![Raj Laxmi Arora, The Only Female Of India 16 Member Non Playing Staff At T20 WC - Sakshi](/styles/webp/s3/article_images/2022/10/19/Untitled-7_0.jpg.webp?itok=r6D8EEQ-)
టీ20 ప్రపంచకప్ ఆడేందుకు ఆస్ట్రేలియాకు బయల్దేరిన భారత బృందంలో ఓ వ్యక్తి అందరి దృష్టిని ఆకర్శించింది. భారత బృందం ఆస్ట్రేలియాకు వెళ్లే ముందు ముంబైలో దిగిన గ్రూప్ ఫోటో ఆ వ్యక్తి తారసపడింది. ఇంతకీ ఎవరా వ్యక్తి అని ఆరా తీయగా.. ఆమె పేరు రాజ్ లక్ష్మీ అరోరా అని తెలిసింది. పేరు తెలుసుకోవడంతో ఆగని నెటిజన్లు.. ఎవరామె, భారత బృందంతో ఆమెకు సంబంధం ఏంటీ, టీమిండియాతో ఆమె ఎందుకు ప్రయాణిస్తుందని ఆరా తీశారు.
రకరకాల అన్వేషణల తర్వాత నెటిజన్లకు ఆమె గురించిన పూర్తి వివరాలు తెలిశాయి. రాజ్ లక్ష్మి అరోరా అనే ఆ యువతి భారత సపోర్టింగ్ స్టాఫ్‌లో కీలక సభ్యురాలని, ఆమె గత కొన్నేళ్లుగా బీసీసీఐకి కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తుందని, టీమిండియా విదేశాల్లో పర్యటించినప్పుడు ఆమె ఖచ్చితంగా జట్టుతో పాటు ఉంటుందని తెలిసింది.
అరోరా.. 2015లో బీసీసీఐ సోషల్‌మీడియా మేనేజర్‌గా విధుల్లో చేరిందని, ప్రస్తుతం ఆమె బీసీసీఐకి సంబంధించిన సోషల్‌మీడియా హ్యాండిల్స్‌కు ముఖ్య పర్యవేక్షకురాలిగా వ్యవహరిస్తుందని తెలిసింది. ఈ ఉద్యోగంతో పాటు అరోరా మరో ముఖ్యమైన బాధ్యతను కూడా చేపడుతున్నట్లు తెలిసింది. ఆమె.. ఆటగాళ్ల ప్రవర్తనకు సంబంధించిన ఫిర్యాదులను పర్యవేక్షించే అధికారిగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment