టీ20 వరల్డ్‌కప్-2024 టైటిల్‌ను ముద్దాడేందుకు టీమిండియా అడుగు దూరంలో నిలిచింది. ఈ మెగా టోర్నీ తుదిపోరులో జూన్ 29 (శనివారం) బార్బోడస్ వేదికగా దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది.
ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి తమ 13 ఏళ్ల వరల్డ్‌కప్ నిరీక్షణకు తెరదించాలని భారత్ భావిస్తోంది. ఈ తుది పోరు కోసం రోహిత్ సేన ఇప్పటికే బార్బోడస్‌కు చేరుకుంది. అయితే ఫైనల్ మ్యాచ్‌కు ముందు భారత జట్టు మెనెజ్‌మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది.
ఫైనల్ మ్యాచ్ ముందు తమ జట్టు ఆటగాళ్లు ఎటువంటి గాయాల బారిన పడకుండా ఉండడానికి శుక్రవారం తమ ప్రాక్టీస్ సెషన్‌ను భారత్ మెనెజ్‌మెంట్ రద్దు చేసింది. సెమీఫైనల్‌కు, ఫైనల్‌కు కేవలం ఒక్క రోజు మాత్రమే గ్యాప్ ఉండడంతో మెనెజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది.
కాగా గురువారం జరిగిన జరిగిన సెకెండ్ సెమీస్‌లో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్.. ముచ్చటగా మూడో సారి ఫైనల్లో అడుగుపెట్టింది. మరోవైపు దక్షిణాఫ్రికా మాత్రం ఈ ఫైనల్ మ్యాచ్‌కు ముందు తమ ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గోంది. తొలిసారి ఫైనల్‌కు చేరుకున్న సౌతాఫ్రికా నెట్స్‌లో తీవ్రంగా శ్రమించింది. కాగా ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment