Fixing allegations
-
ఫిక్సింగ్ కలకలం.. విండీస్ క్రికెటర్‌పై వేటు
వెస్టిండీస్ వికెట్‌కీపర్, బ్యాటర్ డెవాన్ థామస్‌పై ఐసీసీ సస్సెన్షన్ వేటు వేసింది. లంక ప్రీమియిర్ లీగ్ 2021లో ఫిక్సింగ్ పాల్పడ్డాడన్న అభియోగాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ తెలిపింది. అలాగే యూఏఈ, కరీబియన్ లీగ్‌ల్లో బుకీలు కలిసిన విషయాన్ని దాచిపెట్టాడని, వీటిపై విచారణకు ఏమాత్రం సహకరించడం లేదని పేర్కొంది. థామస్‌పై సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి వస్తుందని.. శ్రీలంక క్రికెట్ (SLC), ఎమిరేట్స్ క్రికెట్ బోర్డ్ (ECB), కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL) యొక్క అవినీతి నిరోధక కోడ్ల ప్రకారం అతనిపై ఏడు అభియోగాలు మోపినట్లు వెల్లడించింది. కాగా, డెవాన్ థామస్ గతేడాదే టెస్ట్ అరంగేట్రం చేశాడు. అతను విండీస్ తరఫున ఒక టెస్ట్, 21 వన్డేలు, 12 టీ20లు ఆడాడు. ఇందులో మొత్తంగా 320 పరుగులు, 36 క్యాచ్‌లు, 4 రనౌట్లు, 8 స్టంపింగ్‌లు చేశాడు. టెస్ట్‌ల్లో, వన్డేల్లో బౌలింగ్ సైతం చేసిన థామస్.. ఫార్మాట్‌కు 2 చొప్పున 4 వికెట్లు పడగొట్టాడు. చదవండి: IPL 2023 QF 1: సీఎస్కే-గుజరాత్ మ్యాచ్‌పై అనుమానాలు.. ఫిక్స్ అయ్యిందా..? -
అతనో చేత కాని బౌలర్.. నన్ను ఔట్ చేసుకోలేక ఏడ్చేవాడు..!
తాను లంచం ఆఫర్ చేశానంటూ ఆసీస్ మాజీ ఆటగాడు షేన్ వార్న్ చేసిన సంచలన ఆరోపణల నేపథ్యంలో పాక్ మాజీ కెప్టెన్ సలీం మాలిక్ స్పందించాడు. వార్న్.. ఓ చేత కాని బౌలర్ అని, అప్పట్లో నన్ను ఔట్ చేసుకోలేక ఏడ్చేవాడని, ఆ కసితోనే నాపై ఫిక్సింగ్ ఆరోపణలకు పాల్పడ్డాడని కౌంటరిచ్చాడు. ఈ మధ్య కాలంలో చాలా మందికి తమ పుస్తకావిష్కరణల సందర్భంగా వివాదాలు క్రికెట్ చేయడం అలవాటుగా మారిందని, ఈ వివాదాల వల్ల వచ్చే పబ్లిసిటీని వారు క్యాష్ చేసుకుంటున్నారని, వార్న్ కూడా అలాంటి చీప్ స్టంట్‌నే ప్లే చేశాడని ధ్వజమెత్తాడు. వార్న్‌కు తాను లంచం ఆఫర్ చేసిన విషయం 26 ఏళ్ల తర్వాత గుర్తుకు వచ్చిందా, ఒక వేళ అదే నిజమైతే అతను ఇన్నాళ్లు ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించాడు. తన డ్యాక్యుమెంటరీని మార్కెట్ చేసుకోవడం కోసమే వార్న్ ఇదంతా చేస్తున్నాడని, అతని ఆరోపణల్లో ఇది తప్ప, మరో ఉద్దేశం కనిపించ లేదని, 26 ఏళ్లు గడిచినా వార్న్ నన్ను గుర్తుపెట్టుకోవడం సంతోషమేనని మాలిక్ చెప్పుకొచ్చాడు. కాగా, తన డాక్యుమెంటరీ "షేన్" కోసం ఇచ్చిన ఇంటర్వూ సందర్భంగా షేన్ వార్న్.. సలీం మాలిక్‌పై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. 1994 పాక్ పర్యటనలో మ్యాచ్ ఫిక్సింగ్ చేసేందుకు సలీం మాలిక్.. తనకు 2,76,000 అమెరికన్ డాలర్ల లంచం ఆఫర్ చేశాడని వార్న్ ఆరోపించాడు. తనతో పాటు సహచర ఆటగాడు టిమ్ మేకు కూడా సలీం లంచం ఆఫర్ చేశాడని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. చదవండి: పాక్ మాజీ కెప్టెన్ ఫిక్సింగ్ చేయమన్నాడు.. షేన్ వార్న్ సంచలన వ్యాఖ్యలు -
'చెత్త వాగుడు ఆపండి'.. భజ్జీ వార్నింగ్
Harbhajan Singh Strong Warning To Pakistan Fans.. టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ పాకిస్తాన్ అభిమానులకు వార్నింగ్ ఇవ్వడం ఆసక్తి కలిగించింది. రెండు భారీ ఓటముల తర్వాత టీమిండియా అఫ్గానిస్తాన్, స్కాట్లాండ్లపై భారీ తేడాతో గెలవడంపై మాకు అనుమానంగా ఉందంటూ కొందరు పాక్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. టీమిండియా ఏదైనా ఫిక్సింగ్‌కు పాల్పడిందేమో అంటూ ట్రోల్స్ చేశారు. పాక్ అభిమానుల తీరుపై భజ్జీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. చదవండి: T20 World Cup 2021: ఇదీ పరిస్థితి.. నువ్వు మరీనూ వసీం భాయ్.. చాల్లే! ''మీ చెత్తవాగుడు కట్టిపెడితే బాగుంటుంది. పాకిస్తాన్ ఈ టి20 ప్రపంచకప్‌లో మంచి ఆటతీరును కనబరిచింది. టీమిండియాపై గెలిచినందుకు పాక్ జట్టును ఒక క్రికెటర్‌గా అభినందిస్తున్నా. గేమ్ అనేది ఫెయిర్‌గా ఉండాలి కాబట్టి పాకిస్తాన్ విజయానికి కంగ్రాట్స్ చెబుతున్నా. కానీ న్యూజిలాండ్‌తో ఓటమి తర్వాత టీమిండియా బౌన్స్ బ్యాక్ అయింది. అఫ్గానిస్తాన్, స్కాట్లాండ్పై భారీ విజయాలతో సెమీస్ రేసులో నిలిచింది. ఇదంతా కష్టపడితే వచ్చింది.. అంతేకానీ ఎవరు ఫిక్సింగ్‌కు పాల్పడరు. అనవసరంగా మా జట్టుపై ఫిక్సింగ్ అంటూ ఆరోపణలు చేస్తే ఊరుకోము.. అలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణం. ఇది క్రికెట్‌పై ఉండే గౌరవాన్ని దెబ్బతీస్తుంది. టీమిండియాపై పాకిస్తాన్ విజయం సాధించడంతో .. పాక్ అభిమానులు ఓర్వలేక ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా ఇలాంటివి ఆపేస్తే మంచిది.జ ఏం జరగాలని రాసి ఉంటే అదే జరుగుతుంది.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక టీమిండియా సోమవారం(నవంబర్ 8న) నమీబియాతో మ్యాచ్ ఆడనుంది. చదవండి: Chris Gayle: ఫన్నీ బౌలింగ్.. మిచెల్ మార్ష్ ఔట్‌తో ముగించాడు -
కోచ్ ఫిక్సింగ్ చేయమన్నాడు.. భారత స్టార్ ప్లేయర్ సంచలన ఆరోపణలు
న్యూఢిల్లీ: భారత టేబుల్ టెన్నిస్ నేషనల్ కోచ్ సౌమ్యదీప్ రాయ్‌పై స్టార్ ప్లేయర్ మనికా బత్రా సంచలన ఆరోపణలు చేసింది. దోహా వేదికగా ఈ ఏడాది మార్చిలో జరిగిన ఒలింపిక్స్ క్వాలిఫయర్స్‌లో జాతీయ కోచ్ తనను మ్యాచ్ ఫిక్సింగ్ చేయమన్నాడని ఆమె ఆరోపించింది. అయితే అందుకు తాను అంగీకరించలేదని, టోక్యో ఒలింపిక్స్‌లో అందుకే అతని సహాయం తీసుకోలేదని టీటీ సమాఖ్యకు నివేదించింది. ఫిక్సింగ్ ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, ఇందుకు కావాల్సిన సాక్షాధారాలు తన దగ్గరున్నాయని, సరైన సమయంలో వాటిని అధికారుల ముందుంచుతానని పేర్కొంది. మ్యాచ్ ఫిక్సింగ్ అంశంపై మాట్లాడేందుకు కోచ్ నా వ్యక్తిగత హోటల్ గదికి వచ్చాడని, తాను మాట వినకపోవడంతో బెదిరింపులకు దిగాడని, ఓ శిష్యురాలు కోసమే ఆయన ఇదంతా చేశాడని వెల్లడించింది. కాగా, జాతీయ కోచ్‌పై మనికా బత్రా చేసిన ఆరోపణలపై టీటీఎఫ్ఐ విచారణ చేపట్టకపోవడం పలు అనుమానలకు తావిస్తోంది. ఇదిలా ఉంటే, భారీ అంచనాల మధ్య టోక్యో ఒలింపిక్స్ బరిలోకి దిగిన ప్రపంచ 56వ ర్యాంకర్ మనికా బాత్రా మూడో రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. ఒలింపిక్స్ సందర్భంగా నేషనల్ కోచ్ సేవలను తిరస్కరించడంపై అప్పట్లో టేబుల్ టెన్నిస్ సమాఖ్య మనికాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. చదవండి: వారెవ్వా క్యా సీన్ హై.. ట్రాక్‌పైనే అంధ అథ్లెట్‌కు లవ్ ప్రపోజల్ -
యూఏఈ క్రికెటర్లపై నిషేధం
దుబాయ్: మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై ఇద్దరు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) క్రికెటర్లపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చర్య తీసుకుంది. యూఏఈకి చెందిన ఆమిర్ హయత్, అష్ఫాఖ్ అహ్మద్‌లపై తాత్కాలిక నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఐసీసీ అవినీతి వ్యతిరేక విభాగం నిబంధనల ప్రకారం ప్రకారం వీరిద్దరిపై ఐదు వేర్వేరు ఆరోపణలు నమోదయ్యాయి. ఈ ఇద్దరు ఆటగాళ్లు 14 రోజుల్లోగా తమపై వచ్చిన ఆరోపణలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. అష్ఫాఖ్‌పై గత ఏడాది అక్టోబర్‌లోనే టి20 ప్రపంచ కప్ క్వాలిఫయింగ్ సందర్భంగా తాత్కాలిక నిషేధం విధించినా.. దర్యాప్తు కొనసాగుతుండటంతో అతనిపై ఏమేం ఆరోపణలు ఉన్నాయో ఐసీసీ స్పష్టతనివ్వలేదు. అష్ఫాఖ్ 16 వన్డేలు, 12 టి20ల్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించగా, హయత్ 8 వన్డేలు 4 టి20లు ఆడాడు. -
మేమెప్పుడూ ఫిక్సింగ్‌కు పాల్పడలేదు
కొలంబో: శ్రీలంక క్రికెట్లో ఫిక్సింగ్‌కు ఆద్యులమంటూ తమపై దేశ క్రికెట్ బోర్డు మాజీ చీఫ్ తిలంగ సుమతిపాల చేసిన ఆరోపణలను మాజీ కెప్టెన్లు అర్జున రణతుంగ, అరవింద డిసిల్వా తీవ్రంగా ఖండించారు. ‘మేమెప్పుడూ డబ్బు తీసుకోలేదు. మ్యాచ్‌లను ఫిక్స్ చేయలేదు’ అని వీరిద్దరూ మంగళవారం కొలంబోలో ప్రకటించారు. 1994లో లక్నో టెస్టు సందర్భంగా భారత బుకీ నుంచి రణతుంగ, డిసిల్వాలు 1500 అమెరికన్ డాలర్లు తీసుకున్నారని సుమతిపాల ఇటీవల ఆరోపించారు. దీంతో మాజీ సారథులిద్దరూ ఉమ్మడిగా మీడియా ముందుకువచ్చారు. ‘సుమతిపాల అధ్యక్షుడిగా ఉన్న క్రికెట్ కమిటీలో నేను పనిచేశా. ఒకవేళ ఫిక్సర్నైతే నన్ను ఎలా కొనసాగించారు? ఆయన ఆరోపణలను లెక్కలోకి తీసుకోవాల్సిన పని లేదు’ అని డిసిల్వా పేర్కొన్నాడు. ‘15 వేల డాలర్లు కాదు... ప్రపంచ కప్‌ను వదులుకుంటే 15 మిలియన్ డాలర్లైనా ఇచ్చేవారు. అయినా మేం ఎప్పుడూ డబ్బు కోసం ఆశపడలేదు. ఆటకు అంకితమయ్యాం. దేశానికి పేరు తేవడానికి శ్రమించాం’ అని 1996 ప్రపంచకప్‌లో శ్రీలంకను విజేతగా నిలిపిన రణతుంగ స్పష్టం చేశాడు. -
ఊహించని ట్విస్ట్ ఇచ్చిన షమీ భార్య!
సాక్షి, స్పోర్ట్స్ : టీమిండియా పేసర్ మహ్మద్ షమీపై వ్యక్తిగత ఆరోపణ (వివాహేతర సంబంధాలు, గృహహింస)లతో పాటు, కెరీర్‌కు సంబంధించి మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేసి పెను కలకలమే రేపింది అతని భార్య హసిన్ జహాన్. కానీ బీసీసీఐ అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆమెను విచారణ చేపట్టిన నేపథ్యంలో క్రికెటర్ భార్య యూటర్న్ తీసుకున్నారు. విచారణలో భాగంగా హసీన్ జహాన్‌ను శనివారం సాయంత్రం అధికారులు పలు అంశాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. సుమారు మూడు గంటలపాటు జరిగిన విచారణలో తడబాటుకు లోనవుతూ, కొన్ని ప్రశ్నలకు మౌనంగా ఉండటం తెలిసిందే. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన భర్త షమీ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడంటూ తాను ఆరోపించినట్లు వస్తున్న కథనాల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు హసీన్ జహాన్. ఇంగ్లండ్‌కు చెందిన మమ్మద్ బాయ్ అనే వ్యక్తి సాయంతో పాకిస్తాన్‌కు చెందిన అలిషబా అనే మహిళ నుంచి తన భర్త షమీ డబ్బులు తీసుకున్నాడని మాత్రమే చెప్పానన్నది సారాంశం. తనకు అసలు క్రికెట్ ఆట గురించే ఎలాంటి అవగాహన లేదని, అలాంటప్పుడు భర్త షమీ మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడని ఎలా ఆరోపిస్తానని జహాన్ ప్రశ్నించడంపై సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. షమీ కెరీర్ కు ఏ ఇబ్బంది లేదంటూ క్రికెటర్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా, నగదు అంశంపై షమీ, అతడి భార్య హసీన్ జహాన్ ఫోన్లో మాట్లాడుతూ గొడవపడ్డట్లు ఆడియో టేపుల్లో గుర్తించినట్లు బీసీసీఐ అవినీతీ నిరోధకశాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు షమీని అధికారులు ఆదివారం విచారించి కొన్ని విషయాలు తెలుసుకున్నారు. త్వరలో పూర్తిస్థాయి నివేదికను బీసీసీఐకి ఇవ్వనున్నారు. షమీ క్రికెట్ భవితవ్యం ఆ నివేదికపై ఆధారపడి ఉంటుంది. -
నన్ను ఉరి తీయండి: క్రికెటర్ షమీ
సాక్షి, న్యూఢిల్లీ: భార్య హసీన్ జహాన్ తనపై చేసిన ఆరోపణలు నిజమని తేలితే తనను ఉరి తీయాలంటూ టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనపై వస్తున్న ఫిక్సింగ్, గృహహింస ఇతరత్రా ఆరోపణలపై షమీ మరోసారి మీడియా ముందుకొచ్చాడు. నిన్నటివరకూ కేవలం గృహహింస కేసుతో సతమతమైన షమీకి నిన్నటి (బుధవారం) నుంచి కొత్త తలనొప్పి వచ్చి పడ్డ విషయం తెలిసిందే. హసీన్ చేసిన ఆరోపణల్లో ఒకటైన ‘టెలిఫోన్ సంభాషణ’పై విచారణ జరపాలని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం చీఫ్ నీరజ్ కుమార్‌ను సీఓఏ చైర్మన్ వినోద్ రాయ్ ఆదేశించారు. అయితే తనను వ్యక్తిగతంగా, వృత్తిగతంగా దిగజార్చే యత్నం చేస్తున్న భార్య హసీన్ జహాన్ గురించి తాజాగా షమీ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భార్య ఎప్పుడూ అబద్ధాలు చెప్పేదని, అభద్రతా భావంతో అనుమానించడం మొదలుపెట్టినట్లు తెలిపాడు. 'భర్తగా ఆమెకు చేయాల్సినవన్నీ చేశాను. కానీ అబద్ధాలు చెబుతూ నన్ను వివాదంలోకి లాగింది. ఆమె కోసం రూ.1.5 కోట్లు ఖర్చుపెట్టాను. షాపింగ్‌ల పేరుతో భార్య నా డెబిట్ కార్డులు మొత్తం ఇష్టమున్నట్లుగా వాడేసింది. దుబాయ్ నుంచి తనకు వజ్రాలు, బంగారు తీసుకురావాలని ఎప్పుడూ అడిగేది. ఆమె చేసే ఆరోపణలు చూస్తుంటే మేం మళ్లీ కలిసి జీవించే సూచనలు కనిపించడం లేదు. ఒకవేళ నేను తప్పు చేసినట్లు రుజువైతే నన్ను ఉరి తీయండి. నాపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదు. నేను దేశానికి ఎప్పుడూ ద్రోహం చేసే వ్యక్తిని కాదని' షమీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నా భార్యకు పెళ్లయిన విషయం తెలియదు మహ్మద్ షమీ వివాహేతర సంబంధాల కేసు రోజుకో మలుపు తిరుగుతున్న సంగతి తెలిసిందే. షమీ భార్య హసీన్ జహాన్‌కు ఇదివరకే పెళ్లైనట్లు, ఆమెకు ఇద్దరు పిల్లలుకూడా ఉన్నారని, ఆ విషయాన్ని దాచిపెట్టి ఆమె షమీని రెండోపెళ్లి చేసుకుందని తాజాగా కథనాలు వచ్చాయి. ఈ కథనాలపై షమి స్పందించాడు. తన భార్య హసీన్‌కు ముందే మరో వ్యక్తితో పెళ్లి అయిన విషయం నిజమేనని, ఆ విషయాన్ని దాచిపెట్టి తనను రెండో పెళ్లి చేసుకుందని అతను చెప్పుకొచ్చాడు. తాను హసీన్‌ను పెళ్లి చేసుకునేనాటికే ఆమెకు మరొకరితో పెళ్లి అయ్యిందని, అప్పటికే ఇద్దరు ఆడ పిల్లలు కూడా ఉన్నారని షమీ చెప్పాడు. ఈ విషయం తన వద్ద దాచి పెట్టిందని, ఈ పిల్లలు ఎవరు అని అడిగితే.. చనిపోయిన తన సోదరి పిల్లలు అని హసీన్ చెప్పిందని వివరించాడు. గుడ్డిగా నమ్మి తాను హసీన్‌ను పెళ్లి చేసుకున్నట్టు చెప్పారు. ఆ తర్వాత కొంత కాలానికి హసీన్ అసలు విషయం చెప్పిందని, అప్పటికే తనకు షఫీయుద్దీన్ అనే వ్యక్తితో పెళ్లి అయ్యిందని, ఆ పిల్లలు తన పిల్లలేనని చెప్పడంతో షాక్‌కు గురయ్యానని చెప్పాడు. -
పాక్‌లో ఫిక్సింగ్ ముసలం!
కరాచీ: వివాదాలకు చిరునామా అయిన పాకిస్థాన్ క్రికెట్లో మరో కలకలం రేగింది. ఇటీవల ముగిసిన జాతీయ టి20 చాంపియన్‌షిప్‌లో ఓ మ్యాచ్ ఫిక్స్ అయిందంటూ మాజీ టెస్టు క్రికెటర్ బాసిత్ అలీ ఆరోపణలు చేయడమే ఇందుకు కారణం. ఈ ఆరోపణలతో అప్రమత్తమైన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. సెక్యూరిటీ మేనేజర్ కల్నల్ వసీం, షఫీక్ అహ్మద్, అలీ నక్విలతో కమిటీ ఏర్పాటు చేసింది. ముగ్గురు సభ్యుల కమిటీ 15 రోజుల్లో విచారణ జరిపి నివేదికను సమర్పిస్తుంది. సియాల్ కోట్ స్టాలిన్స్-కరాచీ డాల్ఫిన్స్ మధ్య రావల్పిండిలో జరిగిన మ్యాచ్‌లో తక్కువ స్కోర్లు నమోదయ్యాయి. ఈ మ్యాచ్‌లో కరాచీ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌పైనే బాసిత్ అలీ ఆరోపణలు చేశాడు. దీంతో కెప్టెన్ షోయబ్ మాలిక్‌తో పాటు జట్టులోని క్రికెటర్లు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.