grant elliott
-
ప్రపంచకప్ ఫైనల్లో ఆసీస్ ట్యాంపరింగ్!
ఆక్లాండ్ : ఆస్ట్రేలియా ఆటగాళ్లు 2015 ప్రపంచకప్ ఫైనల్లో బాల్ ట్యాంపరింగ్‌కు యత్నించి ఉంటారని న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ గ్రాంట్ ఇలియట్ అనుమానం వ్యక్తం చేశారు. శుక్రవారం ఓ రేడియో స్టేషన్లో తాజా బాల్ ట్యాంపరింగ్ ఉదంతంపై మాట్లాడుతూ.. 2015 ప్రపంచకప్ ఫైనల్లో మా జట్టు ఆరంభం బాగుందని, 150 పరుగులకు మూడు వికెట్లే కోల్పయమన్నారు. అయితే ఈ సమయంలో బంతి అనూహ్యంగా రివర్స్ స్వింగ్ అయిందని, అప్పటి వరకు మాములుగా బౌలింగ్ చేసిన బౌలర్లు బంతిని అద్భుతంగా స్వింగ్ చేశాడన్నారు. దీంతో తాను బ్యాటింగ్‌లో ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో వారు బంతి ఆకారాన్ని ఏమైనా దెబ్బతీసారేమో అనే అనుమానం వచ్చినట్లు నాటి రోజును ఈ కివీస్ ప్లేయర్ గుర్తు చేసుకున్నారు. ఇక 2015 ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్ ఆసీస్ చేతిలో ఓడిన విషయం తెలిసిందే. ఈమ్యాచ్‌లో గ్రాంట్ ఇలియట్ ఒక్కరే (83) పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. స్మిత్ నిషేదంపై సానుభూతి.. స్మిత్, వార్నర్, బెన్ క్రాఫ్ట్‌ల నిషేదం పట్ల ఇలియట్ సానుభూతిని వ్యక్తం చేశారు. జోహన్నస్ బర్గ్ ఏయిర్‌పోర్టులో స్మిత్ పట్ల వ్యవహరించిన తీరును ఖండించారు. వారు నేరస్థులు ఏం కాదని, వారి పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు అమానుషమన్నారు. ‘నేను చూసిన వీడియోలో స్మిత్‌ను ఓ నేరస్థుడిలా పోలీసులు చుట్టుముట్టి మరి తీసుకెళ్లారు. అతనేం నేరస్థుడు కాదు. గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు’ అని ఏలియట్ అభిప్రాయపడ్డారు. -
ఇలియట్ అర్ధ సెంచరీ
మెల్ బోర్న్: వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆదివారమిక్కడ ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో న్యూజిలాండ్ బ్యాట్స్ మన్ గ్రాంట్ ఇలియట్ అర్ధ సెంచరీ సాధించాడు. 51 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్ తో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. వన్డేల్లో అతడికి 9వ అర్థసెంచరీ. దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్లో అద్భుత ఇన్నింగ్స్ తో జట్టుకు విజయాన్ని అందించిన ఇలియట్ నేటి మ్యాచ్ లోనూ విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. 39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన కివీస్ ను ఇలియట్, టేలర్ ఆదుకున్నారు. నిలకడగా ఆడుతూ వీరిద్దరూ నాలుగో వికెట్ కు 123 బంతుల్లో 94 పరుగులు జోడించారు. కివీస్ 33 ఓవర్లలో 134/3 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. ఇలియట్ 62, టేలర్ 35 పరుగులతో ఆడుతున్నారు. -
కప్ గెలిస్తే నచ్చిన చోటికి హనీమూన్...
సోదరికి ఇలియట్ హామీ వెల్లింగ్టన్: ప్రపంచకప్ క్రికెట్ చరిత్రలో తొలిసారిగా న్యూజిలాండ్ జట్టు ఫైనల్‌కు చేరుకోవడంలో... గ్రాంట్ ఇలియట్ కీలక పాత్ర మరువలేనిది. అయితే జట్టు విజయంపై సంతోషంగానే ఉన్నా తుది పోరు జరిగే ఈనెల 29నే ఇలియట్ సోదరి వివాహం కూడా జరుగబోతోంది. దీంతో ఆ వివాహానికి హాజరుకాలేని పరిస్థితి తనది. అయితే కివీస్ ప్రపంచకప్ గెలిస్తే కోరుకున్న చోటికి హనీమూన్‌కు పంపిస్తానని చెల్లికి మాట ఇచ్చాడు. వాస్తవానికి ఈ పెళ్లి షెడ్యూల్ ఏడాదికి ముందే ఫిక్స్ అయ్యింది. అప్పుడు జట్టులో ఇలియట్కు చోటు లేదు. ఈ మెగా టోర్నీలో ఆడేందుకు అవకాశం వస్తుందని కూడా తను అనుకోలేదు. అందుకే ఈ తేదీని ఖరారు చేశామని ఇలియట్ సోదరి కేట్ తెలిపింది.