
ఐపీఎల్-2024 సీజన్ వేలానికి ముందు తమిళనాడు స్టార్ ఆల్‌రౌండర్ షారుఖ్ ఖాన్ ను పంజాబ్ కింగ్స్ విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. ఐపీఎల్-2021 మినీ వేలంలో రూ.9 కోట్ల భారీ ధరకు షారుఖ్ ఖాన్‌ను పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. అయితే ఫినిషర్‌గా పంజాబ్ జట్టులోకి వచ్చిన షారూఖ్ తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమయ్యాడు.
3 సీజన్ల పాటు పంజాబ్ కింగ్స్ తరపున 33 మ్యాచ్‌లు ఆడిన ఆడిన అతడు 134.81 స్ట్రైక్ రేట్‌తో కేవలం 426 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలోనే అతడిని పంజాబ్ కింగ్స్ ఈసారి విడిచిపెట్టింది. ఇక ఇది ఇలా ఉండగా.. వేలంలోకి వచ్చిన షారుఖ్ ఖాన్ మరోసారి భారీ ధరకు అమ్ముడుపోతాడని టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. షారుఖ్ ఖాన్ కోసం వేలంలో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ జట్లు కచ్చితంగా పోటీపడతాయి. గుజరాత్ హార్దిక్ పాండ్యాను విడిచిపెట్టింది కాబట్టి ఆ జట్టు ఇప్పుడు ఒక ఫినిషర్ కావాలి.
ఈ నేపథ్యంలో అతడిని సొంతం చేసుకునేందుకు గుజరాత్ ప్రయత్నిస్తోంది. అదే విధంగా చెన్నైకు బెన్ స్టోక్స్ కూడా లేడు, దీంతో సీఎస్‌కే కూడా అతడిని దక్కించుకునేందుకు శ్రమిస్తోంది. ఇప్పటివరకు షారుఖ్ పంజాబ్ కింగ్స్‌తో 9 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. కానీ ఈసారి అతడిని పంజాబ్ కింగ్స్ రిటైన్ చేసుకోలేదు. అతడు మళ్లీ రూ.12 నుంచి 13 కోట్లకు అమ్ముడుపోతడాని అశ్విన్ జోస్యం చెప్పాడు. కాగా ఐపీఎల్-2024 సీజన్‌కు సంబంధించిన మినీ వేలం డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా జరగనుంది.
చదవండి: IND vs SA: దక్షిణాఫ్రికాతో టీ20, వన్డే సిరీస్.. టీమిండియా కెప్టెన్‌గా కేఎల్ రాహుల్!?
Comments
Please login to add a commentAdd a comment