
టీ20 ప్రపంచకప్-2022 కోసం రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా ఆస్ట్రేలియాకు పయనమైంది. గురువారం(ఆక్టోబర్ 6) తెల్లవారుజామున ముంబై నుంచి భారత జట్టు బయలుదేరి వెళ్లింది. ఆస్ట్రేలియాకు బయలదేరే ముందు భారత జట్టు మొత్తం గ్రూపు ఫోటో దిగారు ఇందుకు సంబంధించిన ఫోటోలను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
కాగా ఆస్ట్రేలియాకు బుమ్రా రిప్లేస్‌మెంట్ లేకుండానే భారత జట్టు పయనమైంది. అక్కడకి వెళ్లాక బుమ్రా స్థానాన్ని భర్తీ చేయనున్నామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పిన సంగతి తెలిసిందే. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో ఘోర వైఫల్యం చెందిన టీమిండియా.. ఈ ఏడాది ప్రపంచకప్‌లో అదరగొట్టాలని భావిస్తోంది.
ఇక ఈ మెగా ఈవెంట్‌లో టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్ 23న మెల్‌బోర్న్ వేదికగా చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో తలపడనుంది. అంతకుముందు ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లతో రోహిత్ సేన తలపడనుంది. మరోవైపు ధావన్ సారధ్యంలోని భారత ద్వితీయ శ్రేణి జట్టు.. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో తలపడనుంది. ఆక్టోబర్ 6నే ఇరు జట్లు మధ్య తొలి వన్డే జరగనుండడం విశేషం.
Picture perfect 📸
— BCCI (@BCCI) October 5, 2022
Let's do this #TeamIndia@cricketworldcup, here we come ✈️ pic.twitter.com/XX7cSg3Qno
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment