసింది. ఆమె.. ఆటగాళ్ల ప్రవర్తనకు సంబంధించిన ఫిర్యాదులను పర్యవేక్షించే అధికారిగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. View this post on Instagram A post shared by VIRAT KOHLI FAN CLUB (@_.virat.kohli.for.life_) -
టీమిండియాలో మరోసారి కరోనా కలకలం..
లండన్: మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరగాల్సిన ఐదో టెస్ట్(సెప్టెంబర్ 10)కు ముందు భారత శిబిరంలో కరోనా మహమ్మారి మరోసారి కలకలం రేపింది. జట్టుతో పాటు ఉన్న సహాయక సిబ్బందిలో ఒకరికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇవాళ జరగాల్సిన ప్రాక్టీస్ సెషన్‌ను రద్దు చేస్తున్నట్లు టీమిండియా యాజమాన్యం ప్రకటించింది. అలాగే జట్టు సభ్యులందరికీ మరోసారి కోవిడ్ పరీక్షలు చేయనున్నట్లు పేర్కొంది. ఇదిలా ఉంటే, ఓవల్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్‌కు ముందు టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి, ఆతర్వాత కొద్ది రోజులకు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్‌లు కూడా మహమ్మారి బారిన పడిన సంగతి తెలిసిందే. చదవండి: అతని గాయమే అశ్విన్‌కు కలిసొచ్చింది: చీఫ్ సెలెక్టర్ -
టీమిండియా క్రికెటర్లకు ‘డబుల్’ బొనాంజా
ముంబై: టీమిండియా క్రికెటర్లకు, సిబ్బందికి క్రికెట్ పరిపాలక కమిటీ(సీఓఏ) బంపర్ బొనాంజా ప్రకటించింది. విదేశీ పర్యటనలకు వెళ్లే ఆటగాళ్లతో పాటు సపోర్టింగ్ స్టాఫ్‌కు ఇచ్చే దినసరి భత్యాన్ని(డైలీ అలవెన్స్) రెట్టింపు చేసినట్టు ఓ జాతీయ మీడియా తన కథనంలో పేర్కొంది. ఇప్పటివరకు విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు ఒక్కొక్కరికీ డైలీ అలవెన్స్ 125 డాలర్లు(రూ. 8,899.65) ఉండేది.. కానీ ప్రస్తుతం పెంపుతో 250 డాలర్లు(రూ. 17,799.30) కానుందని సమాచారం. అంతేకాకుండా ట్రావెలింగ్ అలవెన్స్‌లను కూడా భారీగా పెంచినట్లు సమాచారం. ఆటగాళ్ల, సిబ్బంది వసతులు, ఇతరాత్ర సౌకర్యాలను బీసీసీఐ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తుంది. ఇక ఇప్పటికే సారథి విరాట్ కోహ్లి, ప్రధాన కోచ్ రవిశాస్త్రి డిమాండ్ మేరకు ఆటగాళ్ల, సిబ్బంది జీతాలను సీఓఏ భారీగా పెంచిన విషయం తెలిసిందే. వీరి డిమాండ్ మేరకు టాప్ క్లాస్ ప్లేయర్స్‌కు ఏ+ అనే కేటగిరీ ఏర్పాటు చేసి వారి వార్షిక జీతాన్ని రూ 7 కోట్లకు పెంచారు. ఇక ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్లో భాగంగా ఇప్పటికే వెస్టిండీస్‌లో పర్యటించిన టీమిండియా.. వచ్చే ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. -
సన్‌రైజర్స్ చెంతకు మరో ఆసీస్ మాజీ క్రికెటర్
హైదరాబాద్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-13 కోసం ఫ్రాంచైజీలు ఇప్పటినుంచే కసరత్తులు ప్రారంభించాయి. తమ బలాబలాలను పరీక్షించుకుంటూనే, గత సీజన్లో జరిగిన పొరపాట్లపై దృష్టి సారిస్తున్నాయి. ఇప్పటికే పలు ఫ్రాంచైజీలు ఆటగాళ్లు, కోచింగ్ బృందంలో మార్పులు చేపట్టాయి. ఈ జాబితాలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందంజలో ఉంది. గత కొన్నేళ్లుగా సన్‌రైజర్స్‌కు సేవలందిస్తున్న టామ్ మూడీపై వేటు వేసి ఇంగ్లండ్‌కు ప్రపంచకప్ చిరకాల కోరికను అందించిన ట్రేవర్ బేలిస్‌ను ప్రధాన కోచ్‌గా నియమించించిన విషయం తెలిసిందే. తాజాగా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాడిన్‌ను సన్‌రైజర్స్ అసిస్టెంట్ కోచ్‌గా నియమించింది. ఈ మేరకు సన్‌రైజర్స్ యాజమాన్యం ‘సన్‌రైజర్స్ హైదరాబాద్ అసిస్టెంట్ కోచ్ బ్రాడ్ హాడిన్‌కు స్వాగతం’అంటూ తన అధికారిక ట్విటర్లో పేర్కొంది. ఇక ప్రధాన కోచ్ ట్రేవర్ బేలిస్ కూడా ఆసీస్‌కు చెందిన వాడే కావడం విశేషం. ఇక వచ్చే సీజన్‌కు సన్‌రైజర్స్‌కు సంబంధించిన పూర్తి సహాయక సిబ్బంది వివరాలను కూడా తెలిపింది. దిగ్గజ క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, మురళీథరన్‌లు మెంటార్లుగా వ్యవహరిస్తారని తెలిపింది. ఇక 2015 ప్రపంచకప్ గెలిచిన ఆసీస్ జట్టులో హాడిన్ సభ్యుడు. యాషెస్- 2015 అనంతరం క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన హాడిన్ 2016లో పలు సిరీస్‌లకు ఆసీస్-ఏ జట్టుకు సహాయక కోచ్‌గా పనిచేశాడు. ఇక ఆసీస్ తరుపున 66 టెస్టులు ఆడిన ఈ వికెట్ కీపర్ 3,266 పరుగులు చేయగా.. 126 వన్డేల్లో 3,122 పరుగులు సాధించాడు. We welcome Brad Haddin as the Assistant Coach of SunRisers Hyderabad.#OrangeArmy #RiseWithUs pic.twitter.com/XqEn8Y10LX — SunRisers Hyderabad (@SunRisers) August 19, 2019 Mentors, Coaches and Support Staff of SunRisers Hyderabad.#OrangeArmy #RiseWithUs pic.twitter.com/r7E0Rvm83x — SunRisers Hyderabad (@SunRisers) August 19, 2019 -
ఆశ్చర్యం.. జాంటీ రోడ్స్‌కు నో ఛాన్స్?
హైదరాబాద్ : క్రికెట్లో ఫీల్డింగ్‌కు పర్యాయ పదంగా చెప్పుకునే దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు జాంటీ రోడ్స్‌కు తీవ్ర నిరాశే ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. టీమిండియా ఫీల్డింగ్ కోచ్ పదవి కోసం రోడ్స్ దరఖాస్తు చేసుకోవడంతో అతడి ఎంపిక దాదాపు ఖాయమని అందరూ భావించారు. అయితే ఇటీవలే ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి మరల నియామకమైన తర్వాత సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. సహాయక సిబ్బంది ఎంపిక విషయంలో రవిశాస్త్రి వెనక్కి తగ్గటం లేదని, తనకు నచ్చిన వారినే నియమించుకునేలా పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రస్తుతమున్న సిబ్బందే కొనసాగుతారని అనేక వార్తలు వినిపిస్తున్నాయి. అయితే చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని కమిటీ సపోర్టింగ్ స్టాఫ్‌ను ఎంపిక చేసేందుకు గురువారం భేటీ కానుంది. ఆదే రోజున సహాయక సిబ్బంది పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. ఆర్ శ్రీధర్ కోచింగ్ పర్యవేక్షణలో టీమిండియా ఫీల్డింగ్ మరింత బలపడిందని, ఆటగాళ్ల ఫీల్డింగ్ మెరుగుపడిందని రవిశాస్త్రి వాదిస్తున్నాడు. దీంతో శ్రీధర్ ఫీల్డింగ్ కోచ్‌గా మరోసారి కొనసాగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే ప్రపంచంలోనే దిగ్గజ ఫీల్డర్‌గా కీర్తింపబడే జాంటీ రోడ్స్‌కు నిరాశ ఎదురవక తప్పదు. భారత్‌పై తనకున్న ప్రేమ, గౌరవాన్ని అనేకమార్లు చాటిన రోడ్స్.. ఫీల్డింగ్ కోచ్‌గా టీమిండియాకు సేవలందించాలని తెగ ఆరాటపడ్డాడు. అయితే ఆశ్చర్యకరంగా రోడ్స్‌ను పక్కకు పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు ఫీల్డింగ్ కోచ్‌గా జాంటీ రోడ్స్ పనిచేసిన విషయం తెలిసిందే. ఇక దాదాపుగా బౌలింగ్ కోచ్‌గా భరత్ అరుణ్ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత బౌలింగ్‌లో ఎలాంటి సమస్యలు లేనందున భరత్ అరుణ్ వైపే కమిటీ మొగ్గు చూపుతోంది. అయితే బ్యాటింగ్ కోచ్‌ను తప్పకుంగా మార్చాలనే ఆలోచనలో బీసీసీఐతో పాటు ప్రసాద్ కమిటీ ఉన్నట్లు సమాచారం. బ్యాటింగ్‌లో నాలుగో స్థానంతోపాటు, మిడిలార్డర్ సమస్యను పరిష్కరించలేకపోయిన ప్రస్తుత బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్‌పై వేటు వేయడం ఖాయంగా కనిపిస్తోంది. కొత్త బ్యాటింగ్ కోచ్ కోసం భారత మాజీ ఆటగాళ్లు ప్రవీణ్ ఆమ్రే, విక్రమ్ రాథోర్లు రేసులో ముందున్నారు. చదవండి: ఎగేసికుంటూ పోయి.. ఉట్టి చేతులతోనే! ఫీల్డింగ్ కోచ్ బరిలో జాంటీ రోడ్స్ -
సిరీస్ మధ్యలో మార్పులెందుకు?
రాహుల్ ద్రవిడ్ ప్రశ్న న్యూఢిల్లీ: ఇంగ్లండ్ పర్యటన పూర్తిగా ముగియక ముందే సహాయక సిబ్బందిని మార్చడంపై భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వన్డే సిరీస్ ముగిసిన తర్వాత మార్పులు చేయాల్సిందని ఆయన అభిప్రాయ పడ్డారు. ‘ప్రొఫెషనల్ క్రీడలో మార్పులు సహజం. దానిని ఎవరూ తప్పుపట్టరు. అయితే కొత్త సహాయక బృందం ఈ సిరీస్ వరకేనా, తర్వాత కూడా కొనసాగుతుందా అనేదానిపై స్పష్టత లేదు. సాధారణంగా సహాయక సిబ్బందితో కూడా ఆటగాళ్లకు అనుబంధం ఏర్పడిపోతుంది. కొన్ని సందర్భాల్లో క్రికెటర్ల విజయం, వైఫల్యంపై కూడా వారి ప్రభావం ఉంటుంది. కాబట్టి సిరీస్ మధ్యలో మార్చితే అనవసరపు సందిగ్ధత ఏర్పడుతుంది’ అని ద్రవిడ్ వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితిని రవిశాస్త్రి చక్కదిద్దగలడని విశ్వాసం వ్యక్తం చేసిన ద్రవిడ్...‘కొత్త వాతావరణం’లో ఇమడగలడా లేదా అనేది ఫ్లెచర్ స్వయంగా తేల్చుకోవాలని సూచించారు. -
ఐ మిస్ యూ ... అంటూ ఎస్ఎంఎస్లు
ఓ వైపు పిల్లలు, పెద్దలు రక్షించండి, కాపాడండి అంటూ అర్తనాదాలు... మరో వైపు కళ్ల వెంట దారాపాతంగా కారుతున్న కన్నీరు. మృత్యువు తమను కబళించేందుకు సిద్ధంగా ఉందని తెలుసు... ఏ క్షణానైన మరణం తన కౌగిట్లోకి తమను బలవంతంగా లాక్కుపోతుంది. ఆ తరుణంలో ఆ చిన్నారి విద్యార్థులకు తల్లితండ్రులు, కుటుంబసభ్యులు గుర్తుకు వచ్చారు. అంతే ఇక ఆలస్యం చేయలేదు. తమ వద్ద ఉన్న సెల్ ఫోన్లు బయటకు తీశారు. తర్వాత క్షణం ఏం జరుగుతోందో తెలియని ఆ విద్యార్థులు తల్లితండ్రులపై ప్రేమ, ప్రమాదంలో చిక్కుకున్నామనే భయం, జీవితం ఇక లేదనే నిరాశలతో సమ్మిళితమైన సంక్షిప్త సందేశాల (ఎస్ఎంఎస్)ను తమ తమ తల్లితండ్రులకు పంపారు. ఐ లవ్ యూ మమ్, ఐ లవ్ యూ డాడ్ , ఐ మిస్ యూ... జీవితంలో మరోసారి ఈ సందేశం పంపేందుకు అవకాశం రాకపోవచ్చు అంటూ షిన్ యంగ్ జిన్ అనే విద్యార్థి తన తల్లితండ్రులకు ఎస్ఎంఎస్ పంపగా, తాను ప్రయాణిస్తున్న నౌక ఓ పక్కకు ఒరిగిపోయింది... తమను రక్షించండి అంటూ మరో విద్యార్థి కిమ్ వూంగ్ కి తన సోదరుడిని ఎస్ఎంఎస్ ద్వారా వేడుకున్నాడు. ఆ ఎస్ఎంఎస్లు గురువారం దేశవ్యాప్తంగా వివిధ మీడియాలు సంస్థలు తమ తమ పత్రికలలో ప్రచురించాయి. విహార యాత్రకు వెళ్లి విషాద యాత్రగా మారిన తరుణంలో కన్న బిడ్డలు జాడ తెలియక ఆయా కుటుంబాలు విద్యార్థులు పంపిన సందేశాలను చూసి రోధిస్తున్న తీరు దేశవ్యాప్తంగా ప్రజలను శోక సంద్రంలో ముంచింది. దాదాపు 459 మంది (అత్యధిక మంది విద్యార్థులు)తో విహార యాత్రకు బయలుదేరిన ఫెర్రీ (నౌక) బుధవారం ఉదయం దక్షిణ కొరియాలోని దక్షిణ తీరంలో ప్రమాదం సంభవించింది. ఆ ప్రమాదంలో ఫెర్రీ క్రమక్రమంగా నీటీలో మునిగిపోయింది. ఆ దుర్ఘటనపై సమాచారం అందుకున్న దక్షిణ కొరియా ఉన్నతాధికారులు వెంటనే తీర గస్తీ దళం, సైన్యాన్ని రంగంలోకి దింపి సహాయక చర్యలు చేపట్టింది. ఆ ప్రమాదంలో నలుగురు మరణించగా, 55 మంది గాయాలతో బయటపడ్డారు. మరో 292 మంది జాడా ఇంత వరకు తెలియరాలేదు. కొరియాలో సంభవించిన ఫెర్రీ దుర్ఘటన 1912లో ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ నౌక ఉదంతాన్ని గుర్తుకు తెచ్చింది. అనాటి నౌక దుర్ఘటనలో పలువురుని సైన్యం కాపాడిన 1500 మంది జల సమాధి అయిన సంగతి తెలిసిందే. -
మరో ‘టైటానిక్’ ప్రమాదం
* ద.కొరియా తీరంలో నౌక మునక * నలుగురి మృతి, 292 మంది గల్లంతు సియోల్: దక్షిణ కొరియాలోని దక్షిణ తీరంలో ఘోరమైన ప్రమాదం సంభవించింది. 459 మంది తో ప్రయాణిస్తున్న నౌకలో ప్రమాదం తలెత్తి బుధవారం మెల్లమెల్లగా మునిగిపోయింది. ఇది మునగడానికి గంటల సమయం పట్టడంతో ఈలోగా హెలికాప్టర్లు, ఇతర నౌకల్లో అక్కడకు చేరుకున్న సహాయక సిబ్బంది ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడడానికి శతవిధాలా ప్రయత్నించారు. అయినా ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, 55 మంది గాయాలతో బయటపడ్డారు. మరో 292 మంది జాడ లేదు. ఈ ప్రమాదం 1912లో ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిన టైటానిక్ నౌక ఉదంతాన్ని గుర్తుకుతెచ్చింది. నాటి ఘటనలోనూ నౌక కొన్ని గంటలపాటు మునగ్గా, లైఫ్బోట్ల సాయంతో పలువురిని కాపాడారు. ఆ ప్రమాదంలో 1,500 మంది దాకా చనిపోయారు. తాజా ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. జాడ తెలియని వారిలో చాలామంది ఓడలోనే చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. దీంతో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 146 మీటర్ల పొడవైన ఈ ఓడ ద.కొరియా వాయవ్య ప్రాంతంలోని ఇంచియాన్, జెజు దీవి మధ్య వారానికి రెండు సార్లు ప్రయాణిస్తుంది. ఆ క్రమంలో మంగళవారం రాత్రి ఇంచియాన్ను నుంచి బయలుదేరిన ఈ ఓడ 14 గంటల పాటు ప్రయాణించి పర్యాటక దీవి జెజు చేరాల్సి ఉంది. అయితే మరో మూడుగంటల్లో గమ్యాన్ని చేరుతుందనగా బ్యాంగ్‌పుంగ్ దీవికి సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది. ఓడలో16 నుంచి 17 ఏళ్ల వయసున్న 325 మంది హైస్కూల్ విద్యార్థులు, 15 మంది టీచర్లు, 89 మంది సాధారణ ప్రయాణికులు, 30 మంది సిబ్బంది ఉన్నారని ద.కొరియా భద్రత మంత్రి కంగ్ యంగ్ యు చెప్పారు. మరణించిన వారిలో ఇద్దరు మహిళా సిబ్బంది, ఒక హైస్కూల్ బాలుడు ఉన్నారు. 164 మందిని కాపాడామన్నారు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, ప్రస్తుతం సహాయక చర్యలపైనే దృష్టి పెట్టామని చెప్పారు. నౌక మునిగిపోవడానికి గల కారణాలు తర్వాత అన్వేషిస్తామని అధికారులు చెప్పారు. 37 మీటర్ల లోతున్న సముద్రంలో బురద ఎక్కువగా ఉండడంతో నీటి లోపల అన్వేషణకు కష్టతరంగా ఉందన్నారు.