ఐపీఎల్-2024 వేలానికి సర్వం సిద్దమైంది. మంగళవారం(డిసెంబర్ 19) దుబాయ్ వేదికగా ఈ క్యాష్‌రిచ్ లీగ్ వేలం జరగనుంది. ఈ వేలంలో భారత్‌తో సహా 12 దేశాల నుంచి మొత్తం 333 మంది ఆటగాళ్లు పాల్గొననున్నారు. ఉన్న ఖాళీలు 77 మాత్రమే. ఈ క్రమంలో వేలంలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఐపీఎల్ ఫ్రాంచైజీలు దృష్టిపెట్టాయి. అయితే ఈసారి వేలాన్ని మల్లిక సాగర్ అడ్వానీ అనే మహిళ నిర్వహించనుంది.
గత కొన్ని ఐపీఎల్ సీజన్లకు అక్షనిర్ వ్యవహరించిన హ్యూ ఎడ్మీడ్స్ స్ధానాన్ని మల్లిక సాగర్ భర్తీ చేయనుంది. ఈ మెరకు బీసీసీఐ ఆదివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. తద్వారా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో వేలం నిర్వహించనున్న తొలి మహిళా ఆక్షనిర్‌గా మల్లిక నిలవనుంది. ఈ క్రమంలో ఆమె గురించి నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.
ఎవరీ మల్లికా సాగర్?
48 ఏళ్ల మల్లికా సాగర్ ముంబై చెందిన ఓ ఆర్ట్ కలెక్టర్. ఆమె మోడ్రన్ అండ్ కాన్‌టెంపరరీ ఇండియన్ ఆర్ట్ అనే ముంబై ఆధారిత సంస్థకు ఆర్ట్ కలెక్టర్ కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు. ఆక్షన్‌లు నిర్వహించడంలో మల్లికకు పూర్వ అనుభవం ఉంది. ఆమె గత 20 ఏళ్లగా వేలం నిర్వాహకురాలిగా పనిచేస్తున్నారు. 2001లో క్రిస్టీస్ ఆక్షన్ హౌస్‌లో వేలం నిర్వాహకురాలిగా తన కెరీర్ మొదలుపెట్టారు.
క్రిస్టీస్‌లో వేలం నిర్వహించిన భారత సంతతికి తొలి మహిళ ఆక్షనీర్‌గా మల్లికా నిలిచింది. ఇక క్రీడా వేలంలో కూడా ఆమెకు అనుభవం ఉంది. 2021లో ప్రొ కబడ్డీ లీగ్ వేలంలో తన వాక్ చాతుర్యంతో మల్లికా అందరిని అకట్టుకుంది. ఆ తర్వాత మహిళల ప్రీమియర్ లీగ్ తొట్టతొలి సీజన్‌కు సంబంధించిన వేలాన్ని కూడా మల్లికానే నిర్వహించింది. అదే విధంగా డిసెంబర్ 9న ముంబై వేదికగా జరిగిన డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ వేలంలో కూడా మల్లికానే ఆక్షనీర్. ఇప్పుడు మరోసారి వేలాన్ని దిగ్విజయంగా ముగించేందుకు మల్లికా సిద్దమైంది.
చదవండి: IPL 2024: నిన్న రోహిత్... తాజాగా సచిన్ గుడ్‌బై... ముంబై ఇండియన్స్‌లో ఏమవుతోంది?
Comments
Please login to add a commentAdd a comment