మహేంద్ర ధోని (PC: IPL)
టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ గురించి సౌతాఫ్రికా దిగ్గజ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోని ఓ సర్‌ప్రైజ్ ప్యాకేజ్ అని.. అతడి భవిష్యత్తు గురించి అంచనా వేయడం ఎవరికీ సాధ్యం కాదని పేర్కొన్నాడు. ఏదేమైనా.. ఐపీఎల్- 2024 వేలం నేపథ్యంలో సీఎస్‌కే ఫ్రాంచైజీ తీసుకున్న నిర్ణయం తనకు సంతోషాన్నిచ్చిందని హర్షం వ్యక్తం చేశాడు
కాగా ఐపీఎల్-2023 లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అంతకుముందు సీజన్లో ఘోరంగా విఫలమైన చెన్నైని ధోని తన అద్భుత కెప్టెన్సీతో తదుపరి ఎడిషన్లో మరోసారి చాంపియన్‌గా నిలిపాడు. రికార్డు స్థాయిలో ఏకంగా ఐదోసారి ట్రోఫీ అందించాడు.
అయితే.. 41 ఏళ్ల ధోని వయసు దృష్ట్యా అతడు వచ్చే ఏడాది ఐపీఎల్‌కు వీడ్కోలు పలుకుతాడని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ.. రిటెన్షన్ గడువు ముగిసే నేపథ్యంలో సీఎస్‌కే తమ రిటెన్షన్ లిస్టులో ధోనీ పేరును చేర్చడం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
ఈ నేపథ్యంలో ఏబీ డివిలియర్స్ స్పందిస్తూ.. ధోని మరో రెండు మూడేళ్ల పాటు ఐపీఎల్లో కొనసాగే సత్తా ఉన్న ఆటగాడని అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు.. రిటెన్షన్లో అతడి పేరు చూడగానే నాకు సంతోషంగా అనిపించింది. గత సీజన్ అతడికి చివరిది అవుతుంది అంటూ వార్తలు వినిపించాయి. అయితే అతడు 2024 సీజన్ కూడా ఆడేందుకు సిద్ధమయ్యాడు.
ధోని అంటే సర్‌ప్రైజ్ ప్యాకేజ్ ఇంకో రెండు.. మూడు ఏళ్ల పాటు అతడు ఐపీఎల్‌లో కొనసాగే అవకాశం ఉంది. ఏదేమైనా వచ్చే ఎడిషన్‌లో అతడు కనిపించనుండటం నాకు నిజంగా సంతోషాన్నిస్తోంది అని పేర్కొన్నారు. కాగా గత సీజన్లో మోకాలికి గాయమైనప్పటికీ ధోని ఒక్క మ్యాచ్ కూడా మిస్ కాకుండా జట్టును టైటిల్ విజేతగా నిలిపాడు
Comments
Please login to add a commentAdd a comment