చాలా బాధగా ఉంది.. ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నా: మిల్లర్‌ | David Miller shared a heartfelt message after painful defeat in Barbados | Sakshi
Sakshi News home page

చాలా బాధగా ఉంది.. ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నా: మిల్లర్‌

Published Tue, Jul 2 2024 5:36 PM | Last Updated on Fri, Jul 5 2024 11:10 AM

David Miller shared a heartfelt message after painful defeat in Barbados

టీ20 వరల్డ్‌కప్‌-2024 టోర్నీ ఆధ్యంతం అదరగొట్టిన దక్షిణాఫ్రికా ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. ఫైనల్లో ఎలాగైనా గెలిచి తమ 30 ఏళ్ల వరల్డ్‌కప్‌ నిరీక్షణకు తెరదించాలని భావించిన సఫారీలకు మరోసారి నిరాశే ఎదురైంది. బార్బోడస్‌ వేదికగా భారత్‌తో జరిగిన టైటిల్‌ పోరులో 7 పరుగుల తేడాతో సౌతాఫ్రికా పరాజయం పాలైంది. 

గెలుపు అంచుల దాక వెళ్లిన దక్షిణాఫ్రికా.. ఆఖరిలో భారత బౌలర్ల దాటికి చేతులేత్తేసింది. ఈ మ్యాచ్‌ అనంతరం భారత ఆటగాళ్లు సెలబ్రేషన్స్‌లో మునిగి తేలితే.. మరోవైపు ప్రోటీస్‌ ఆటగాళ్లు న్నీటి పర్యంతం అయ్యారు. ముఖ్యంగా ప్రోటీస్‌ స్టార్‌ డేవిడ్‌ మిల్లర్‌ను ఓదార్చడం ఎవరి తరం కాలేదు.

తన చివరి ఓవర్‌ వరకు క్రీజులో ఉన్నప్పటికి జట్టును గెలిపించలేకపోయానన్న బాధతో మిల్లర్‌ కుంగిపోయాడు. కాగా ఆఖరి ఓవర్‌లో ప్రోటీస్‌ విజయానికి  16 పరుగులు అవసరమవ్వగా..తొలి బంతికే సూర్యకుమార్‌ యాదవ్‌ అద్భుతమైన క్యాచ్‌తో పెవిలియన్‌కు పంపాడు. దీంతో ప్రోటీస్‌ ఓటమి లాంఛనమైంది. కాగా వరల్డ్‌కప్‌లో ఓటమిపై డేవిడ్‌ మిల్లర్‌ తొలిసారి స్పందించాడు. సోషల్‌ మీడియా వేదికగా భావోద్వేగ నోట్‌ను షేర్‌ చేశాడు.

"నేను చాలా నిరాశ‌కు గురయ్యా. రెండు రోజులు గడిచినప్పటికి ఇంకా మా ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాను. నా బాధను మాటల్లో వర్ణించలేను. అయితే ఒక్క విషయాన్ని మాత్రం గొప్పగా చెప్పగలను. మా జట్టు పోరాటం, ప్రదర్శన పట్ల చాలా గర్వంగా ఉంది. ఈ నెలలో ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూశాము. 

కానీ ఈ ప్రయాణం మాత్రం ఎంతో అద్భుతం. మేము మా బాధను ఇంకా భరిస్తున్నాము. కానీ ఒక జట్టుగా మేము మరింత బలంగా తిరిగి వస్తామన్న నమ్మకం నాకు ఉందంటూ" ఇన్‌స్టాలో మిల్లర్‌ రాసుకొచ్చాడు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement