దుబాయ్ ఇండోర్ క్రికెట్ సిరీస్‌కి వెళ్లనున్న ఆటగాళ్లు, వీరే! | Singapore kalasarthi cricketers for dubai indoor cricket series | Sakshi
Sakshi News home page

Club World Series: దుబాయ్ ఇండోర్ క్రికెట్ సిరీస్‌కి కళాసారథి క్రికెటర్లు.. ఎవరో తెలుసా?

Published Mon, Apr 10 2023 8:58 PM | Last Updated on Mon, Apr 10 2023 9:03 PM

Singapore kalasarthi cricketers for dubai indoor cricket series - Sakshi

2023 జనవరిలో జరిగిన సంక్రాంతి పండగ సందర్భంగా "శ్రీ సాంస్కృతిక కళాసారథి" ఏర్పాటు చేసిన 'మైగ్రెంట్ ఫోర్స్ క్రికెట్ లీగ్' (MFCL) టోర్నమెంట్ దాదాపు అందరికి గుర్తుండే ఉంటుంది. ఇందులో ఎన్నికైన ముగ్గురు ఉత్తమ తెలుగు కార్మిక సోదరులైన 'పినకాన తులసి రామ్, సీడి దిలీప్ వరప్రసాద్, అక్కరమని గణేష్ కుమార్' లను ఇండోర్ క్రికెట్ అసోసియేషన్ - సింగపూర్ (ICA) వారు ఏప్రిల్ 24, 25న జరగనున్న క్లబ్ వరల్డ్ సిరీస్, ఇండోర్ క్రికెట్ టోర్నమెంట్‌కు పంపుతున్నారని సమాచారం.

ఈ టీమ్ కెప్టెన్‌గా రామ్ మడిపల్లి వ్యవహరించనున్నారని సింగపూర్ ఇండోర్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిథులు మురళీధరన్ గోవిందరాజన్, శంకర్ వీర తెలిపారు. "మైగ్రెంట్ ఫోర్స్ క్రికెట్ లీగ్" (MFCL) లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ముగ్గురు ఆటగాళ్ళు దుబాయ్ ఇండోర్ క్రికెట్ సిరీస్‌కి ఎంపిక అవ్వడం పట్ల పలువు టోర్నమెంట్ నిర్వాహుకులు హర్షం వ్యక్తం చేశారు.

ఇందులో గిరిధర్ సారాయి, నగేష్ టేకూరి, పోతగౌని నర్సింహా గౌడ్, అశోక్ ముండ్రు, కంకిపాటి శశిధర్ , సుదర్శన్ పూల, రాము చామిరాజు, సుధాకర్ జొన్నాదుల, పాతూరి రాంబాబు, శ్రీధర్ భరద్వాజ్, సునీల్ రామినేని, కరుణాకర్ కంచేటి , మిట్టా ద్వారకానాథ్, తోట సహదేవుడు, ఎస్ కుమార్, లీల మోహన్, సురేంద్ర చేబ్రోలు మొదలైనవారు ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement