
వన్డే వరల్డ్‌కప్-2023 ట్రోఫీని ముద్దాడేందుకు టీమిండియా అడుగుదూరంలో నిలిచింది. నవంబర్ 19న అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఫైనల్ పోరులో ఆస్ట్రేలియాతో అమీతుమీ తెల్చుకోవడానికి సిద్దమైంది. తుది పోరులో ఆస్ట్రేలియాను చిత్తు చేసి ముచ్చటగా మూడో సారి టైటిల్‌ను సొంతం చేసుకోవాలని భారత జట్టు వ్యహాలు రచిస్తోంది.
ఈ క్రమంలో ఫైనల్ మ్యాచ్ కోసం భారత జట్టు అహ్మదాబాద్‌లో అడుగుపెట్టింది. గురువారం రాత్రి ముంబై నుంచి ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్‌కు చేరకుకుంది. అహ్మదాబాద్‌కు చేరుకున్న భారత జట్టుకు ఘన స్వాగతం లభించింది. జట్టు బస చేయనున్న హోటల్ సిబ్బంది భారత ఆటగాళ్లకు నుదుట తిలకం దిద్ది మరీ స్వాగతం పలికారు.
ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు.. ఆల్ ది బెస్ట్ టీమిండియా అంటూ కామెంట్లు చేస్తున్నారు. అహ్మదాబాద్‌కు చేరుకున్న భారత జట్టు శుక్రవారం సాయంత్రం తమ ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గోనుంది.
చదవండి: ఆసీస్‌ను ఒత్తిడిలోకి నెట్టాం.. మాకూ విజయావకాశాలు వచ్చాయి: సౌతాఫ్రికా కెప్టెన్
A beautiful welcome of team India in Ahmedabad. pic.twitter.com/Qh4lGHHp5c
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 16, 2023