అభిమానులకు బ్యాడ్‌న్యూస్!(PC: BCCI/IPL)
IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ తాజా ఎడిషన్ నిర్వహణ విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్-2024 ద్వితీయ అర్ధభాగ మ్యాచ్‌ల వేదికను మార్చనున్నట్లు సమాచారం.
దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ మేరకు బీసీసీఐ సమాలోచనలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఐపీఎల్ పదిహేడో సీజన్‌ను పూర్తిగా భారత్‌లోనే నిర్వహించడం ఖాయమైనట్లు లీగ్ చైర్మన్ అరుణ్ ధూమల్ గతంలోనే నిర్ధారించారు.
ఫలితంగా... లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో భారత్ బయట మ్యాచ్‌లు జరిపే అవకాశాలపై జరిగిన చర్చకు తెర పడినట్లయింది. తొలుత 15 రోజుల మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల చేసి... ఆ తర్వాత మిగతా మ్యాచ్‌ల తేదీలను ప్రకటిస్తామని తెలిపారు.
అంతేకాదు.. అన్ని మ్యాచ్‌లు భారత్‌లోనే నిర్వహించడం ఖాయమని అరుణ్ ధుమాల్ పేర్కొన్నారు. ఇందుకు తగ్గట్లుగానే ఫిబ్రవరి 22న తొలి 17 రోజుల మ్యాచ్‌ల(21)కు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేశారు. మార్చి 22 నుంచి లీగ్ ఆరంభం కానున్నట్లు తెలిపారు నిర్వాహకులు.
అయితే, సెకండాఫ్ నిర్వహణ విషయంలో మాత్రం బీసీసీఐ తాజాగా నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. మిగిలిన మ్యాచ్‌లు దుబాయ్‌లో నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు బీసీసీఐ సన్నిహిత వర్గాలు తెలిపినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తన కథనంలో పేర్కొంది.
‘‘భారత ఎన్నికల సంఘం ఈరోజు(శనివారం) మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఎన్నికల నిర్వహణ షెడ్యూల్‌ను ప్రకటించనుంది. ఆ తర్వాతే ఐపీఎల్ సెకండాఫ్ ఎక్కడ నిర్వహించాలన్న అంశంపై బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుంది.
వేదికగా దుబాయ్‌ను ఎంచుకోవాలా లేదంటే ఇక్కడే అన్ని మ్యాచ్‌లను నిర్వహించాలా అన్న విషయం తేలుతుంది. అయితే, బీసీసీఐలోని కొంతమంది పెద్దలు మాత్రం ఇప్పటికే దుబాయ్ వైపు మొగ్గుచూపుతున్నారు’’ అని తెలిపింది. ఒకవేళ ఐపీఎల్-2024 మిగిలిన మ్యాచ్‌లను దుబాయ్‌లో నిర్వహించడం ఖాయమైతే.. దేశంలోనే మ్యాచ్‌లు(ఖర్చుల దృష్ట్యా) వీక్షించాలనుకున్న అభిమానులకు షాక్ తగిలినట్లే మరి!!
చదవండి: ICC- T20WC: ఎడాపెడా దంచేసినా పర్లేదు కానీ.. ఇకపై అలా కుదరదు!
Comments
Please login to add a commentAdd a comment