
క్రికెటర్లపై సినిమాలు అవసరం లేదు!
ఎమ్మెస్ ధోని జీవిత విశేషాలతో రూపొందిన సినిమా విడుదలకు కొద్ది రోజుల ముందు మరో క్రికెటర్ గౌతం గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. క్రికెటర్లపై సినిమాలు తీయాల్సిన అవసరం లేదని అతను అన్నాడు. ‘క్రికెటర్ల జీవితంపై సినిమాలు తీయడం అనే అంశంపై నాకు నమ్మకం లేదు. క్రికెటర్లతో పోలిస్తే దేశానికి ఎంతో ఎక్కువ సేవలు చేసినవారిపై సినిమా అవసరం. భారత జాతి కోసం గొప్ప పనులు చేసినవారు దేశంలో ఎంతో మంది ఉన్నారు. తీస్తే అలాంటివారి జీవితంపై సినిమాలు తీయాలి’ అని గంభీర్ నిర్మొహమాటంగా తన అభిప్రాయం వెల్లడించాడు.