కప్ గెలిస్తే నచ్చిన చోటికి హనీమూన్... | elliott promises his sister to take to her honey moon of her choice | Sakshi
Sakshi News home page

కప్ గెలిస్తే నచ్చిన చోటికి హనీమూన్...

Published Fri, Mar 27 2015 1:18 AM | Last Updated on Wed, Oct 17 2018 4:43 PM

కప్ గెలిస్తే నచ్చిన చోటికి హనీమూన్... - Sakshi

కప్ గెలిస్తే నచ్చిన చోటికి హనీమూన్...

సోదరికి ఇలియట్ హామీ
వెల్లింగ్టన్: ప్రపంచకప్ క్రికెట్ చరిత్రలో తొలిసారిగా న్యూజిలాండ్ జట్టు ఫైనల్‌కు చేరుకోవడంలో... గ్రాంట్ ఇలియట్ కీలక పాత్ర మరువలేనిది. అయితే జట్టు విజయంపై సంతోషంగానే ఉన్నా తుది పోరు జరిగే ఈనెల 29నే ఇలియట్ సోదరి వివాహం కూడా జరుగబోతోంది. దీంతో ఆ వివాహానికి హాజరుకాలేని పరిస్థితి తనది.

అయితే కివీస్ ప్రపంచకప్ గెలిస్తే కోరుకున్న చోటికి హనీమూన్‌కు పంపిస్తానని చెల్లికి మాట ఇచ్చాడు. వాస్తవానికి ఈ పెళ్లి షెడ్యూల్ ఏడాదికి ముందే ఫిక్స్ అయ్యింది. అప్పుడు జట్టులో ఇలియట్‌కు చోటు లేదు. ఈ మెగా టోర్నీలో ఆడేందుకు అవకాశం వస్తుందని కూడా తను అనుకోలేదు. అందుకే ఈ తేదీని ఖరారు చేశామని ఇలియట్ సోదరి కేట్ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement