IPL 2022 Who Is SRH Player Shashank Singh Scores Hatrick Sixes Of Ferguson Bowling - Sakshi
Sakshi News home page

IPL 2022: ఫెర్గూసన్‌కు చుక్కలు చూపించాడు.. ఎవరీ శశాంక్‌ సింగ్‌?

Published Thu, Apr 28 2022 10:58 AM | Last Updated on Thu, Apr 28 2022 12:37 PM

IPL 2022 Who Shashank Singh From-SRH Beat Hatrick Sixes Ferguson Bowling - Sakshi

PC: IPL Twitter

ఐపీఎల్‌ 2022లో గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. 196 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌ టైటాన్స్‌ ఆఖర్లో​ రషీద్‌ ఖాన్‌(11 బంతుల్లో 31*), రాహుల్‌ తెవాటియా(21 బంతుల్లో 40*) విధ్వంసం సృ‍ష్టించడంతో విజయం అందుకుంది. అయితే ఎస్ఆర్‌హెచ్‌ ఓడినప్పటికి బ్యాటింగ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ నుంచి మరో ఆణిముత్యం బయటపడ్డాడు. అతనే శశాంక్‌ సింగ్‌. ఫెర్గూసన్‌ వేసిన ఇన్నింగ్స్‌ చివరి ఓవర్లో హాట్రిక్‌ సిక్సర్లు బాది అతనికి చుక్కలు చూపించాడు.

ఓవరాల్‌గా 6 బంతుల్లోనే మూడు సిక్సర్లు, ఒక ఫోర్‌ సహా 25 పరుగులు సాధించాడు. ఒక రకంగా ఎస్‌ఆర్‌హెచ్‌ 195 పరుగుల భారీ స్కోరు చేయడంలో శశాంక్‌ సింగ్‌ కీలకపాత్ర పోషించాడు. ఐదు మ్యాచ్‌ల నుంచి జట్టులో ఉన్నప్పటికి శశాంక్‌కు బ్యాటింగ్‌ ఆడే అవకాశం రాలేదు. ఎట్టకేలకు గుజరాత్‌తో మ్యాచ్‌లో బ్యాటింగ్‌ అవకాశం రాగానే తన పవరేంటో చూపించాడు. ఈ సీజన్‌లో ఉమ్రాన్‌ మాలిక్‌తో పోటీ పడుతూ అత్యంత వేగవంతమైన బంతులు విసురుతున్న లోకీ ఫెర్గూసన్‌ను ఒక ఆట ఆడుకున్నాడు. ముఖ్యంగా 147 కిమీ వేగంతో ఫెర్గూసన్‌ వేసిన 20వ ఓవర్‌ ఐదో బంతిని ఫైన్‌లెగ్‌ దిశగా సిక్స్‌ కొట్టడం మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.


Courtesy: IPL Twitter

ఎవరీ శశాంక్‌ సింగ్‌..?
ముంబైకి చెందిన శశాంక్‌ సింగ్‌ 1991 నవంబర్‌ 21న జన్మించాడు. మంచి స్ట్రైక్‌ రొటేట్‌ చేయగల బ్యాటర్‌గా గుర్తింపు పొందిన శశాంక్‌ ఆఫ్‌స్పిన్‌ బౌలింగ్‌ చేయగలడు. 2015లో ముంబై  తరపున డొమొస్టిక్‌ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత అదే ఏడాది టి20, లిస్ట్‌- ఏ క్రికెట్‌లో ఎంటరయ్యాడు, ఇక 2019లో చత్తీస్‌ఘర్‌ తరపున ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు.  2017 నుంచి ఐపీఎల్‌లో ఉన్న శశాంక్‌ సింగ్‌ తొలుత ఢిల్లీ క్యాపిటల్స్‌.. 2019, 2020 సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టులో ఉన్నాడు. ఐపీఎల్‌ మెగావేలంఓ ఎస్‌ఆర్‌హెచ్‌.. శశాంక్‌ సింగ్‌ను కనీస ధర రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది.

చదవండి: Umran Malik 5 Wickets: ఐదో అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్‌గా ఉమ్రాన్‌ మాలిక్‌ కొత్త చరిత్ర

Muttiah Muralitharan Vs Marco Jansen: 'మైండ్‌ దొబ్బిందా.. ఆ బౌలింగ్‌ ఏంటి?'.. మురళీధరన్‌ ఆగ్రహం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement