
టీమిండియా 2024 టీ20 వరల్డ్‌కప్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన సూర్యకుమార్ యాదవ్ సూపర్ మ్యాన్ క్యాచ్ ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో డేవిడ్ మిల్లర్ కొట్టిన షాట్‌ను స్కై బౌండరీ లైన్ వద్ద అద్భుతమైన విన్యాసం చేసి క్యాచ్‌గా మలిచాడు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరలైంది. స్కై సూపర్ మ్యాన్‌లా క్యాచ్ పట్టాడని అభిమానులు కొనియాడారు.
అయితే స్కై పట్టిన ఈ క్యాచ్ క్యాచ్ కాదు సిక్సర్ అని కొందరు సౌతాఫ్రికా అభిమానులు అంటున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో నిన్నటి నుంచి సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో స్కై క్యాచ్ పట్టుకునే క్రమంలో అతని కాలు బౌండరీ లైన్‌ను తాకినట్లు కనిపిస్తుంది.
This certainly deserved more than one look, just saying. Boundary rope looks like it clearly moves. 🤷 pic.twitter.com/ulWyT5IJxy
— Ben Curtis 🇿🇦 (@BenCurtis22) June 29, 2024
ఈ వీడియోను పోస్ట్ చేస్తూ.. ఓ సౌతాఫ్రికా అభిమాని మేం దోచుకోబడ్డాం అని కామెంట్ చేశాడు. ఈ వీడియోకు సోషల్‌మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. టీమిండియా వ్యతిరేకులు ఈ వీడియోను ఆసరగా చేసుకునే భారత జట్టును నిందిస్తున్నారు. టీమిండియా మోసం చేసి గెలిచిందని కామెంట్ చేస్తున్నారు.
బంతి చేతిలో ఉన్నప్పుడు సూర్యకుమార్ కాలు బౌండరీ లైన్‌ను తాకినట్లు రీప్లేలో స్పష్టంగా కనిపించినా థర్డ్ అంపైర్ నిజాయితీగా వ్యవహరించలేదని ఆరోపిస్తున్నారు. ఒకవేళ ఆ బంతిని సిక్సర్‌గా ప్రకటించి ఉంటే సౌతాఫ్రికా వరల్డ్‌కప్ గెలిచేదని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తుంది.
కాగా, 2024 వరల్డ్‌కప్ ఫైనల్లో టీమిండియా సౌతాఫ్రికాపై 7 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. చివరి నిమిషం వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో భారత్ పైచేయి సాధించింది. సూర్యకుమార్ క్యాచ్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. చివరి ఓవర్‌లో సౌతాఫ్రికా గెలుపుకు 16 పరుగులు అవసరం కాగా.. ఆ ఓవర్ తొలి బంతికే మిల్లర్ ఔటయ్యాడు. మిల్లర్ ఔట్ కావడంతో సౌతాఫ్రికా విజయావకాశాలు దెబ్బతిన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment