సెమీఫైనల్లో 7-1 తేడాతో బ్రెజిల్ చిత్తు!
సెమీఫైనల్లో 7-1 తేడాతో బ్రెజిల్ చిత్తు!
Published Wed, Jul 9 2014 10:15 AM | Last Updated on Sat, Sep 2 2017 10:00 AM
ప్రపంచకప్ పుట్ బాల్ ఫైనల్లోకి జర్మనీ దూసుకెళ్లింది. బెలో హరిజోంటే లో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో ఆతిథ్య జట్టు బ్రెజిల్ ను చిత్తు చిత్తుగా ఓడించింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్ లో జర్మనీ ఏకంగా 7-1 గోల్స్ తేడాతో బ్రెజిల్ పై విజయం సాధించింది. ఈ విజయంతో జర్మనీ ఎనిమిదోసారి ప్రపంచ పుట్ బాల్ కప్ పైనల్లోకి చేరిన ఘనతను సొంతం చేసుకుంది.
జర్మనీ జట్టు మ్యాచ్ తొలిభాగంలోనే 11, 23,24, 26, 29 నిమిషాల్లో గోల్స్ సాధించి ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఆట రెండో అర్ధ భాగంలో అదే ఊపును కొనసాగించి 69, 76 నిమిషాల్లో మరో రెండు గోల్స్ సాధించింది. జర్మనీ ఆటగాళ్ల ఎటాకింగ్ కు బ్రెజిల్ విలవిల్లాడింది.
మ్యాచ్ మొత్తంలో తన ఆటతీరుతో కనీసం ప్రభావం చూపలేకపోయిన బ్రెజిల్.. ఆట చివర్లో ఆస్కార్ 89 నిమిషంలో గోల్ సాధించడం బ్రెజిల్ కు కొంతలో కొంత ఊరట లభించింది. ఓ అంతర్జాతీయ మ్యాచ్ లో బ్రెజిల్ ఇంత చెత్తగా ఓటమి పాలవ్వడం 1920 తర్వాత ఇదే తొలిసారి. 1920లో ఉరుగ్వే చేతిలో బ్రెజిల్ 0-6 తేడాతో ఓటమి పాలైంది.
Advertisement