
ఐపీఎల్-2024 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తిరిగి పుంజుకుంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 28 పరుగుల తేడాతో సీఎస్‌కే ఘన విజయం సాధించింది.
168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్.. చెన్నై బౌలర్ల దాటికి 9 వికెట్లు కోల్పోయి కేవలం 139 పరుగులకే పరిమితమైంది. పంజాబ్ బ్యాటర్లలో ప్రభుసిమ్రాన్ సింగ్(30) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలయ్యారు. సీఎస్‌కే బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు పడగొట్టగా.. తుషార్ దేశ్‌పాండే, సిమ్రాజిత్ సింగ్ తలా రెండు వికెట్లు సాధించారు.
అంతకముందు బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 167 పరుగులు మాత్రమే చేసింది. బ్యాటింగ్‌లోనూ రవీంద్ర జడేజా సత్తాచాటాడు. 43 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
అతడితో పాటు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(32), డార్లీ మిచెల్(30) పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్, రాహుల్ చాహర్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. అర్ష్‌దీప్ సింగ్ రెండు, సామ్ కుర్రాన్ తలా వికెట్ సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment