న్యూఢిల్లీ: భారత టేబుల్ టెన్నిస్ నేషనల్ కోచ్ సౌమ్యదీప్ రాయ్‌పై స్టార్ ప్లేయర్ మనికా బత్రా సంచలన ఆరోపణలు చేసింది. దోహా వేదికగా ఈ ఏడాది మార్చిలో జరిగిన ఒలింపిక్స్ క్వాలిఫయర్స్‌లో జాతీయ కోచ్ తనను మ్యాచ్ ఫిక్సింగ్ చేయమన్నాడని ఆమె ఆరోపించింది. అయితే అందుకు తాను అంగీకరించలేదని, టోక్యో ఒలింపిక్స్‌లో అందుకే అతని సహాయం తీసుకోలేదని టీటీ సమాఖ్యకు నివేదించింది. ఫిక్సింగ్ ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, ఇందుకు కావాల్సిన సాక్షాధారాలు తన దగ్గరున్నాయని, సరైన సమయంలో వాటిని అధికారుల ముందుంచుతానని పేర్కొంది.
మ్యాచ్ ఫిక్సింగ్ అంశంపై మాట్లాడేందుకు కోచ్ నా వ్యక్తిగత హోటల్ గదికి వచ్చాడని, తాను మాట వినకపోవడంతో బెదిరింపులకు దిగాడని, ఓ శిష్యురాలు కోసమే ఆయన ఇదంతా చేశాడని వెల్లడించింది. కాగా, జాతీయ కోచ్‌పై మనికా బత్రా చేసిన ఆరోపణలపై టీటీఎఫ్ఐ విచారణ చేపట్టకపోవడం పలు అనుమానలకు తావిస్తోంది. ఇదిలా ఉంటే, భారీ అంచనాల మధ్య టోక్యో ఒలింపిక్స్ బరిలోకి దిగిన ప్రపంచ 56వ ర్యాంకర్ మనికా బాత్రా మూడో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. ఒలింపిక్స్ సందర్భంగా నేషనల్ కోచ్ సేవలను తిరస్కరించడంపై అప్పట్లో టేబుల్ టెన్నిస్ సమాఖ్య మనికాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
చదవండి: వారెవ్వా క్యా సీన్ హై.. ట్రాక్‌పైనే అంధ అథ్లెట్‌కు లవ్ ప్రపోజల్
Comments
Please login to add a commentAdd a comment