
ముంబై: ఐపీఎల్–2020 వేటకు ముందు వేలం పాటకు రంగం సిద్ధమైంది. ఆల్‌రౌండర్లపై కోట్లు కురిపించేందుకు ఫ్రాంచైజీలు రెడీగా ఉన్నాయి. మ్యాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా), క్రిస్ మోరిస్ (దక్షిణాఫ్రికా)లతో పాటు పేసర్ కమిన్స్ (ఆ్రస్టేలియా) ఈ వేలంలో హాట్ కేక్‌లు కావొచ్చని ఐపీఎల్ వర్గాలు భావిస్తున్నాయి. కోల్‌కతాలో ఈ నెల 19న అందుబాటులో ఉన్న 73 బెర్త్‌ల కోసం జరిగే ఆటగాళ్ల వేలంలో బ్యాట్స్‌మెన్ ఫించ్, క్రిస్ లిన్, జాసన్ రాయ్, మోర్గాన్, రాబిన్ ఉతప్పలను తొలి రౌండ్‌లోనే చేజిక్కించుకునేందుకు ఫ్రాంచైజీ లు ఉత్సాహం చూపించనున్నాయి.
వేలానికి అందుబాటులో ఉన్న ఆటగాళ్ల తుది జాబితాను ఐపీఎల్ పాలక మండలి బుధవారం ఫ్రాంచైజీలకు అందజేసింది. తొలిదశలో 971 మంది వున్న జాబితాను 332 మందికి కుదించింది. ఈ తుది జాబితాలో 19 మంది భారత ఆటగాళ్లతో పాటు ఫ్రాంచైజీల కోరిన 24 మంది క్రికెటర్లున్నారు. ఇందులో విండీస్ పేసర్ విలియమ్స్, ఆల్‌రౌండర్ క్రిస్టియన్, లెగ్ స్పిన్నర్ జంపా (ఆసీస్), బంగ్లాదేశ్ మాజీ కెపె్టన్ ముషి్ఫకర్ ప్రముఖులు కాగా... సర్రే యువ బ్యాట్స్‌మన్ విల్ జాక్స్ కొత్త కుర్రాడు. ఇతను యూఏఈలో జరిగిన టి10 మ్యాచ్‌లో 25 బంతుల్లోనే ‘శత’క్కొట్టాడు. లాంక్‌షైర్‌తో జరిగిన మ్యాచ్ లో జాక్స్ 30 బంతుల్లో 11 సిక్సర్లు, 8 బౌండరీలతో 105 పరుగులు చేశాడు. ప్యారీ వేసిన ఓవర్లో అయితే 6బంతుల్లో 6 సిక్సర్లు బాదేశాడు. దీంతో ఈ మెరుపు వీరుడిపై ఫ్రాంచైజీలు పోటీపడే అవకాశముంది.
►వేలం వరుసలో ముందుగా బ్యాట్స్‌మెన్ వస్తారు. ఆ తర్వాతే ఆల్‌రౌండర్లు, కీపర్లు, పేసర్లు, స్పిన్నర్లు వస్తారు. తాజా జాబితాలో అత్యధిక ప్రాథమిక ధర కలిగిన ఏడుగురు ఆటగాళ్లున్నారు. మ్యాక్స్‌వెల్, కమిన్స్, హాజల్‌వుడ్, మార్ష్, స్టెయిన్, మాథ్యూస్, మోరిస్‌ల ప్రాథమిక ధర రూ. 2 కోట్లు కాగా... రాబిన్ ఉతప్ప రూ. కోటిన్నరతో తర్వాతి స్థానంలో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment