
మమ్మల్నే ఎందుకు ‘టార్గెట్’ చేస్తారు?
ఐపీఎల్‌లో అన్ని దేశాల క్రికెటర్లు వచ్చి ఆడుతున్నా వెస్టిండీస్ క్రికెటర్లనే టార్గెట్ చేసుకుని అనేక మంది విమర్శలు చేస్తున్నారని డ్వేన్ బ్రేవో ఆరోపించాడు. డబ్బుల కోసం జాతీయ జట్టును వదిలేస్తున్నామనే ఆరోపణ చాలా బాధ కలిగిస్తోందని చెప్పాడు. ఆటను ఆస్వాదించడమే తన విజయరహస్యమన్నాడు. ‘ఏ జట్టు కోసం ఆడినా వందశాతం కష్టపడుతూ ఆటను ఆస్వాదిస్తా. దీంతో ఫలితాలు సానుకూలంగా వస్తాయి’ అని బ్రేవో చెప్పాడు.