వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈనెల 14న జరుగనున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు సంబంధించి పలు ఆసక్తికర అప్‌డేట్స్ వచ్చాయి. క్రికెట్ ప్రపంచం మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్‌కు ముందు పలు ఆసక్తికర కార్యక్రమాలు జరుగనున్నట్లు ఓ ప్రముఖ దినపత్రిక వెల్లడించింది.
ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అతిరధ మహారధులు నరేంద్ర మోదీ స్టేడియంకు తరలిరానున్నట్లు సదరు పత్రిక పేర్కొంది. సినీ సెలబ్రిటీలు అమితాబ్ బచ్చన్, తలైవా రజినీకాంత్, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌తో పాటు వివిధ రంగాలకు చెందిన పలువురు సెలబ్రిటీలు ఈ హైఓల్టేజీ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షిస్తారని తెలుస్తుంది.
మ్యాచ్ ప్రారంభానికి ముందు ప్రముఖ బాలీవుడ్ సింగర్ అర్జిత్ సింగ్ స్పెషల్ ప్రోగ్రాం ఉంటుందని సమాచారం. అలాగే పలువురు సినీ సెలబ్రిటీలచే నృత్య ప్రదర్శన కూడా ఉంటుందని తెలుస్తుంది. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు లక్ష మందికి పైగా స్టేడియంకు వస్తారని బీసీసీఐ అంచనా వేస్తుంది.
టోర్నీ ఆరంభానికి ముందు ఎలాంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించని బీసీసీఐ.. భారత్-పాక్ మ్యాచ్‌కు ముందు ఇలాంటి ఆసక్తికర కార్యక్రమాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.
కాగా, ప్రస్తుత వరల్డ్‌కప్‌లో భారత్.. తమ తొలి మ్యాచ్‌లో ఆసీస్‌ను మట్టికరిపించి బోణీ విజయం సాధించింది. ఇవాళ (అక్టోబర్ 11) జరుగబోయే రెండో మ్యాచ్‌లో టీమిండియా ఆఫ్ఘనిస్తాన్‌ను (న్యూఢిల్లీ వేదికగా) ఢీకొంటుంది. ప్రస్తుతం భారత్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుంది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన న్యూజిలాండ్, పాక్‌లు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment