GT vs DC
-
అశుతోష్‌పై మండిపడ్డ ఇషాంత్ శర్మ.. వేలు చూపిస్తూ వార్నింగ్
గుజరాత్ టైటాన్స్ బౌలర్ ఇషాంత్ శర్మ (Ishant Sharma) సహనం కోల్పోయాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ అశుతోష్ శర్మ (Ashuthosh Sharma)కు వేలు చూపిస్తూ మైదానంలోనే వార్నింగ్ ఇచ్చాడు. ఫీల్డ్ అంపైర్‌తో పాటు.. టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. అసలేం జరిగిందంటే..ఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా గుజరాత్ టైటాన్స్- ఢిల్లీ క్యాపిటల్స్ (GT vs DC) మధ్య శనివారం మ్యాచ్ జరిగింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్ గెలిచిన టైటాన్స్.. ఢిల్లీని తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.అశుతోష్ శర్మ ధనాధన్‌ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ ఎనిమిది వికెట్ల నష్టానికి 203 పరుగులు సాధించింది. ఓపెనర్లు అభిషేక్ పోరెల్ (9 బంతుల్లో 18), కరుణ్ నాయర్ (18 బంతుల్లో 31) వేగంగా ఆడగా.. కేఎల్ రాహుల్ (14 బంతుల్లో 28) కాసేపు మెరుపులు మెరిపించాడు.ఇక అక్షర్ పటేల్ కెప్టెన్ ఇన్నింగ్స్ (21 బంతుల్లో 31)తో మెరవగా.. ఢిల్లీ నయా ఫినిషర్ అశుతోష్ శర్మ (19 బంతుల్లో 37) ధనాధన్ బ్యాటింగ్‌తో దంచికొట్టాడు. అయితే, ఢిల్లీ ఇన్నింగ్స్‌లో పందొమ్మిదో ఓవర్లో గుజరాత్ పేసర్ ఇషాంత్ శర్మ బంతితో బరిలోకి దిగాడు.అప్పటికి డొనొవన్ ఫెరీరా, అశుతోష్ క్రీజులో ఉన్నారు. ఇషాంత్ బౌలింగ్‌లో తొలి బంతిని ఎదుర్కొన్న అశుతోష్ సింగిల్ తీయగా.. మరుసటి బంతికి ఫెరీరా రన్ పూర్తి చేశాడు. మూడో బంతికి మళ్లీ అశుతోష్ సింగిల్ తీయగా.. నాలుగో బంతికి ఫెరీరా సాయి కిషోర్‌కు క్యాచ్ ఇచ్చి ఏడో వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు.వేలు చూపిస్తూ వార్నింగ్ఫెరీరా స్థానంలో వచ్చిన మిచెల్ స్టార్క్ సింగిల్ తీయగా.. అశుతోష్ మళ్లీ స్ట్రైక్‌లోకి వచ్చాడు. అయితే, ఆఖరి బంతిని ఇషాంత్ వైడ్‌గా వేయగా.. అశుతోష్‌కు మరో బంతి ఆడే అవకాశం వచ్చింది. ఈ క్రమంలో ఇషాంత్ సంధించిన బౌన్సర్‌ను అశుతోష్ ఎదుర్కోలేకపోయాడు.ఇక బంతి వెళ్లి వికెట్ కీపర్ జోస్ బట్లర్ చేతుల్లో పడింది. ఈ క్రమంలో బంతి అశుతోష్ గ్లోవ్స్‌ను తాకిందని భావించిన గుజరాత్ ఆటగాళ్లు బిగ్గరగా అవుట్‌కి అప్పీలు చేశారు. అయితే, అంపైర్ నుంచి మాత్రం ఎటువంటి స్పందనా రాలేదు. ఇంతలో అశుతోష్ బంతి భుజాన్ని రాసుకుని వెళ్లిందన్నట్లుగా సైగ చేశాడు. అశుతోష్ శర్మ చర్యను సహించలేకపోయిన ఇషాంత్ శర్మ అతడి దగ్గరికి వెళ్లి వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చినట్లు కనిపించింది. తర్వాత అశుతోష్ తన షర్టును పైకెత్తి బంతి భుజానికి తాకిందని అంపైర్‌కు చెప్పే ప్రయత్నం చేశాడు.Battle b/w ishant sharma vs ashutosh Sharma 🤣 pic.twitter.com/EMd12Z2o7V— Daigo18 (@daigo2637391027) April 19, 2025ఇరగదీసిన బట్లర్ఇంతలో అంపైర్‌తో పాటు గిల్ జోక్యం చేసుకుని ఇషాంత్‌ను పక్కకు తీసుకువెళ్లారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఢిల్లీ విధించిన 204 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 19.2 ఓవర్లలో ఛేదించింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ జోస్ బట్లర్ (54 బంతుల్లో 97 నాటౌట్), షెర్ఫానే రూథర్‌ఫర్డ్ (34 బంతుల్లో 43), రాహుల్ తెవాటియా (3 బంతుల్లో 11 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్‌తో గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించారు.చదవండి: IPL 2025: శుబ్‌మన్ గిల్‌కు భారీ షాక్! Right off the middle! 💥#AshutoshSharma hits the accelerator and launches a stunning SIX over the square boundary!Watch the LIVE action ➡ https://t.co/6YcPaJPTHV#IPLonJioStar 👉 #GTvDC | LIVE NOW on Star Sports 2, Star Sports 2 Hindi & JioHotstar! pic.twitter.com/TpSfdehCwX— Star Sports (@StarSportsIndia) April 19, 2025 -
శుబ్‌మన్ గిల్‌కు భారీ షాక్!
గెలుపు సంబరంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill)కు ఎదురుదెబ్బ తగిలింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అతడికి రూ. 12 లక్షల జరిమానా విధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)తో శనివారం నాటి మ్యాచ్ సందర్భంగా.. నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తి చేయనందున ఈ మేరకు శిక్ష విధించింది.ఇందుకు సంబంధించి ఐపీఎల్ పాలక మండలి అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఐపీఎల్ నిబంధనల్లోని ఆర్టికల్ 2.22 ప్రకారం.. స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసినందుకు గానూ గిల్‌కు జరిమానా విధించినట్లు తెలిపింది. ఐపీఎల్-2025 (IPL 2025) సీజన్లో అతడు మొదటిసారి ఈ తప్పిదానికి పాల్పడినందుకు రూ. 12 లక్షలతో సరిపెట్టినట్లు పేర్కొంది.ఢిల్లీ భారీ స్కోరుకాగా ఐపీఎల్-2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్ అహ్మదాబాద్ వేదికగా శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీస్కోరు చేసింది. కెప్టెన్ అక్షర్ పటేల్ (32 బంతుల్లో 39; 1 ఫోర్, 2 సిక్స్‌లు), అశుతోష్ శర్మ (19 బంతుల్లో 37; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), కరుణ్ నాయర్ (18 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. జోస్ ది బాస్.. దంచేశాడులక్ష్య ఛేదనలో జోస్ బట్లర్ దంచికొట్టాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. కేవలం 54 బంతుల్లోనే 97 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏకంగా 11 ఫోర్లు, 4 సిక్సర్లు ఉండటం విశేషం. అయితే, దురదృష్టవశాత్తూ సెంచరీకి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయాడు.మరోవైపు.. బట్లర్‌కు తోడుగా షెర్ఫానే రూథర్‌ఫర్డ్ (34 బంతుల్లో 43; 1 ఫోర్, 3 సిక్స్‌లు) కూడా రాణించాడు. ఆఖర్లో తెవాటియా మూడు బంతుల్లో 11 పరుగులతో అజేయంగా నిలిచి బట్లర్‌తో కలిసి గుజరాత్‌ను గెలుపుతీరాలకు చేర్చాడు. THE CELEBRATION FROM JOS BUTTLER. - Buttler was on 97*, but the happiness after Tewatia finished the match. 👏❤️ pic.twitter.com/31z4tWPJmL— Mufaddal Vohra (@mufaddal_vohra) April 19, 2025 ఢిల్లీ విధించిన 204 పరుగుల భారీ లక్ష్యాన్ని గుజరాత్ కేవలం మూడు వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలోనే ఛేదించింది. తద్వారా ఈ సీజన్లో ఐదో గెలుపు నమోదు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకువచ్చింది.ఐపీఎల్-2025: గుజరాత్ వర్సెస్ ఢిల్లీ👉వేదిక: నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్👉టాస్: గుజరాత్.. మొదట బౌలింగ్👉ఢిల్లీ స్కోరు: 203/8 (20)👉గుజరాత్ స్కోరు: 204/3 (19.2)👉ఫలితం: ఏడు వికెట్ల తేడాతో ఢిల్లీపై గుజరాత్ విజయం👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: జోస్ బట్లర్ (గుజరాత్- 54 బంతుల్లో 97 నాటౌట్).చదవండి: IPL 2025: గెలుపు వాకిట బోర్లా పడిన రాయల్స్.. ఉత్కంఠ పోరులో లక్నోను గెలిపించిన ఆవేశ్ ఖాన్ -
కేఎల్ రాహుల్ కామెంట్స్.. షాకైన పీటర్సన్!.. నా దోస్తులంతా ఇంతే..
ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్‌గా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ (Kevin Pietersen) ప్రయాణం విజయవంతగా సాగుతోంది. అతడి మార్గదర్శనంలో.. అక్షర్ పటేల్ కెప్టెన్సీలో ఢిల్లీ సరికొత్త ఉత్సాహంతో విజయపరంపర కొనసాగిస్తోంది. ఐపీఎల్-2025 (IPL 2025)లో ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో ఐదు గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.ఇక తమ ఏడో మ్యాచ్‌లో భాగంగా ఢిల్లీ శనివారం మధ్యాహ్నం నాటి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో పోటీకి దిగింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుండగా.. ఒకరోజు ముందే అక్కడికి చేరుకున్న అక్షర్ సేన నెట్స్‌లో తీవ్రంగా శ్రమించింది.సోదరా.. నీకు మెంటార్‌కు అర్థం తెలుసా?!.ఈ సందర్భంగా గుజరాత్ టైటాన్స్- ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు సరదాగా ముచ్చటించుకున్నారు. ఈ క్రమంలో టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill).. ఢిల్లీ మెంటార్ పీటర్సన్ దగ్గరకు వచ్చి ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాడు.పరస్పరం క్షేమ, సమాచారాలు అడిగితెలుసుకున్న తర్వాత.. పీటర్సన్.. ‘‘సోదరా.. నీకు మెంటార్‌కు అర్థం తెలుసా?!.. ఇక్కడ ఉన్న వాళ్లలో ఒక్కరికి మెంటార్ అంటే తెలియనే తెలియదు’’ అని గిల్‌తో అన్నాడు.రెండు వారాల పాటు మాల్దీవుల పర్యటనవీరిద్దరి సంభాషణ మధ్యలో జోక్యం చేసుకున్న ఢిల్లీ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్.. పీటర్సన్‌కు ఊహించని షాకిచ్చాడు. ‘‘ఎవరైతే సీజన్ మధ్యలోనే రెండు వారాల పాటు మాల్దీవుల పర్యటనకు వెళ్తారో.. వారే మెంటార్’’ అంటూ రాహుల్ పీటర్సన్‌ను టీజ్ చేశాడు. దీంతో పీటర్సన్ బిక్కముఖం వేసుకుని చూసాడు.నా దోస్తులంతా ఇంతేఇందుకు.. ‘‘నా స్నేహితులంతా ఇంతే.. విషపూరితమైన వాళ్లు.. లక్ష్యం లేని వాళ్లు. ఎప్పుడూ ప్రతికూలంగానే మాట్లాడతారు.. పరుషంగా ఉంటారు.. నాకు కొత్త స్నేహితులు కావాలి.. కానీ అంత త్వరగా, సులువుగా దొరకరే..’’ అన్న పంక్తులతో సాగే BoyWithUke పాటను ఢిల్లీ అడ్మిన్ పీటర్సన్ ఇన్నర్ వాయిస్‌లా జతచేశారు.ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘‘థాంక్యూ కేఎల్.. మెంటార్ అంటే సరైన అర్థం ఏమిటో ఇప్పుడే చెప్పావు’’ అన్నట్లు క్యాప్షన్ ఇచ్చారు. కాగా కెవిన్ పీటర్సన్ 2009లో ఐపీఎల్లో అడుగుపెట్టాడు.వ్యక్తిగత సెలవు మీదఆరంభంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడిన కెవిన్ పీటర్సన్.. సారథిగానూ వ్యవహరించాడు. ఆ తర్వాత ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కి ప్రాతినిథ్యం వహించిన పీటర్సన్.. 17 మ్యాచ్‌లలో కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. అదే విధంగా రైజింగ్ పూణె సూపర్‌జెయింట్స్‌కు కూడా ఆడాడు.2016లో చివరగా ఐపీఎల్ ఆడిన 44 ఏళ్ల పీటర్సన్ మొత్తంగా క్యాష్ రిచ్ లీగ్‌లో 36 మ్యాచ్‌లు ఆడి 1001 పరుగులు చేశాడు. ఈ క్రమంలో 2025లో మెంటార్ అవతారంలో తిరిగి ఢిల్లీ ఫ్రాంఛైజీతో జట్టు కట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ హేమంగ్ బదాని, బౌలింగ్ కోచ్ మునాఫ్ పటేల్, అసిస్టెంట్ కోచ్ మాథ్యూ మాట్లతో కలిసి పీటర్సన్ పనిచేస్తున్నాడు.ఇక ఏప్రిల్ 5న చెన్నై సూపర్ కింగ్స్‌పై ఢిల్లీ గెలుపొందిన తర్వాత.. వ్యక్తిగత సెలవు మీద పీటర్సన్ మాల్దీవుల పర్యటనకు వెళ్లాడు. ఫలితంగా ఏప్రిల్ 10న ఆర్సీబీతో మ్యాచ్‌కు అతడు అందుబాటులో ఉండలేకపోయాడు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ కేఎల్ రాహుల్ పీటర్సన్‌ను ట్రోల్ చేయడం విశేషం.చదవండి: ఒక్కరికీ కామన్ సెన్స్ లేదు.. ఇంత చెత్తగా ఆడతారా?: సెహ్వాగ్ ఫైర్ Thanks KL, now we know what a mentor does 😂 pic.twitter.com/JXWSVJBfQS— Delhi Capitals (@DelhiCapitals) April 19, 2025 -
IPL 2025: ఢిల్లీపై గుజరాత్ విజయం
ఢిల్లీపై గుజరాత్ విజయంఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఇవాళ (ఏప్రిల్ 19) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో అక్షర్ 39, అశుతోష్ శర్మ 37, కరుణ్ నాయర్, ట్రిస్టన్ స్టబ్స్ తలో 31, కేఎల్ రాహుల్ 28, అభిషేక్ పోరెల్ 18, విప్రాజ్ నిగమ్ 0, డొనోవన్ ఫెరియెరా 1, స్టార్క్ 2 (నాటౌట్), కుల్దీప్ 4 (నాటౌట్) పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ 4 వికెట్లు తీయగా.. సిరాజ్, అర్షద్ ఖాన్, ఇషాంత్ శర్మ, సాయికిషోర్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్ ఆదిలోనే శుభ్‌మన్ గిల్ (7) వికెట్ కోల్పోయినప్పటికీ.. జోస్ బట్లర్ వీరోచిత ఇన్నింగ్స్ (97 నాటౌట్) కారణంగా 19.2 ఓవర్లలో (3 వికెట్ల నష్టానికి) లక్ష్యాన్ని చేరుకుంది. గుజరాత్ బ్యాటర్లలో సాయి సుదర్శన్ 36, రూథర్‌ఫోర్డ్ 43, తెవాతియా 11 పరుగులు (నాటౌట్) చేశారు. ఆఖర్లో బట్లర్‌కు సెంచరీ చేసే అవకాశం ఉన్నా తెవాతియా చివరి ఓవర్లో వరుసగా సిక్సర్, బౌండరీ కొట్టి గుజరాత్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్ కుమార్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో గుజరాత్ ఢిల్లీని వెనక్కు నెట్టి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం గుజరాత్, ఢిల్లీ, పంజాబ్ తలో 10 పాయింట్లతో తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.హాఫ్ సెంచరీ పూర్తి చేసిన బట్లర్12.5వ ఓవర్- మోహిత్ శర్మ బౌలింగ్‌లో బౌండరీ బాది బట్లర్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. బట్లర్ ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. బట్లర్‌కు జతగా రూథర్‌ఫోర్డ్ క్రీజ్‌లో ఉన్నాడు. ఇదే ఓవర్లో రూథర్‌ఫోర్డ్ తొలి రెండు బంతులకు రెండు సిక్సర్లు బాదాడు. 13 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 129/2గా ఉంది. బట్లర్ 52, రూథర్‌ఫోర్డ్ 31 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన గుజరాత్7.3వ ఓవర్- 74 పరుగుల వద్ద గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో స్టబ్స్‌కు క్యాచ్ ఇచ్చి సాయి సుదర్శన్ (36) ఔటయ్యాడు. 9 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 85/2గా ఉంది. బట్లర్ (38), రూథర్‌ఫోర్డ్ (3) క్రీజ్‌లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్1.4వ ఓవర్- 204 పరుగుల లక్ష్య ఛేదనలో గుజరాత్ 14 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. కరుణ్ నాయర్ అద్బుతమైన త్రోతో శుభ్‌మన్ గిల్‌ను (7) రనౌట్ చేశాడు. 3 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 29/1గా ఉంది. సాయి సుదర్శన్ (16), బట్లర్ (6) క్రీజ్‌లో ఉన్నారు. భారీ స్కోర్ చేసిన ఢిల్లీటాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో అక్షర్ 39, అశుతోష్ శర్మ 37, కరుణ్ నాయర్, ట్రిస్టన్ స్టబ్స్ తలో 31, కేఎల్ రాహుల్ 28, అభిషేక్ పోరెల్ 18, విప్రాజ్ నిగమ్ 0, డొనోవన్ ఫెరియెరా 1, స్టార్క్ 2 (నాటౌట్), కుల్దీప్ 4 (నాటౌట్) పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ 4 వికెట్లు తీయగా.. సిరాజ్, అర్షద్ ఖాన్, ఇషాంత్ శర్మ, సాయికిషోర్ తలో వికెట్ పడగొట్టారు. 18 ఓవర్లలో ఢిల్లీ స్కోరు: 188/6 (18) అశుతోష్ 12 బంతుల్లో 32 పరుగులతో క్రీజులో ఉండగా.. ఫెరీరా ఇంకా ఖాతా తెరవలేదు.ఒకే ఓవర్లో రెండు వికెట్లు17.1: ప్రసిద్ కృష్ణ బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగిన అక్షఱ్ పటేల్ (38). ఆ వెంటనే విప్రాజ్ నిగమ్‌ను అవుట్ చేసిన ప్రసిద్. 18వ ఓవర్లో వరుస బంతుల్లో గుజరాత్‌కు రెండు వికెట్లు. ఢిల్లీ స్కోరు: 173/6 (17.2)అక్షర్ పటేల్‌కు గాయం?15.3: అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో డీప్ స్క్వేర్ లెగ్ మీదుగా బంతిని తరలించిన అక్షర్.. సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అతడు చీలమండ నొప్పితో విలవిల్లాడగా.. ఫిజియో వచ్చి పరీక్షించాడు.15 ఓవర్లలో ఢిల్లీ స్కోరు: 150/4అక్షర్ 33, అశుతోష్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు.నాలుగో వికెట్ కోల్పోయిన ఢిల్లీ14.2: సిరాజ్ బౌలింగ్‌లో స్టబ్స్ (31) అవుట్. అక్షర్ 32 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 146/4 (14.2). అశుతోష్ శర్మ క్రీజులోకి వచ్చాడు.ఢిల్లీ ధనాధన్14 ఓవర్లు పూర్తయ్యే సరికి ఢిల్లీ స్కోరు: 146/3స్టబ్స్ 19 బంతుల్లో 31, అక్షర్ పటేల్ 24 బంతుల్లో 32 పరుగులతో జోరుమీదున్నారు.పది ఓవర్లలో ఢిల్లీ స్కోరు: 105-3స్టబ్స్ 8, అక్షర్ పటేల్ 15 పరుగులతో ఉన్నారు.మూడో వికెట్ డౌన్8.1: ప్రసిద్ కృష్ణ బౌలింగ్ మూడో వికెట్‌గా వెనుదిరిగిన కరుణ్ నాయర్ (31). స్కోరు: 93/3 (8.2). అక్షర్ పటేల్ 12 పరుగులతో ఆడుతుండగా.. ట్రిస్టన్ స్టబ్స్క్రీజులోకి వచ్చాడు. పవర్ ప్లేలో ఢిల్లీ స్కోరు: 73/2 (6)కరుణ్ నాయర్ 19, అక్షర్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. కేఎల్ రాహుల్ అవుట్4.4: ప్రసిద్ కృష్ణ బౌలింగ్‌లో లెగ్ బిఫోర్ వికెట్‌గా వెనుదిరిగిన కేఎల్ రాహుల్ (28). దీంతో ఢిల్లీ రెండో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 58/2 (4.4)నాలుగు ఓవర్లలో ఢిల్లీ స్కోరు: 52/1రాహుల్ 22, కరుణ్ నాయర్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ1.4: అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో అభిషేక్ పోరెల్ సిరాజ్‌కు క్యాచ్ ఇచ్చి 18 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. కేఎల్ రాహుల్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 23/1 (1.4)తొలి ఓవర్లోనే 16 పరుగులుగుజరాత్ బౌలింగ్ ఎటాక్‌ను సిరాజ్ పేలవంగా ఆరంభించాడు. తొలి రెండు బంతులను వైడ్‌గా వేసిన ఈ రైటార్మ్ పేసర్ బౌలింగ్‌లో.. తర్వాతి రెండు బంతుల్లో అభిషేక్ పోరెల్ వరుసగా 4, 6 బాదాడు. ఐదో బంతిని కూడా బౌండరీకి తరలించాడు. అభిషేక్ పోరెల్ 14, కరుణ్ నాయర్ సున్నా పరుగులతో క్రీజులో ఉన్నారు.ఐపీఎల్-2025లో మరో ఆసక్తికర పోరు... వరుస విజయాలతో జోరు మీదున్న ఢిల్లీ క్యాపిటల్స్ శనివారం మధ్యాహ్నం నాటి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడుతోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఇందుకు వేదిక. టాస్ గెలిచిన గుజరాత్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. ఢిల్లీ బ్యాటింగ్ చేస్తోంది.తుదిజట్లుగుజరాత్ టైటాన్స్సాయి సుదర్శన్, శుబ్‌మన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ.ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్స్: షెర్ఫానే రూథర్‌ఫర్డ్, మహిపాల్ లామ్రోర్, అనూజ్ రావత్, వాషింగ్టన్ సుందర్, కరీం జనత్.ఢిల్లీ క్యాపిటల్స్అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్(కెప్టెన్), అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముకేష్ కుమార్.ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్స్: జేక్ ఫ్రేజర్-మెగర్క్, దర్శన్ నల్కాండే, సమీర్ రిజ్వీ, డొనొవన్ ఫెరీరా, దుష్మంత చమీర.కాగా ఢిల్లీ ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో ఐదు గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా.. గుజరాత్ ఆరింట నాలుగు గెలిచి మూడో స్థానంలో కొనసాగుతోంది.చదవండి: సంజూతో విభేదాలు!.. స్పందించిన రాహుల్ ద్రవిడ్