అష్ఫాఖ్ అహ్మద్, ఆమిర్ హయత్
దుబాయ్: మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై ఇద్దరు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) క్రికెటర్లపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చర్య తీసుకుంది. యూఏఈకి చెందిన ఆమిర్ హయత్, అష్ఫాఖ్ అహ్మద్‌లపై తాత్కాలిక నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఐసీసీ అవినీతి వ్యతిరేక విభాగం నిబంధనల ప్రకారం ప్రకారం వీరిద్దరిపై ఐదు వేర్వేరు ఆరోపణలు నమోదయ్యాయి. ఈ ఇద్దరు ఆటగాళ్లు 14 రోజుల్లోగా తమపై వచ్చిన ఆరోపణలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. అష్ఫాఖ్‌పై గత ఏడాది అక్టోబర్‌లోనే టి20 ప్రపంచ కప్ క్వాలిఫయింగ్ సందర్భంగా తాత్కాలిక నిషేధం విధించినా.. దర్యాప్తు కొనసాగుతుండటంతో అతనిపై ఏమేం ఆరోపణలు ఉన్నాయో ఐసీసీ స్పష్టతనివ్వలేదు. అష్ఫాఖ్ 16 వన్డేలు, 12 టి20ల్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించగా, హయత్ 8 వన్డేలు 4 టి20లు ఆడాడు.
Comments
Please login to add a commentAdd a comment