సింగపూర్‌లోని నేషనల్ వాటర్ ఏజెన్సీలో విషపూరిత వాయువులు పీల్చి 40 ఏళ్ల భారత సంతతి వ్యక్తి మృతి చెందాడు. అతడి అంత్యక్రియలు కోసం మృతదేహాన్ని తమిళనాడులోని స్వగ్రామానికి తరలిస్తున్నట్లు తెలిపారు. బాధితుడు తమిళనాడుకి చెందిన శ్రీనివాసన్ శివరామన్. అతను సింగపూర్‌లోని సూపర్‌సోనిక్ మెయింటెనెన్స్ సర్వీసెస్‌లో క్లీనింగ్ ఆపరేషన్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల మే23న నేషనల్ వాటర్ ఏజెన్సీ పబ్‌కి సంబంధించిన చోవాచు కాంగ్ వాటర్ వర్క్స్‌లో భాగంగా ట్యాంక్‌ను క్లీన్ చేస్తుండగా విషపూరిత వాయువులు పీల్చుకుని మరణించినట్లు సింగపూర్ సూపర్‌సోనిక్ కంపెనీ పేర్కొంది.
మే26న బాధితుడి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించి, మంగళవారమే(మే28న) భారత్‌లోని ఆయన స్వగ్రామానికి తరలించినట్లు తెలిపింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..మే23న శ్రీనివాసన్ శివరామన్ మరో ఇద్దరు మలేషియా కార్మికులు విషపూరిత పొగలు పీల్చి పబ్ సౌకర్యం వద్ద అపస్మారక స్థితిలో కనిపించారు. అయితే శివరామన్ అదేరోజు ఆస్పతత్రిలో చికిత్స పొందుతూ మరణించగా, మరో ఇద్దరు కార్మికులు ఇంటెన్సివ్ కేర్‌లో చికిత్స పొందుతున్నట్లు మలేషియ కార్మికులను నియమించే స్టార్‌గ్రూప్ ఎస్ట్ కంపెనీ పేర్కొంది.
ప్రాథమిక దర్యాప్తులో కార్మికులు హైడ్రోజన్ సల్పైడ్ వాయువుని పీల్చడం వల్లే అపస్మారక స్థితికి చేరుకున్నట్లు వెల్లడయ్యింది. కాగా, మృతుడి భార్య నర్మదా(35), ఇద్దరు కుమార్తెలు మహాశ్రీ (9), శ్రీనిషా (7)తో కలిసి సింగపూర్ ఆహార పరిశ్రమలో పనిచేస్తున్న సోదరుడు మోహన్ నవీన్‌కుమార్‌తో కలిసి ఉంటోంది. నిజానికి శివరామన్ మే27న సెలవుపై వెళ్లాల్సి ఉన్నందున మలేషియా వెళ్లేడానికి ముందు ఒక నెల సింగపూర్‌లో స్టే చేయాలని అనుకున్నారు. కానీ ఇంతలో ఈ విషాదకరమైన ఘటన చోటుచేసుకుందని బంధువు నవీన్ కుమార్ ఆవేదనగా చెప్పుకొచ్చారు. శివరామన్ మరణ వార్తతో మొత్తం కుటుంబం స్వగ్రామం వెళ్లిపోవాలని నిశ్చయించుకున్నట్లు నవీన్ కుమార్ తెలిపారు.
(చదవండి: సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని బలవన్మరణం)
Comments
Please login to add a commentAdd a comment