ఐపీఎల్-2024లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 167 పరుగులు మాత్రమే చేసింది.
సీఎస్‌కే బ్యాటర్లలో రవీంద్ర జడేజా 43 పరుగులు చేయగా.. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(32), డార్లీ మిచెల్(30) పరుగులు చేశాడు. మరోవైపు పంజాబ్ బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు.
పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్, రాహుల్ చాహర్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. అర్ష్‌దీప్ సింగ్ రెండు, సామ్ కుర్రాన్ తలా వికెట్ సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment