Nuwan Kulasekara
-
ఫిలిప్స్ విధ్వంసకర ఇన్నింగ్స్.. అరుదైన రికార్డు! అయితే 416.66 స్ట్రైక్‌రేటుతో..
IPL 2023 RR Vs SRH: ఐపీఎల్-2023లో.. ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ కోసం ఎంతో ఓపికగా ఎదురుచూశాడు న్యూజిలాండ్ బ్యాటర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ గ్లెన్ ఫిలిఫ్స్. తొమ్మిది మ్యాచ్‌ల పాటు బెంచ్‌కే పరిమితమైన అతడు రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌తో ఎట్టకేలకు ఈ సీజన్లో ఖాతా తెరిచాడు. భారీ మొత్తం చెల్లించి కొనుగోలు చేసిన ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ వరుస వైఫల్యాల నేపథ్యంలో ఆదివారం నాటి మ్యాచ్‌లో రైజర్స్ తుది జట్టులో చోటు సంపాదించాడు. వచ్చీరాగానే.. ఇన్నాళ్లు తనను పక్కకు పెట్టి మేనేజ్మెంట్ ఎంత పెద్ద తప్పు చేసిందో తన అద్భుత ఆట తీరుతో చాటిచెప్పాడు. కీలక సమయంలో తుపాన్ ఇన్నింగ్స్‌తో విధ్వంసం సృష్టించాడు. 7 బంతుల్లో 25 పరుగులతో చెలరేగాడు. వరుసగా మూడు సిక్సర్లు, ఒక ఫోర్ బాది సత్తా చాటాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఫిలిప్స్ అద్భుత ఆట తీరు సృష్టించిన సునామీలో రాజస్తాన్ ప్లేయర్లు జోస్ బట్లర్ ఇన్నింగ్స్(95 పరుగులు), యజువేంద్ర చహల్(4/29) స్పెల్ కొట్టుకుపోయాయి. వీరిద్దరినీ కాదని 7 బంతుల్లో 357.14 స్ట్రేక్రేటుతో మెరిసి సన్‌రైజర్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఫిలిప్స్‌ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. కాగా ఈ ఇన్నింగ్స్‌తో గ్లెన్ ఫిలిప్స్ ఐపీఎల్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఓ మ్యాచ్‌లో తక్కువ సమయంలో ఎక్కువ ప్రభావం చూపి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలిచిన ఆటగాళ్ల జాబితాలో ముందు వరుసలో నిలిచాడు. మొదటి స్థానంలో ఈ క్రమంలో బౌలర్ నువన్ కులశేఖర పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. ఫిలిప్స్ 7 బంతుల్లో 25 పరుగులతో టాప్‌నకు చేరుకోగా.. సీఎస్కే తరఫు పుణెతో మ్యాచ్‌లో నువన్ 2012లో 2/10 బౌలింగ్ గణాంకాలతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఆర్సీబీకి ఆడిన మార్క్ బౌచర్(2009లో) కేకేఆర్ మీద 13 బంతుల్లో 25 పరుగులతో అజేయంగా నిలిచి మూడో స్థానంలో ఉండగా.. 2021లో కీరన్ పొలార్డ్(ముంబై) పంజాబ్ కింగ్స్‌తో 7 బంతుల్లో 15 పరుగుల(నాటౌట్)తో నాలుగో స్థానంలో ఉన్నాడు. సన్‌రైజర్స్ తరఫున రెండో ఆటగాడిగా ఇదిలా ఉంటే.. ఎస్ఆర్హెచ్ తరఫున ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక స్ట్రైక్‌రేటు నమోదు చేసిన రెండో క్రికెటర్‌గా గ్లెన్ ఫిలిప్స్ మరో రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో టాప్-4లో ఉన్నది వీళ్లే! ►416.66 - 25*(6) - శశాంక్ సింగ్- గుజరాత్ టైటాన్స్ మీద- 2022లో- వాంఖడే స్టేడియంలో ►357.14 - 25 (7) - గ్లెన్ ఫిలిప్స్- రాజస్తాన్ రాయల్స్ మీద- 2023లో- జైపూర్‌లో ►340.00 - 34*(10) - రషీద్ ఖాన్- కేకేఆర్ మీద- కోల్‌కతాలో- 2018లొ ►285.71 - 40(14) - వాషింగ్టన్ సుందర్- రాజస్తాన్ రాయల్స్ మీద- 2022లో పుణెలో. చదవండి: సన్‌రైజర్స్ విజయంపై డేవిడ్ వార్నర్ ట్వీట్! మెచ్చుకున్నాడా? లేదంటే.. WHAT. A. GAME 😱😱 Abdul Samad wins it for the @SunRisers as he hits a maximum off the final delivery. #SRH win by 4 wickets. Scorecard - https://t.co/1EMWKvcgh9 #TATAIPL #RRvSRH #IPL2023 pic.twitter.com/yh0WVMEbOz — IndianPremierLeague (@IPL) May 7, 2023 7⃣ balls that changed the Sunday night for us 🧡 Glenn Phillips is our 𝐑𝐢𝐬𝐞𝐫 𝐨𝐟 𝐭𝐡𝐞 𝐝𝐚𝐲 and we couldn't be more happy 😍 pic.twitter.com/YrCG7gd1UC — SunRisers Hyderabad (@SunRisers) May 8, 2023 -
క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన లంక బౌలర్
కొలంబో: శ్రీలంక పేస్ బౌలర్ నువాన్ కులశేఖర అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తన రిటైర్మెంట్ ఈ క్షణం నుంచే అమల్లోకి వస్తుందని లంక క్రికెట్ బోర్డుకు తెలిపాడు. ఈ మేరకు బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేసినట్టు స్థానిక మీడియా తెలిపింది. గత కొన్నేళ్లుగా పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న కులశేఖర లిస్ట్-ఏ క్రికెట్‌కే పరిమితమయ్యాడు. 2017లో చివరి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ ఆడిన కులశేఖర 2014 టీ20 ప్రపంచకప్‌ను శ్రీలంక గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. అదేవిధంగా 2007, 2011 వన్డే ప్రపంచకప్‌లలో రన్నరప్‌గా నిలిచిన లంక జట్టులోనూ అతడు సభ్యుడిగా ఉన్నాడు. 2008లో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ల్లో నంబర్ వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. 2011 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లోనే కులశేఖర్ బౌలింగ్‌లోనే ఎంఎస్ ధోని సిక్సర్ కొట్టి టీమిండియాకు రెండో సారి కప్‌ను అందించాడు. వన్డేల్లో 2003లో శ్రీలంక తరుపున ఇంగ్లండ్‌పై అరంగేట్రం చేసిన కులశేఖర, ఓవరాల్‌గా184 వన్డేల్లో 4.90 ఎకానమీతో 199 వికెట్లు పడగొట్టాడు. 58 టీ20ల్లో 66 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో విజవంతమైన ఈ రైటార్మ్ పేస్ బౌలర్ టెస్టుల్లో దారుణంగా విపలమయ్యాడు. కేవలం 21 టెస్టులాడినప్పటికీ అంతగా ఆకట్టుకోలేదు. దీంతో 2016లోనే టెస్టులకు వీడ్కోలు పలికాడు. అనంతరం వన్డేల్లోనూ అంతగా ఆకట్టుకోకపోవడంతో 2018 నుంచి లిస్ట్-ఏ క్రికెట్ మ్యాచ్‌లు మాత్రమే ఆడుతున్నాడు. ఇక తాజాగా శ్రీలంక ప్రపంచకప్ జట్టులో స్థానం దక్కించుకోలేకపోయాడు. ఇప్పటికే యార్కర్ల కింగ్ లసిత్ మలింగ కూడా బంగ్లాదేశ్‌తో జరగబోయే తొలి వన్డేనే చివరిదని ప్రకటించిన విషయం తెలిసందే. -
రోడ్డు ప్రమాదం కేసులో క్రికెటర్ అరెస్టు
కొలంబో: రోడ్డు ప్రమాదం కేసులో ఒక వ్యక్తి మృతికి కారణమైన శ్రీలంక క్రికెటర్ నువాన్ కులశేఖరను పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం కొలంబోలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో కులశేఖర కారులో వెళుతూ ఒక ద్విచక్రవాహనదారున్ని ఢీకొట్టాడు. దాంతో ఆ వ్యక్తి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోవడంతో కులశేఖరను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కులశేఖరకు బెయిల్ మంజూరు కావడంతో అరెస్టైన కాసేపటికే విడుదలయ్యాడు. కొలంబోకు పది మైళ్ల దూరంలోని కదావాతా ఏ-1 హైవేపై కులశేఖర కారులో వెళుతుండగా అతనికి ఎదురుగా వస్తున్న మోటర్సైక్లిస్ట్ ప్రమాదానికి గురయ్యాడు. దాంతో తీవ్రగాయాలు పాలైన ఆ వాహన దారుడు అక్కడిక్కడే మృతిచెందాడు. అయితే ఈ తరహా ప్రమాదాలపై పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది శ్రీలంకలో రోడ్డు ప్రమాదాల వల్ల 2,700 మంది అసువులు బాసినట్లు పేర్కొన్నారు. వీరిలో ఏ-1 హైపై ప్రమాదానికి గురై ప్రాణాలో కోల్పోయిన ద్విచక్రవాహన దారులు సంఖ్య సగానికి పైగా ఉంది. -
టెస్టులకు కులశేఖర గుడ్‌బై
కొలంబో: శ్రీలంక వెటరన్ బౌలర్ నువాన్ కులశేఖర టెస్టు కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మేరకు శ్రీలంక క్రికెట్ బోర్డుకు బుధవారం లేఖ రాశాడు. ‘వన్డేల్లో, టీ20ల్లో మరింత మెరుగ్గా రాణించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని కులశేఖర తెలిపాడు. ఇప్పటివరకు 21 టెస్టులాడి 48 వికెట్లు తీసిన ఈ 33 ఏళ్ల పేస్ బౌలర్... 2005లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టె స్టు క్రికెట్లో అరంగేట్రం చేశాడు. రెండేళ్ల క్రితం లార్డ్స్‌లో ఇంగ్లండ్‌పై చివరి టెస్టు ఆడాడు. 2009లో పాకిస్థాన్‌పై అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు (8/58) నమోదు చేశాడు.