IPL 2024: స్టార్‌ ప్లేయర్లకు భారీ ఝలక్‌.. వదిలించుకోనున్న ఆటగాళ్లు వీరే..? | IPL 2024: Full List Of Players Released By All 10 Teams Ahead Of IPL Auction 2024, As Per Reports | Sakshi
Sakshi News home page

IPL 2024: స్టార్‌ ప్లేయర్లకు భారీ ఝలక్‌.. వదిలించుకోనున్న ఆటగాళ్లు వీరే..?

Published Sun, Nov 12 2023 5:55 PM | Last Updated on Tue, Nov 14 2023 7:31 AM

IPL 2024: Full List Of Players Released By All 10 Teams Ahead Of IPL Auction 2024, As Per Reports - Sakshi

ఐపీఎల్‌ 2024కి సంబంధించి ఆటగాళ్ల రిటెన్షన్‌ (నిలబెట్టుకోవడం), రిలీజ్‌ (వదిలించుకోవడం) ప్రక్రియకు నవంబర్‌ 15 డెడ్‌లైన్‌ కావడంతో అన్ని ఫ్రాంచైజీలు ఈ పనిలో నిమగ్నమై ఉన్నాయి. ఇందు కోసం గత కొన్ని రోజులుగా భారీ కసరత్తు చేసిన ఫ్రాంచైజీలు ఏ ఆటగాడిని నిలబెట్టుకోవాలో, ఏ ఆటగాడిని వదించుకోవాలో అన్న విషయమై పూర్తి క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తుంది.

పలు నివేదికల ప్రకారం.. 10 ఫ్రాంచైజీలు పర్స్‌ వ్యాల్యూని పెంచుకోవడంలో భాగంగా తమ ఖరీదైన ప్లేయర్లకు భారీ ఝలక్‌ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ప్రతి ఫ్రాంచైజీ గత ఎడిషన్‌లో అంతగా ప్రభావం చూపని ఆటగాళ్లపై వేటు వేయాలని డిసైడ్‌ అయినట్లు తెలుస్తుంది. వేటు పడే ఆటగాళ్ల జాబితాలో ఇంగ్లండ్‌ ఆటగాళ్లు ఆధికంగా ఉన్నారని తెలుస్తుంది.

బెన్‌ స్టోక్స్‌, హ్యారీ బ్రూక్‌, జోఫ్రా ఆర్చర్‌ లాంటి ఖరీదైన ఆటగాళ్లను తప్పించాలని ఆయా ఫ్రాంచైజీలు నిర్ణయించుకున్నట్లు సమాచారం. వీరితో పాటు పలు ఖరీదైన దేశీయ ఆటగాళ్లపై కూడా వేటు పడే అవకాశం ఉంది. ఈ లిస్ట్‌లో ఆవేశ్‌ ఖాన్‌, అంబటి రాయుడు, పృథ్వీ షా లాంటి ఆటగాళ్లు ఉన్నారని ప్రచారం జరుగుతుంది.

ఆయా ఫ్రాంచైజీలు వదిలించుకోవాలనుకుంటున్న ఆటగాళ్ల వివరాలు..

చెన్నై సూపర్‌ కింగ్స్‌: 

  • బెన్‌ స్టోక్స్‌ (16.25 కోట్లు)
  • అంబటి రాయుడు (6.75 కోట్లు)
  • కైల్‌ జేమీసన్‌ (కోటి)
  • సిసండ మగాల (50 లక్షలు)
  • సిమ్రన్‌జీత్‌ సింగ్‌ (20 లక్షలు)
  • షేక్‌ రషీద్‌ (20 లక్షలు)

ఢిల్లీ క్యాపిటల్స్‌: 

  • పృథ్వీ షా (7.5 కోట్లు)
  • మనీశ్‌ పాండే (2.4 కోట్లు)
  • ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌ (కోటి)
  • లుంగి ఎంగిడి (50 లక్షలు)
  • రిపల్‌ పటేల్‌ (20 లక్షలు)

గుజరాత్‌ టైటాన్స్‌: 

  • యశ్‌ దయాల్‌ (3.2 కోట్లు)
  • దసున్‌ షనక (50 లక్షలు)
  • ఓడియన్‌ స్మిత్‌ (50 లక్షలు)
  • ప్రదీప్‌ సాంగ్వాన్‌ (20 లక్షలు)
  • ఉర్విల్‌ పటేల్‌ ఝ(20 లక్షలు)

కోల్‌కతా నైట్‌రైడర్స్‌: 

  • ఆండ్రీ రసెల్‌ (12 కోట్లు)
  • లోకీ ఫెర్గూసన్‌ (10 కోట్లు)
  • డేవిడ్‌ వీస్‌ (కోటి)
  • షకీబ్‌ అల్‌ హసన్‌ (50 లక్షలు)
  • జాన్సన్‌ చార్లెస్‌ (50 లక్షలు)
  • మన్‌దీప్‌ సింగ్‌ (50 లక్షలు)

లక్నో సూపర్‌ జెయింట్స్‌: 

  • ఆవేశ్‌ ఖాన్‌ (10 కోట్లు)
  • డేనియల్‌ సామ్స్‌ (75 లక్షలు)
  • జయదేవ్‌ ఉనద్కత్‌ (50 లక్షలు)
  • రొమారియో షెపర్డ్‌ (50 లక్షలు)
  • సూర్యాంశ్‌ హేగ్డే (20 లక్షలు)

ముంబై ఇండియన్స్‌: 

  • జోఫ్రా ఆర్చర్‌ (8 కోట్లు)
  • క్రిస్‌ జోర్డన్‌ (50 లక్షలు)
  • డుయన్‌ జన్సెన్‌ (20 లక్షలు)
  • ట్రిస్టన్‌ స్టబ్స్‌ (20 లక్షలు)
  • అర్షద్‌ ఖాన్‌ (20 లక్షలు)

పంజాబ్‌ కింగ్స్‌: 

  • రాహుల్‌ చాహర్‌ (5.2 కోట్లు)
  • హర్ప్రీత్‌ భాటియా (40 లక్షలు)
  • మాథ్యూ షార్ట్‌ (20 లక్షలు)
  • బల్తేజ్‌ ధండా (20 లక్షలు)

రాజస్తాన్‌ రాయల్స్‌: 

  • జేసన్‌ హోల్డర్‌ (5.75 కోట్లు)
  • జో రూట్‌ (కోటి)
  • కరియప్ప (30 లక్షలు)
  • మురుగన్‌ అశ్విన్‌ (20 లక్షలు)

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు: 

  • హర్షల్‌ పటేల్‌ (10 కోట్లు)
  • దినేశ్‌ కార్తీక్‌ (5.5 కోట్లు)
  • అనూజ్‌ రావత్‌ (3.4 కోట్లు)
  • ఫిన్‌ అలెన్‌ (80 లక్షలు)

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌: 

  • హ్యారీ​ బ్రూక్‌ (13.25 కోట్లు)
  • మయాంక్‌ అగర్వాల్‌ (8.25 కోట్లు)
  • ఆదిల్‌ రషీద్‌(2 కోట్లు)
  • అకీల్‌ హొసేన్‌ (కోటి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement