
న్యూజిలాండ్- ఆస్ట్రేలియా అమీతుమీకి సై!
T20 World Cup 2021 Final New Zealand Vs Australia: ‘ట్రాన్స్ టాస్మన్’ జట్లు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఫైనల్ చేరడంతో టి20 ప్రపంచ కప్‌లో కొత్త జట్టు చాంపియన్‌గా నిలవడం ఖాయమైంది. ఆస్ట్రేలియా ఐదు సార్లు వన్డే వరల్డ్ కప్ సాధించినా 2007నుంచి టి20 వరల్డ్ కప్ ఆ టీమ్‌ను ఊరిస్తూనే ఉంది. 2010లో ఫైనల్ చేరిన ఆసీస్...తుది పోరులో ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలైంది.
మరో వైపు న్యూజిలాండ్‌కు టి20 ప్రపంచ కప్‌లో ఇదే తొలి ఫైనల్. 2015, 2019 వన్డే వరల్డ్ కప్‌లలో ఫైనల్ చేరినా... ఓటమికి పరిమితమైన కివీస్ తొలి ప్రపంచ కప్ టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకోవాలని పట్టుదలగా ఉంది. జూన్‌లోనే టెస్టు వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన విలియమ్సన్ సేన ఐదు నెలల వ్యవధిలో మరో ఫార్మాట్‌లో విజేతగా నిలిస్తే అది గొప్ప ఘనతగా భావించవచ్చు! ఇక తొలి సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్ ఇంగ్లండ్‌ను.. రెండో సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియా పాకిస్తాన్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. దాయాది జట్లు రెండూ కూడా ప్రత్యర్థులను ఐదు వికెట్ల తేడాతో ఓడించి మరీ తుది పోరుకు అర్హత సాధించడం విశేషం.
సెమీ ఫైనల్ స్కోర్లు: ఇంగ్లండ్ వర్సెస్ న్యూజిలాండ్
ఇంగ్లండ్- 166/4 (20)
న్యూజిలాండ్- 167/5 (19)
ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్
పాకిస్తాన్- 176/4 (20)
ఆస్ట్రేలియా- 177/5 (19)
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)