గ్లెన్ ఫిలిప్స్ (PC: SRH Twitter/IPL)
IPL 2023 RR Vs SRH: ఐపీఎల్-2023లో.. ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ కోసం ఎంతో ఓపికగా ఎదురుచూశాడు న్యూజిలాండ్ బ్యాటర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ గ్లెన్ ఫిలిఫ్స్. తొమ్మిది మ్యాచ్‌ల పాటు బెంచ్‌కే పరిమితమైన అతడు రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌తో ఎట్టకేలకు ఈ సీజన్‌లో ఖాతా తెరిచాడు. భారీ మొత్తం చెల్లించి కొనుగోలు చేసిన ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ వరుస వైఫల్యాల నేపథ్యంలో ఆదివారం నాటి మ్యాచ్‌లో రైజర్స్ తుది జట్టులో చోటు సంపాదించాడు.
వచ్చీరాగానే.. ఇన్నాళ్లు తనను పక్కకు పెట్టి మేనేజ్‌మెంట్ ఎంత పెద్ద తప్పు చేసిందో తన అద్భుత ఆట తీరుతో చాటిచెప్పాడు. కీలక సమయంలో తుపాన్ ఇన్నింగ్స్‌తో విధ్వంసం సృష్టించాడు. 7 బంతుల్లో 25 పరుగులతో చెలరేగాడు. వరుసగా మూడు సిక్సర్లు, ఒక ఫోర్ బాది సత్తా చాటాడు.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్
ఫిలిప్స్ అద్భుత ఆట తీరు సృష్టించిన సునామీలో రాజస్తాన్ ప్లేయర్లు జోస్ బట్లర్ ఇన్నింగ్స్(95 పరుగులు), యజువేంద్ర చహల్(4/29) స్పెల్ కొట్టుకుపోయాయి. వీరిద్దరినీ కాదని 7 బంతుల్లో 357.14 స్ట్రేక్‌రేటుతో మెరిసి సన్‌రైజర్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఫిలిప్స్‌ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది.
కాగా ఈ ఇన్నింగ్స్‌తో గ్లెన్ ఫిలిప్స్ ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఓ మ్యాచ్‌లో తక్కువ సమయంలో ఎక్కువ ప్రభావం చూపి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలిచిన ఆటగాళ్ల జాబితాలో ముందు వరుసలో నిలిచాడు.
మొదటి స్థానంలో
ఈ క్రమంలో బౌలర్ నువన్ కులశేఖర పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. ఫిలిప్స్ 7 బంతుల్లో 25 పరుగులతో టాప్‌నకు చేరుకోగా.. సీఎస్‌కే తరఫు పుణెతో మ్యాచ్‌లో నువన్ 2012లో 2/10 బౌలింగ్ గణాంకాలతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఇక ఆర్సీబీకి ఆడిన మార్క్ బౌచర్(2009లో) కేకేఆర్ మీద 13 బంతుల్లో 25 పరుగులతో అజేయంగా నిలిచి మూడో స్థానంలో ఉండగా.. 2021లో కీరన్ పొలార్డ్(ముంబై) పంజాబ్ కింగ్స్‌తో 7 బంతుల్లో 15 పరుగుల(నాటౌట్)తో నాలుగో స్థానంలో ఉన్నాడు.
సన్‌రైజర్స్ తరఫున రెండో ఆటగాడిగా
ఇదిలా ఉంటే.. ఎస్‌ఆర్‌హెచ్ తరఫున ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక స్ట్రైక్‌రేటు నమోదు చేసిన రెండో క్రికెటర్‌గా గ్లెన్ ఫిలిప్స్ మరో రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో టాప్-4లో ఉన్నది వీళ్లే!
►416.66 - 25*(6) - శశాంక్ సింగ్- గుజరాత్ టైటాన్స్ మీద- 2022లో- వాంఖడే స్టేడియంలో
►357.14 - 25 (7) - గ్లెన్ ఫిలిప్స్- రాజస్తాన్ రాయల్స్ మీద- 2023లో- జైపూర్‌లో
►340.00 - 34*(10) - రషీద్ ఖాన్- కేకేఆర్ మీద- కోల్‌కతాలో- 2018లొ
►285.71 - 40(14) - వాషింగ్టన్ సుందర్- రాజస్తాన్ రాయల్స్ మీద- 2022లో పుణెలో.
చదవండి: సన్‌రైజర్స్ విజయంపై డేవిడ్ వార్నర్ ట్వీట్! మెచ్చుకున్నాడా? లేదంటే..
WHAT. A. GAME 😱😱
— IndianPremierLeague (@IPL) May 7, 2023
Abdul Samad wins it for the @SunRisers as he hits a maximum off the final delivery. #SRH win by 4 wickets.
Scorecard - https://t.co/1EMWKvcgh9 #TATAIPL #RRvSRH #IPL2023 pic.twitter.com/yh0WVMEbOz
7⃣ balls that changed the Sunday night for us 🧡
— SunRisers Hyderabad (@SunRisers) May 8, 2023
Glenn Phillips is our 𝐑𝐢𝐬𝐞𝐫 𝐨𝐟 𝐭𝐡𝐞 𝐝𝐚𝐲 and we couldn't be more happy 😍 pic.twitter.com/YrCG7gd1UC
Comments
Please login to add a commentAdd a comment