
లండన్: మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరగాల్సిన ఐదో టెస్ట్(సెప్టెంబర్ 10)కు ముందు భారత శిబిరంలో కరోనా మహమ్మారి మరోసారి కలకలం రేపింది. జట్టుతో పాటు ఉన్న సహాయక సిబ్బందిలో ఒకరికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇవాళ జరగాల్సిన ప్రాక్టీస్ సెషన్‌ను రద్దు చేస్తున్నట్లు టీమిండియా యాజమాన్యం ప్రకటించింది. అలాగే జట్టు సభ్యులందరికీ మరోసారి కోవిడ్ పరీక్షలు చేయనున్నట్లు పేర్కొంది. ఇదిలా ఉంటే, ఓవల్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్‌కు ముందు టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి, ఆతర్వాత కొద్ది రోజులకు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్‌లు కూడా మహమ్మారి బారిన పడిన సంగతి తెలిసిందే.
చదవండి: అతని గాయమే అశ్విన్‌కు కలిసొచ్చింది: చీఫ్ సెలెక్టర్