IPL Auctions
-
IPL Auction 2025 : పేస్ బౌలర్లకు పట్టం
ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన బౌలర్లలో ఒకడు... అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానం... టైటిల్ సహా దశాబ్దకాలం పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయాల్లో ప్రధాన పాత్ర పోషించిన పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ వేలంలో ఫ్రాంచైజీలను ఆకర్షించడంలో సఫలమయ్యాడు. రెండో రోజు వేలంలో భువీ (రూ.10 కోట్ల 75 లక్షలు) అత్యధిక ధరతో అగ్ర స్థానంలో నిలిచాడు. భువనేశ్వర్లాగే చెన్నై మూడు ట్రోఫీ విజయాల్లో కీలక బౌలర్‌గా నిలిచిన దీపక్ చహర్‌కు (రూ.9 కోట్ల 25 లక్షలు) భారీ మొత్తం దక్కింది. వీరిద్దరిని వరుసగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లు దక్కించుకున్నాయి. ప్రతీ జట్టుకూ భారత పేసర్ల అవసరం ఉండటంతో సోమవారం వేలంలో ఆకాశ్‌దీప్, ముకేశ్ కుమార్, తుషార్ దేశ్‌పాండేలకు మంచి విలువ లభించింది. విదేశీ ఆటగాళ్లలో మార్కో జాన్సెన్, విల్ జాక్స్‌లను ఫ్రాంచైజీలు తగిన మొత్తానికి సొంతం చేసుకున్నాయి. ఆరంభంలో ఆసక్తి చూపించకపోయినా... అజింక్య రహానే, దేవదత్ పడిక్కల్, ఉమ్రాన్ మాలిక్వంటి ఆటగాళ్లను చివర్లో టీమ్‌లు ఎంచుకున్నాయి. రెండో రోజు కూడా ఆస్ట్రేలియా డాషింగ్ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కు నిరాశ ఎదురవగా... కేన్ విలియమ్సన్, బెయిర్‌స్టో, మిచెల్, శార్దుల్ ఠాకూర్ తదితరులను ఫ్రాంచైజీలు దూరంగా ఉంచాయి. జిద్దా (సౌదీ అరేబియా): ఐపీఎల్–2025 కోసం రెండు రోజుల పాటు సాగిన వేలం సోమవారం ముగిసింది. మొత్తం 577 మంది క్రికెటర్లు వేలంలోకి రాగా... గరిష్టంగా 204 మంది క్రికెటర్లను ఎంచుకునే అవకాశం ఉండగా... 10 ఫ్రాంచైజీలు కలిపి మొత్తం 182 మంది ఆటగాళ్లనే వేలంలో తీసుకున్నాయి. వీరిలో 62 మంది విదేశీయులు కాగా... అన్ని జట్లూ కలిపి వేలంలో రూ.639.15 కోట్లు వెచ్చించాయి. ఐపీఎల్లో అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా బిహార్‌కు చెందిన వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. వేలంలో రాజస్తాన్ రూ.1 కోటీ 10 లక్షలకు ఎంచుకునే సమయానికి వైభవ్ వయసు 13 ఏళ్ల 243 రోజులు మాత్రమే. వైభవ్ ఇప్పటి వరకు 5 రంజీ మ్యాచ్‌లు, ఒక టి20 మ్యాచ్ ఆడాడు. అయితే ఇటీవల భారత అండర్–19 జట్టు సభ్యుడిగా ఆ్రస్టేలియా అండర్ –19 జట్టుతో జరిగిన నాలుగు రోజుల మ్యాచ్‌లో మెరుపు సెంచరీతో అందరి దృష్టినీ ఆకర్షించాడు. తొలి రోజు వేలం రికార్డులతో హోరెత్తించగా, రెండో రోజు కూడా పేరున్న ఆటగాళ్లకు మంచి మొత్తమే దక్కింది. సోమవారం జాబితాలో పెద్ద సంఖ్యలో యువ ఆటగాళ్లు బరిలో నిలవగా, కొందరిని అదృష్టం తలుపు తట్టింది. జాతీయ జట్టుకు ఆడని అన్క్యాప్డ్ ఆటగాళ్లను ఫ్రాంచైజీలు చివర్లో కనీస విలువకే తీసుకొని జట్టులో మిగిలిన ఖాళీలను నింపాయి. -
ఐపీఎల్ వేలం 2025 : అదిరే డ్రెస్‌లో నీతా అంబానీ, ధర ఎంతో తెలుసా?
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భార్య, రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ ఫ్యాషన్ స్టైల్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సమయానికి తగ్గట్టుగా డ్రెస్‌లను ఎంపిక చేసుకోవడంలో, ఫ్యాషన్‌ను, బిజినెస్‌ను మిళితం చేయడంలో నీతా తరువాతే ఎవరైనా అనేది అభిమానుల మాట మాత్రమే కాదు, ఫ్యాషన్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయం కూడా. తాజా ఐపీఎల్ -2025 వేలం సందర్భంగా మరోసారి తన స్టైల్‌తో అందర్నీ తనవైపు తిప్పుకుంది. నీతా అంబానీ నేవీ బ్యూ ప్యాంట్‌సూట్ ధరించి అందరినీ ఆకర్షించింది. అంతేకాదు ఆ డ్రెస్ ధర కూడా హాట్ టాపిక్‌గా నిలిచింది. ఐపీఎల్ టీం ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఓనర్ అయిన నీతా అంబానీ వైడ్-లెగ్ ప్యాంట్, బ్లూ సూట్లో హుందాగా కనిపించారు. నీతా ధరించిన ‘మజే’ బ్రాండ్‌కు చెందిన ఈ బ్రేజర్ సూట్ ధర అక్షరాలా 950 డాలర్లు. అంటే దాదాపు రూ.78 వేలు. ఇందులో బ్లేజర్ రూ. 47 వేలు కాగా వైడ్-లెగ్ ట్వీడ్ ట్రౌజర్ ధర సుమారు రూ. 31వేలు, మొత్తంగా ఆమె సూట్ ధర రూ.78 వేలు. అంతేనా వజ్రాలు పొదిగిన ఎంఐ బ్రూచ్, హ్యాండ్‌బ్యాగ్, డైమండ్ రింగ్, డైమండ్ చెవిపోగులు, సన్ గ్లాసెస్, వాచ్, హీల్స్ ఇలా అన్నీ ప్రత్యేకంగా కనిపించడం విశేషం. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani)nbsp;ఐపీఎల్ మెగా వేలం-2025 తొలి రౌండ్ విడత ప్రక్రియ దుబాయ్‌లోని జెడ్డాలో ఆదివారం జరిగిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2025 సీజన్ కోసం ముంబై ఇండియన్స్ ఐదుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. ఇందులో ఎంఐ నలుగురు సూపర్ స్టార్లు రోహిత్ శర్మ,హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాతోపాటు టీమిండియా యంగ్ ప్లేయర్ తిలక్ వర్మకూడా ఉన్నాడు. ముఖ్యంగా తిలక్ వర్మను రూ.8 కోట్లకు దక్కించుకోవడం విశేషంగా నిలిచింది. ఈ వేలంలో నీతా అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ కూడా పాల్గొన్నారు. -
ఐపీఎల్ వేలానికి సర్వం సిద్దం.. కొత్త ఆక్షనీర్ ప్రకటన! ఎవరీ మల్లికా సాగర్?
ఐపీఎల్-2024 వేలానికి సర్వం సిద్దమైంది. మంగళవారం(డిసెంబర్ 19) దుబాయ్ వేదికగా ఈ క్యాష్‌రిచ్ లీగ్ వేలం జరగనుంది. ఈ వేలంలో భారత్‌తో సహా 12 దేశాల నుంచి మొత్తం 333 మంది ఆటగాళ్లు పాల్గొననున్నారు. ఉన్న ఖాళీలు 77 మాత్రమే. ఈ క్రమంలో వేలంలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఐపీఎల్ ఫ్రాంచైజీలు దృష్టిపెట్టాయి. అయితే ఈసారి వేలాన్ని మల్లిక సాగర్ అడ్వానీ అనే మహిళ నిర్వహించనుంది. గత కొన్ని ఐపీఎల్ సీజన్లకు అక్షనిర్ వ్యవహరించిన హ్యూ ఎడ్మీడ్స్ స్ధానాన్ని మల్లిక సాగర్ భర్తీ చేయనుంది. ఈ మెరకు బీసీసీఐ ఆదివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. తద్వారా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో వేలం నిర్వహించనున్న తొలి మహిళా ఆక్షనిర్‌గా మల్లిక నిలవనుంది. ఈ క్రమంలో ఆమె గురించి నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. ఎవరీ మల్లికా సాగర్? 48 ఏళ్ల మల్లికా సాగర్ ముంబై చెందిన ఓ ఆర్ట్ కలెక్టర్. ఆమె మోడ్రన్ అండ్ కాన్టెంపరరీ ఇండియన్ ఆర్ట్ అనే ముంబై ఆధారిత సంస్థకు ఆర్ట్ కలెక్టర్ కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు. ఆక్షన్లు నిర్వహించడంలో మల్లికకు పూర్వ అనుభవం ఉంది. ఆమె గత 20 ఏళ్లగా వేలం నిర్వాహకురాలిగా పనిచేస్తున్నారు. 2001లో క్రిస్టీస్ ఆక్షన్ హౌస్‌లో వేలం నిర్వాహకురాలిగా తన కెరీర్ మొదలుపెట్టారు. క్రిస్టీస్‌లో వేలం నిర్వహించిన భారత సంతతికి తొలి మహిళ ఆక్షనీర్‌గా మల్లికా నిలిచింది. ఇక క్రీడా వేలంలో కూడా ఆమెకు అనుభవం ఉంది. 2021లో ప్రొ కబడ్డీ లీగ్ వేలంలో తన వాక్ చాతుర్యంతో మల్లికా అందరిని అకట్టుకుంది. ఆ తర్వాత మహిళల ప్రీమియర్ లీగ్ తొట్టతొలి సీజన్‌కు సంబంధించిన వేలాన్ని కూడా మల్లికానే నిర్వహించింది. అదే విధంగా డిసెంబర్ 9న ముంబై వేదికగా జరిగిన డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ వేలంలో కూడా మల్లికానే ఆక్షనీర్. ఇప్పుడు మరోసారి వేలాన్ని దిగ్విజయంగా ముగించేందుకు మల్లికా సిద్దమైంది. చదవండి: IPL 2024: నిన్న రోహిత్... తాజాగా సచిన్ గుడ్‌బై... ముంబై ఇండియన్స్‌లో ఏమవుతోంది? -
IPL 2023 Auction: ఆ ముగ్గురూ సూపర్.. ఐపీఎల్ వేలం విశేషాలు
ఇంగ్లండ్ యువ ఆల్‌రౌండర్ స్యామ్ కరన్ పంట పండింది. ఇటీవల జరిగిన టి20 ప్రపంచకప్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచిన కరన్‌కు ఊహించినట్లుగానే ఐపీఎల్ వేలంలో భారీ మొత్తం పలికింది. పంజాబ్ కింగ్స్ టీమ్ అతడిని ఏకంగా రూ. 18 కోట్ల 50 లక్షలకు సొంతం చేసుకుంది. ఐపీఎల్ వేలంలో ఒక ఆటగాడికి పలికిన అత్యధిక ధర ఇదే కాగా... లీగ్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా కూడా 24 ఏళ్ల కరన్ నిలిచాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్ (2021లో రాజస్తాన్ రాయల్స్ రూ. 16 కోట్ల 25 లక్షలకు కొనుగోలు చేసింది) పేరిట ఉంది. వేలంలో మాత్రమే కాకుండా ఓవరాల్‌గా కూడా కరన్‌దే ఎక్కువ మొత్తం కావడం విశేషం. కోహ్లిని రీటెయిన్ చేసుకున్నప్పుడు కూడా బెంగళూరు... కేఎల్ రాహుల్ కోసం లక్నో గరిష్టంగా రూ. 17 కోట్లు చెల్లించాయి. ఇక అంచనాలకు అనుగుణంగా ఆల్‌రౌండర్లు కామెరాన్ గ్రీన్ (ఆస్ట్రేలియా), బెన్ స్టోక్స్ (ఇంగ్లండ్) కూడా భారీ మొత్తం పలకగా, ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌పై కూడా తొలి ఐపీఎల్‌లోనే కోట్ల వర్షం కురిసింది. అటు ఐపీఎల్లో, ఇటు అంతర్జాతీయ క్రికెట్లోనూ ‘నిలకడగా’ పేలవ ప్రదర్శన కనబర్చిన వెస్టిండీస్ వికెట్ కీపర్ నికోలస్ పూరన్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ చాలా పెద్ద మొత్తం ఖర్చు చేయడం అనూహ్యం. కొచ్చి: ఐపీఎల్ వేలంలో ఇంగ్లండ్ యువస్టార్ స్యామ్ కరన్ బాక్స్‌లు బద్దలు కొడితే ఆశ్చర్యపోవద్దు! వేలానికి ముందు పలువురు క్రికెట్ విశ్లేషకులు, మాజీల మాట ఇది. నిజంగానే ఈ మాట నిజమైంది. వారి అంచనా తప్పలేదు. ఎందుకంటే కరన్ బంతితో, బ్యాట్‌తో రెండు రకాలుగా ప్రభావం చూపించగల డని అత్యున్నత స్థాయిలో ఇప్పటికే రుజువైంది. ఇటీవల టి20 వరల్డ్‌కప్ ఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’... ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా కూడా నిలి చాడు. అన్నింటితో పాటు అతని వయసు 24 ఏళ్లే! సరిగ్గా ఇదే కోణంలో ఫ్రాంచైజీలు ఆలోచించాయి. అందుకే అతని కోసం పోటీ పడ్డాయి. ముంబైతో మొదలు పెడితే బెంగళూరు, రాజస్తాన్, చెన్నై, పంజాబ్ విలువను పెంచుకుంటూ పోయాయి. చివరకు ముంబై రూ.18 కోట్ల వరకు తీసుకురాగా, పంజాబ్ మరో రూ.50 లక్షలు పెంచి రూ. 18 కోట్ల 50 లక్షలకు కరన్‌ను సొంతం చేసుకుంది. 2019 ఐపీఎల్లో పంజాబ్ జట్టే కరన్‌కు రూ. 7 కోట్ల 20 లక్షలు చెల్లించింది. తర్వాతి రెండు సీజన్లు చెన్నైకి ఆడిన అతను గాయంతో గత సీజన్‌కు దూరమయ్యాడు. ఓవరాల్‌గా 32 ఐపీఎల్ మ్యాచ్‌లలో 9.21 ఎకానమీతో 32 వికెట్లు తీసిన కరన్... 149.77 స్ట్రయిక్‌రేట్‌తో 337 పరుగులు చేశాడు. ఆ ముగ్గురూ సూపర్... ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్, ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకడైన బెన్ స్టోక్స్‌కు సరైన విలువ లభించింది. అతని కోసం హైదరాబాద్, లక్నో మధ్య పోటీ తీవ్రంగా సాగింది. చివరకు రూ. 16 కోట్ల 25 లక్షలకు అతను చెన్నై జట్టులోకి చేరాడు. వేలంలో చెన్నై తరఫున అత్యధిక విలువ పలికిన ఆటగాడిగా దీపక్ చహర్ (రూ. 16 కోట్లు) రికార్డును స్టోక్స్ సవరించాడు. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ కోసం ముంబై ఇండియన్స్ భారీ మొత్తం (రూ. 17.5 కోట్లు) చెల్లించింది. ఓవరాల్‌గా టి20 రికార్డు గొప్పగా లేకపోయినా... ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగల నైపుణ్యం, ఆకట్టుకునే పేస్ బౌలింగ్‌తో పాటు ఇటీవల భారత గడ్డపై చేసిన రెండు ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీలు గ్రీన్ విలువను పెంచాయి. ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌ను పెద్ద మొత్తానికి (రూ. 13 కోట్ల 25 లక్షలు) సన్‌రైజర్స్ ఎంచుకుంది. దూకుడైన ఆటతో మిడిలార్డర్లో, ఫినిషర్‌గా సత్తా చాటగల బ్రూక్ ఇటీవల పాకిస్తాన్‌తో టి20 సిరీస్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు. గత ఐపీఎల్లో నికోలస్ పూరన్ సన్‌రైజర్స్ తరఫున 13 ఇన్నింగ్స్‌లలో కలిపి 306 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ ఒక్కటీ జట్టుకు చెప్పుకోదగ్గ విజయం అందించలేకపోయింది. నాడు అతనికి రైజర్స్ రూ. 10 కోట్ల 75 లక్షలు చెల్లించింది. ఇక ఇటీవలి వరల్డ్‌కప్‌లోనైతే అతను 5, 7, 13 చొప్పున పరుగులు చేశాడు. అయినా సరే, వేలంలో పోటీ బాగా కనిపించింది! ఎడంచేతి వాటం మిడిలార్డర్ బ్యాటర్ కావడం ఒక కారణం కావచ్చు. చివరకు రూ. 16 కోట్లకు లక్నో ఎంచుకోవడం విశేషం. వేలం ఇతర విశేషాలు ► అందరికంటే ముందుగా విలియమ్సన్ పేరు రాగా సన్‌రైజర్స్ పట్టించుకోలేదు. గుజరాత్ రూ. 2 కోట్లకు విలియమ్సన్‌ను తీసుకుంది. స్వదేశీ ఓపెనర్ అవసరం ఉన్న సన్‌రైజర్స్...చెన్నైతో చివరి వరకు పోటీ పడి మయాంక్ అగర్వాల్‌ను రూ. 8 కోట్ల 25 లక్షలకు తీసుకుంది. జింబాబ్వే ఆటగాడు సికందర్ రజాకు తొలి అవకాశం దక్కింది. పంజాబ్ కింగ్స్ రూ. 50 లక్షలకు సొంతం చేసుకుంది. ► ఆంధ్ర యువ క్రికెటర్ షేక్ రషీద్‌ను రూ. 20 లక్షలకు చెన్నై దక్కించుకుంది. ఆంధ్ర కీపర్ కోన శ్రీకర్ భరత్‌ను గుజరాత్ రూ. కోటీ 20 లక్షలకు తీసుకుంది. హైదరాబాద్ యువ ఆటగాడు భగత్ వర్మను రూ. 20 లక్షలకు చెన్నై... ఆంధ్ర ప్లేయర్ నితీశ్ రెడ్డిని రూ. 20 లక్షలకు సన్‌రైజర్స్ ఎంచుకున్నాయి. ఐర్లాండ్ బౌలర్ జోష్ లిటిల్ను రూ. 4 కోట్ల 40 లక్షలకు గుజరాత్ తీసుకుంది. ఐపీఎల్ ఆడ నున్న తొలి ఐర్లాండ్ ప్లేయర్‌గా లిటిల్ ఘనత వహిస్తాడు. -
పశువుల వేలం కంటే దారుణంగా ఉంది.. ఐపీఎల్ వేలంపై సీఎస్కే ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు
Robin Uthappa: ఐపీఎల్ వేలం గురించి చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు రాబిన్ ఉతప్ప సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ వేలం జరిగే తీరు అస్సలు బాగోలేదని, అది చూసినప్పుడు సంతలో పశువుల వేలాన్ని చూసిన ఫీలింగ్ కలుగుతుందని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఫ్రాంచైజీలు ఆటగాళ్ల కోసం పోటీపడుతుంటే.. ఏదో వస్తువు కోసం పోటీ పడుతున్న దారుణమైన ఫీలింగ్ కలుగుతుందని, వేలం సమయంలో ఆటగాళ్లు కూడా మనుషులేనన్న విషయాన్ని ఫ్రాంచైజీలు మరిచిపోయి ప్రవర్తిస్తాయని వాపోయాడు. వేలంలో‘అమ్ముడుపోని ఆటగాళ్ల మానసిక పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఎవరూ ఊహించలేరని, అది వర్ణించలేని బాధ కలిగిస్తుందని అన్నాడు. ఆటగాళ్ల కోసం వేలం భారత్‌లో మాత్రమే జరుగుతుందని, మున్ముందు ఈ ప్రక్రియకు స్వస్థి పలికితే బాగుంటుందని, అందరికీ మేలు జరిగేలా ముసాయిదా విధానం అమలులోకి వస్తే చాలా గౌరవప్రదంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. కాగా, ఐపీఎల్ 2022 మెగా వేలంలో రాబిన్ ఉతప్పను చెన్నై సూపర్ కింగ్స్ రూ. 2 కోట్ల బేస్ ధరకు కొనుగోలు చేసింది. గత సీజన్లో కూడా అతను ఇదే జట్టుకే ఆడాడు. సీఎస్కే లాంటి జట్టుకు ఆడాలన్నది తన కోరిక అని, అందు కోసం తాను, తన కొడుకు దేవుడిని ప్రార్ధిస్తున్నామని ఐపీఎల్ 2022 వేలానికి ముందు ఓ ఇంటర్వ్యూలో ఉతప్ప పేర్కొన్నాడు. రాబిన్ ఉతప్ప 2006 నుంచి 2015 మధ్యకాలంలో భారత్ తరఫున 46 వన్డేలు, 13 టీ20లు ఆడాడు. చదవండి: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టీమిండియా క్రికెటర్ -
ఐపీఎల్-2022 గెలుపు గుర్రాలకోసం ఫ్రాంఛైజీ వేట షురూ
-
బెర్త్‌లు 73 బరిలో 332
ముంబై: ఐపీఎల్–2020 వేటకు ముందు వేలం పాటకు రంగం సిద్ధమైంది. ఆల్రౌండర్లపై కోట్లు కురిపించేందుకు ఫ్రాంచైజీలు రెడీగా ఉన్నాయి. మ్యాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా), క్రిస్ మోరిస్ (దక్షిణాఫ్రికా)లతో పాటు పేసర్ కమిన్స్ (ఆ్రస్టేలియా) ఈ వేలంలో హాట్ కేక్‌లు కావొచ్చని ఐపీఎల్ వర్గాలు భావిస్తున్నాయి. కోల్‌కతాలో ఈ నెల 19న అందుబాటులో ఉన్న 73 బెర్త్‌ల కోసం జరిగే ఆటగాళ్ల వేలంలో బ్యాట్స్‌మెన్ ఫించ్, క్రిస్ లిన్, జాసన్ రాయ్, మోర్గాన్, రాబిన్ ఉతప్పలను తొలి రౌండ్లోనే చేజిక్కించుకునేందుకు ఫ్రాంచైజీ లు ఉత్సాహం చూపించనున్నాయి. వేలానికి అందుబాటులో ఉన్న ఆటగాళ్ల తుది జాబితాను ఐపీఎల్ పాలక మండలి బుధవారం ఫ్రాంచైజీలకు అందజేసింది. తొలిదశలో 971 మంది వున్న జాబితాను 332 మందికి కుదించింది. ఈ తుది జాబితాలో 19 మంది భారత ఆటగాళ్లతో పాటు ఫ్రాంచైజీల కోరిన 24 మంది క్రికెటర్లున్నారు. ఇందులో విండీస్ పేసర్ విలియమ్స్, ఆల్‌రౌండర్ క్రిస్టియన్, లెగ్ స్పిన్నర్ జంపా (ఆసీస్), బంగ్లాదేశ్ మాజీ కెపె్టన్ ముషి్ఫకర్ ప్రముఖులు కాగా... సర్రే యువ బ్యాట్స్‌మన్ విల్ జాక్స్ కొత్త కుర్రాడు. ఇతను యూఏఈలో జరిగిన టి10 మ్యాచ్‌లో 25 బంతుల్లోనే ‘శత’క్కొట్టాడు. లాంక్షైర్తో జరిగిన మ్యాచ్ లో జాక్స్ 30 బంతుల్లో 11 సిక్సర్లు, 8 బౌండరీలతో 105 పరుగులు చేశాడు. ప్యారీ వేసిన ఓవర్లో అయితే 6బంతుల్లో 6 సిక్సర్లు బాదేశాడు. దీంతో ఈ మెరుపు వీరుడిపై ఫ్రాంచైజీలు పోటీపడే అవకాశముంది. ►వేలం వరుసలో ముందుగా బ్యాట్స్‌మెన్ వస్తారు. ఆ తర్వాతే ఆల్‌రౌండర్లు, కీపర్లు, పేసర్లు, స్పిన్నర్లు వస్తారు. తాజా జాబితాలో అత్యధిక ప్రాథమిక ధర కలిగిన ఏడుగురు ఆటగాళ్లున్నారు. మ్యాక్స్‌వెల్, కమిన్స్, హాజల్‌వుడ్, మార్ష్, స్టెయిన్, మాథ్యూస్, మోరిస్ల ప్రాథమిక ధర రూ. 2 కోట్లు కాగా... రాబిన్ ఉతప్ప రూ. కోటిన్నరతో తర్వాతి స్థానంలో ఉన్నాడు. -
కపిల్‌కు రూ.25 కోట్లిచ్చేవారు: గావస్కర్
దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్‌దేవ్ ఈ తరం క్రికెటర్ అయి ఉంటే... ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీలు అతడిని చేజిక్కించుకునేందుకు యుద్ధమే చేసేవని, అందరికంటే అత్యధికంగా రూ.25 కోట్లు పలికేవాడని భారత మేటి బ్యాట్స్‌మన్ సునీల్ గావస్కర్ అన్నాడు. తద్వారా మాజీ సహచరుడి గొప్పదనం ఏపాటిదో ఒక్క మాటలో చెప్పేశాడు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో కపిల్‌తో కలిసి పాల్గొన్న గావస్కర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. దీనికి బిగ్గరగా నవ్విన కపిల్... తానెంతగానో అభిమానించే క్రికెట్లో ఇంత పెద్దమొత్తంలో డబ్బు వస్తోందంటే నమ్మలేకపోతున్నానన్నాడు. -
ఐపీఎల్-7 వేలం ప్రారంభం
-
ఐపీఎల్-7 వేలం ప్రారంభం: యువరాజ్ ధర రూ.14 కోట్లు
ముంబై: ఐపీఎల్-7 వేలం పాటలు ప్రారంభమయ్యాయి. యువరాజ్ సింగ్ ధర 14 కోట్ల రూపాయలు ధర పలికాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యువరాజ్‌ను దక్కించుకుంది. ఢిల్లీ డేర్ డెవిల్స్ కెవిన్ పీటర్సన్‌ను 9 కోట్ల రూపాయలకు, మురళీ విజయ్ను 5 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. నైట్‌రైడర్స్ కల్లిస్‌ను 5 కోట్ల 50 లక్షల రూపాయలకు దక్కించుకుంది. పంజాబ్ మిషెల్ జాన్సన్‌ను 5 కోట్ల 50 లక్షల రూపాయలకు, సెహ్వాగ్‌ను 3 కోట్ల 20 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది. డేవిడ్ వార్నర్‌ను హైదరాబాద్ దక్కించుకుంది.