ఇలియట్ అర్ధ సెంచరీ | Grant Elliott beats half century | Sakshi
Sakshi News home page

ఇలియట్ అర్ధ సెంచరీ

Published Sun, Mar 29 2015 11:17 AM | Last Updated on Sat, Sep 2 2017 11:33 PM

ఇలియట్ అర్ధ సెంచరీ

ఇలియట్ అర్ధ సెంచరీ

మెల్ బోర్న్: వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆదివారమిక్కడ ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో న్యూజిలాండ్ బ్యాట్స్ మన్ గ్రాంట్ ఇలియట్ అర్ధ సెంచరీ సాధించాడు. 51 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్ తో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. వన్డేల్లో అతడికి 9వ అర్థసెంచరీ. దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్లో అద్భుత ఇన్నింగ్స్ తో జట్టుకు విజయాన్ని అందించిన ఇలియట్ నేటి మ్యాచ్ లోనూ విలువైన ఇన్నింగ్స్ ఆడాడు.

39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన కివీస్ ను ఇలియట్, టేలర్ ఆదుకున్నారు. నిలకడగా ఆడుతూ వీరిద్దరూ నాలుగో వికెట్ కు 123 బంతుల్లో 94 పరుగులు జోడించారు. కివీస్ 33 ఓవర్లలో 134/3 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. ఇలియట్ 62, టేలర్ 35 పరుగులతో ఆడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement