భారీ వర్షం కారణంగా ఆదివారం(మే28) జరగాల్సిన IPL 2023 ఫైనల్ రిజర్వేడే సోమవారంకు వాయిదా పడిన విషయం విధితమే. ఈ టైటిల్ పోరులో అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, చెన్నైసూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. అయితే రిజర్వ్‌డే రోజు సోమవారం కూడా వర్షం కురిసే అవకాశం ఉండడంతో.. కనీసం ఈ రోజునైనా మ్యాచ్ జరగుతుందా లేదా అన్న ఆందోళన అభిమానులలో నెలకొంది. కాగా ప్రస్తుతం మ్యాచ్ జరగున్న అహ్మదాబాద్‌లో ప్రస్తుత వాతావారణం ఎలా ఉందో తెలుసుకుందాం.
వాతావరణం ఎలా ఉందంటే?
ప్రస్తుతం అహ్మదాబాద్‌లో ఎండ బాగా కాస్తోంది. పొడివాతావరణం ఉంది. ఉదయం నుంచి ఎటువంటి వర్షం కురవలేదు. అహ్మదాబాద్‌లో ప్రస్తుతం ఉష్ణోగ్రత 35డిగ్రీలగా ఉంది. అక్కడ వాతావరణంకు సంబంధించిన ఫోటోలను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం వాతావరణం బాగా ఉన్నప్పటికీ సాయంత్రంకు ఎలా మారుతుందో వేచి చూడాలి.
ఇక ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. అయితే సోమవారం నాడు వర్షం కురిసే అవకాశం 40 శాతం మాత్రమే మాత్రమే ఉన్నట్లు అక్కడ వాతావరణ శాఖ వెల్లడించింది. కాబట్టి మ్యాచ్ జరిగే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి.
చదవండి: WTC Final 2023: రోహిత్ శర్మతో కలిసి లండన్‌కు యశస్వి.. తిలక్ వర్మ రియాక్షన్.. వైరల్
Wether is clearl at Ahmedabad.
— Vikram (@Vikram47467061) May 29, 2023
Time 3:12 pm
Its Hot sunny 🌞 #IPL2023Final #weather #Ahmedabad pic.twitter.com/J7v9V3ZCt2
Today’s weather in Ahmedabad pic.twitter.com/0Uirdwp1sq
— Yash MSdian ™️ 🦁 (@itzyash07) May 29, 2023
Comments
Please login to add a commentAdd a comment