అమిత్‌ షాతో పాండ్యా బ్రదర్స్‌ భేటీ | Cricketer Hardik Pandya Brother Krunal Meet Home Minister Amit Shah | Sakshi
Sakshi News home page

టీ20 కెప్టెన్‌ అయిన తర్వాత అమిత్‌ షాతో హార్దిక్‌ పాండ్యా భేటీ!

Published Sat, Dec 31 2022 5:51 PM | Last Updated on Sat, Dec 31 2022 5:51 PM

Cricketer Hardik Pandya Brother Krunal Meet Home Minister Amit Shah - Sakshi

భారత క్రికెటర్లు హార్దిక్‌ పాండ్యా, క్రునాల్‌ పాండ్యాలు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను న్యూఇయర్‌ను పురస్కరించుకుని శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం షాతో భేటీపై సోషల్‌ మీడియా వేదికగా ఫోటో షేర్‌ చేశారు హార్దిక్‌ పాండ్యా. తన ఇంటికి ఆహ్వానించినందుకు అమిత్‌ షాకు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్యా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హోంమంత్రి అమిత్‌ షాతో వీరు భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

‘మీతో విలువైన సమయాన్ని గడిపేందుకు ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు. మిమ్మల్ని కలవడం గౌరవంగా భావిస్తున్నాం. ’అంటూ సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు హార్దిక్‌ పాండ్యా.  ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి. పాండ్యా స్వస్థలం గుజరాత్‌ కావడంతోనే షా వారిని కలిసినట్లుగా పలువురు కామెంట్లు చేస్తున్నారు. 

ప్రస్తుతం హార్దిక్‌, క్రునాల్‌ పాండ్యాలు క్రికెట్‌ నుంచి బ్రేక్‌ తీసుకుని సేదతీరుతున్నారు. డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌ టూర్‌కు హార్దిక్‌కు విశ్రాంతినివ్వగా.. క్రునాల్‌ పాండ్యా చివరిసారిగా నవంబర్‌లో విజయ్‌ హజారే ట్రోఫీలో బరోడా తరఫున ఆడారు. ఇటీవలో భారత టీ20 జట్టుకు సారథిగా ఎన్నికయ్యాడు హార్దిక్‌ పాండ్యా. కొత్త ఏడాదిని శ్రీలంకతో జరగనున్న 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో మొదలు పెట్టనున్నాడు. జనవరి 3 నుంచి ఈ పర్యటన ప్రారంభం కానుంది. ఈ టూర్‌లో రోహీత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌, భువనేశ్వర్‌ కుమార్‌ వంటి స్టార్లకు విశ్రాంతినిచ్చింది బీసీసీఐ. మరోవైపు.. శ్రీలంకతో జరగనున్న వన్డే సిరీస్‌కు హార్దిక్‌ను వైస్‌ కెప్టెన్‌గా నియమించింది బీసీసీఐ.

ఇదీ చదవండి: నీకే కాదు.. నీ తండ్రికి కూడా ఎవరూ భయపడటం లేదు: ఫడ్నవీస్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement