
ఆసీస్ ఆటగాళ్లు (ఫైల్ ఫొటో)
ఆక్లాండ్ : ఆస్ట్రేలియా ఆటగాళ్లు 2015 ప్రపంచకప్ ఫైనల్లో బాల్ ట్యాంపరింగ్‌కు యత్నించి ఉంటారని న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ గ్రాంట్ ఇలియట్ అనుమానం వ్యక్తం చేశారు. శుక్రవారం ఓ రేడియో స్టేషన్‌లో తాజా బాల్ ట్యాంపరింగ్ ఉదంతంపై మాట్లాడుతూ.. 2015 ప్రపంచకప్ ఫైనల్లో మా జట్టు ఆరంభం బాగుందని, 150 పరుగులకు మూడు వికెట్లే కోల్పయమన్నారు. అయితే ఈ సమయంలో బంతి అనూహ్యంగా రివర్స్ స్వింగ్ అయిందని, అప్పటి వరకు మాములుగా బౌలింగ్ చేసిన బౌలర్లు బంతిని అద్భుతంగా స్వింగ్ చేశాడన్నారు. దీంతో తాను బ్యాటింగ్‌లో ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో వారు బంతి ఆకారాన్ని ఏమైనా దెబ్బతీసారేమో అనే అనుమానం వచ్చినట్లు నాటి రోజును ఈ కివీస్ ప్లేయర్ గుర్తు చేసుకున్నారు. ఇక 2015 ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్ ఆసీస్ చేతిలో ఓడిన విషయం తెలిసిందే. ఈమ్యాచ్‌లో గ్రాంట్ ఇలియట్ ఒక్కరే (83) పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు.
స్మిత్ నిషేదంపై సానుభూతి..
స్మిత్, వార్నర్, బెన్ క్రాఫ్ట్‌ల నిషేదం పట్ల ఇలియట్ సానుభూతిని వ్యక్తం చేశారు. జోహన్నస్ బర్గ్ ఏయిర్‌పోర్టులో స్మిత్ పట్ల వ్యవహరించిన తీరును ఖండించారు. వారు నేరస్థులు ఏం కాదని, వారి పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు అమానుషమన్నారు. ‘నేను చూసిన వీడియోలో స్మిత్‌ను ఓ నేరస్థుడిలా పోలీసులు చుట్టుముట్టి మరి తీసుకెళ్లారు. అతనేం నేరస్థుడు కాదు. గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు’ అని ఏలియట్ అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment