'చెత్త వాగుడు ఆపండి'.. భజ్జీ వార్నింగ్‌ | T20 World Cup 2021: Harbhajan Strong Warning Pak Fans India Fixing Allegation | Sakshi
Sakshi News home page

Harbhajan Singh: 'చెత్త వాగుడు ఆపండి'.. భజ్జీ వార్నింగ్‌

Published Sat, Nov 6 2021 8:24 PM | Last Updated on Sat, Nov 6 2021 9:13 PM

T20 World Cup 2021: Harbhajan Strong Warning Pak Fans India Fixing Allegation - Sakshi

Harbhajan Singh Strong Warning To Pakistan Fans.. టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ పాకిస్తాన్‌ అభిమానులకు వార్నింగ్‌ ఇవ్వడం ఆసక్తి కలిగించింది. రెండు భారీ ఓటముల తర్వాత టీమిండియా అఫ్గానిస్తాన్‌, స్కాట్లాండ్‌లపై భారీ తేడాతో గెలవడంపై మాకు అనుమానంగా ఉందంటూ కొందరు పాక్‌ అభిమానులు సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేశారు. టీమిండియా ఏదైనా ఫిక్సింగ్‌కు పాల్పడిందేమో అంటూ ట్రోల్స్‌ చేశారు. పాక్‌ అభిమానుల తీరుపై భజ్జీ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

చదవండి: T20 World Cup 2021: ఇదీ పరిస్థితి.. నువ్వు మరీనూ వసీం భాయ్‌.. చాల్లే!

''మీ చెత్తవాగుడు కట్టిపెడితే బాగుంటుంది. పాకిస్తాన్‌ ఈ టి20 ప్రపంచకప్‌లో మంచి ఆటతీరును కనబరిచింది. టీమిండియాపై గెలిచినందుకు పాక్‌ జట్టును ఒక క్రికెటర్‌గా అభినందిస్తున్నా. గేమ్‌ అనేది ఫెయిర్‌గా ఉండాలి కాబట్టి పాకిస్తాన్‌ విజయానికి కంగ్రాట్స్‌ చెబుతున్నా. కానీ న్యూజిలాండ్‌తో ఓటమి తర్వాత టీమిండియా బౌన్స్‌ బ్యాక్‌ అయింది. అఫ్గానిస్తాన్‌, స్కాట్లాండ్‌పై భారీ విజయాలతో సెమీస్‌ రేసులో నిలిచింది. ఇదంతా కష్టపడితే వచ్చింది.. అంతేకానీ ఎవరు ఫిక్సింగ్‌కు పాల్పడరు. అనవసరంగా మా జట్టుపై ఫిక్సింగ్‌ అంటూ ఆరోపణలు చేస్తే ఊరుకోము.. అలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణం. ఇది క్రికెట్‌పై ఉండే గౌరవాన్ని దెబ్బతీస్తుంది. 

టీమిండియాపై పాకిస్తాన్‌ విజయం సాధించడంతో ..  పాక్‌  అభిమానులు ఓర్వలేక ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా ఇలాంటివి ఆపేస్తే మంచిది.జ ఏం జరగాలని రాసి ఉంటే అదే జరుగుతుంది.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక టీమిండియా సోమవారం(నవంబర్‌ 8న) నమీబియాతో మ్యాచ్‌ ఆడనుంది. 

చదవండి: Chris Gayle: ఫన్నీ బౌలింగ్‌.. మిచెల్‌ మార్ష్‌ ఔట్‌తో ముగించాడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement