రోడ్డు ప్రమాదం కేసులో క్రికెటర్ అరెస్టు | Sri Lanka cricketer Nuwan Kulasekara held over fatal crash | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదం కేసులో క్రికెటర్ అరెస్టు

Published Tue, Sep 20 2016 1:58 PM | Last Updated on Fri, Nov 9 2018 6:43 PM

రోడ్డు ప్రమాదం కేసులో క్రికెటర్ అరెస్టు - Sakshi

రోడ్డు ప్రమాదం కేసులో క్రికెటర్ అరెస్టు

కొలంబో: రోడ్డు ప్రమాదం కేసులో ఒక వ్యక్తి మృతికి కారణమైన శ్రీలంక క్రికెటర్ నువాన్ కులశేఖరను పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం కొలంబోలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో కులశేఖర కారులో వెళుతూ ఒక ద్విచక్రవాహనదారున్ని ఢీకొట్టాడు. దాంతో ఆ వ్యక్తి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోవడంతో కులశేఖరను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  అయితే కులశేఖరకు బెయిల్ మంజూరు కావడంతో అరెస్టైన కాసేపటికే విడుదలయ్యాడు.

కొలంబోకు పది మైళ్ల దూరంలోని కదావాతా ఏ-1 హైవేపై కులశేఖర కారులో వెళుతుండగా అతనికి ఎదురుగా వస్తున్న మోటర్సైక్లిస్ట్ ప్రమాదానికి గురయ్యాడు. దాంతో తీవ్రగాయాలు పాలైన ఆ వాహన దారుడు అక్కడిక్కడే మృతిచెందాడు.  అయితే ఈ తరహా ప్రమాదాలపై పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది శ్రీలంకలో రోడ్డు ప్రమాదాల వల్ల 2,700 మంది అసువులు బాసినట్లు పేర్కొన్నారు. వీరిలో ఏ-1 హైపై ప్రమాదానికి గురై ప్రాణాలో కోల్పోయిన ద్విచక్రవాహన దారులు సంఖ్య సగానికి పైగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement