PC: Twitter
ఐపీఎల్-2024కు సంబంధించిన వేలం దుబాయ్ వేదికగా డిసెంబర్ 19న జరగనుంది. ఈ విషయాన్ని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అధికారికంగా ఆదివారం ప్రకటించింది. కాగా ఐపీఎల్ వేలం భారత్‌లో కాకుండా బయట దేశంలో జరగడం ఇదే తొలి సారి. కాగా ఇప్పటికే ఈ మెగా ఈవెంట్‌లో భాగమయ్యే మొత్తం 10 ఐపీఎల్ ఫ్రాంచైజీలు తమ రిటైన్, విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాను బీసీసీఐకు సమర్పించాయి.
ఐపీఎల్ వేలంలో 1166 మంది ఆటగాళ్లు..
ఇక ఈ క్యాష్ రిచ్ లీగ్ వేలంలో1166 మంది ఆటగాళ్లు తమ పేర్లను రిజస్టర్ చేస్తున్నారు. ఇందులో 830 మంది భారత ఆటగాళ్లు కాగా, 336 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. 212 మంది క్యాప్డ్ ప్లేయర్లు.. 909 అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లు ఉన్నారు. అసోసియేట్ దేశాల నుంచి 45 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
అయితే ఐపీఎల్ ప్రాంఛైజీలలో మొత్తం కలిపి 77 స్ధానాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో 30 స్లాట్స్ విదేశీ క్రికెటర్లవే కావడం గమనార్హం. ఈ వేలంలో మిచెల్ స్టార్క్, ట్రావిస్ హెడ్, ప్యాట్ కమ్మిన్స్, రచిన్ రవీంద్ర వంటి స్టార్ ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. భారత్ నుంచి శార్ధూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్, హర్షల్ పటేల్ వంటి వారు వేలంలో ఉన్నారు.
చదవండి: PAK vs AUS: వార్నర్ ఏమి హీరో కాదు.. ఘన వీడ్కోలు ఎందుకు? జాన్సన్ సంచలన వ్యాఖ్యలు
𝗜𝗣𝗟 𝟮𝟬𝟮𝟰 𝗔𝘂𝗰𝘁𝗶𝗼𝗻 🔨
— IndianPremierLeague (@IPL) December 3, 2023
🗓️ 19th December
📍 𝗗𝗨𝗕𝗔𝗜 🤩
ARE. YOU. READY ❓ #IPLAuction | #IPL pic.twitter.com/TmmqDNObKR
Comments
Please login to add a commentAdd a comment