మాంచెస్టర్: భారత క్రికెట్ జట్టుకు జూనియర్ ఫిజియోగా వ్యవహరిస్తున్న యోగేశ్ పర్మార్ ఇవాళ(గురువారం) కరోనా బారిన పడిన నేపథ్యంలో ఆఖరి టెస్ట్ సాధ్యాసాధ్యాలపై అనుమానులు నెలకొన్నాయి. రేపటి మ్యాచ్ జరుగుతుందో లేదోనని స్వయానా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీనే సందేహం వ్యక్తం చేయడంతో మ్యాచ్ నిర్వహణ దాదాపుగా అసాధ్యమేనని తెలుస్తోంది. యోగేశ్ పర్మార్‌కు కరోనా నిర్దారణ అయ్యాక భారత బృందం మొత్తానికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
ఈ రోజు రాత్రికి ఆర్టీ-పీసీఆర్ ఫలితాలు రానున్నాయి. ఈ ఫలితాలపైనే ఆఖరి మ్యాచ్ నిర్వహణ ఆధారపడి ఉంటుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అప్పటి వరకు ఆటగాళ్లు తమకు కేటాయించిన గదుల్లోనే ఉండాలని సూచించారు. కాగా, తన పుస్తకావిష్కరణ కార్యక్రమం అనంతరం తొలుత టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి, ఆతర్వాత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, సీనియర్ ఫిజియో నితిన్ పటేల్, ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్‌లు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.
చదవండి: టాప్-10లోకి బుమ్రా.. దూసుకొస్తున్న శార్దూల్
Comments
Please login to add a commentAdd a comment