టెస్టులకు కులశేఖర గుడ్‌బై | Test matches Kulasekara Goodbye | Sakshi
Sakshi News home page

టెస్టులకు కులశేఖర గుడ్‌బై

Published Thu, Jun 2 2016 12:44 AM | Last Updated on Mon, Sep 4 2017 1:25 AM

టెస్టులకు కులశేఖర గుడ్‌బై

టెస్టులకు కులశేఖర గుడ్‌బై

కొలంబో: శ్రీలంక వెటరన్ బౌలర్ నువాన్ కులశేఖర టెస్టు కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మేరకు శ్రీలంక క్రికెట్ బోర్డుకు బుధవారం లేఖ రాశాడు. ‘వన్డేల్లో, టీ20ల్లో మరింత మెరుగ్గా రాణించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని కులశేఖర తెలిపాడు. ఇప్పటివరకు 21 టెస్టులాడి 48 వికెట్లు తీసిన ఈ 33 ఏళ్ల పేస్ బౌలర్... 2005లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టె స్టు క్రికెట్లో అరంగేట్రం చేశాడు. రెండేళ్ల క్రితం లార్డ్స్‌లో ఇంగ్లండ్‌పై చివరి టెస్టు ఆడాడు.  2009లో పాకిస్థాన్‌పై అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు (8/58) నమోదు చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement